E-Paper
Advertisement

రెండూ ఒకటే అనుకుంటే పొరపాటే.. అరటిపండు-అరటికాయ మధ్య ఇంత తేడా ఉందా!

రెండూ ఒకటే అనుకుంటే పొరపాటే.. అరటిపండు-అరటికాయ మధ్య ఇంత తేడా ఉందా!
Advertisement

Banana Vs Plantain: చూడటానికి ఒకేలా కనిపించే అరటిపండు, పచ్చి అరటికాయ రెండూ ఒకటే అనుకుంటే పొరపాటే. పై తొక్కను బట్టి ఇవి ఒకే కుటుంబానికి చెందినవిగా అనిపించినా, వీటి రుచి, ఉపయోగించే విధానంలో చాలా మార్పులు ఉన్నాయి. వంటల్లో వీటి పాత్ర పూర్తిగా భిన్నంగా ఉంటుంది.

మనం రోజూ తినే అరటిపండ్లు సాధారణంగా పరిమాణంలో కొంచెం చిన్నగా, మెత్తగా ఉంటాయి. వీటిలో పిండిపదార్థం (స్టార్చ్) తక్కువగా, సహజ సిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇవి బాగా తియ్యగా ఉంటాయి. తొక్క తీసి నేరుగా తినేయడానికి, స్మూతీలు, ఫ్రూట్ సలాడ్లు చేసుకోవడానికి ఇవి సరిపోతాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇది తక్షణ శక్తినిచ్చే అద్భుతమైన ఫలహారం.

Advertisement

Also Read: ఫ్రెంచ్ ఫ్రైస్, బజ్జీలు వేడి నూనెలో వేయగానే గోల్డెన్ బ్రౌన్‌గా ఎందుకు మారతాయి? అసలు సీక్రెట్ ఇదే!

మరోవైపు ప్లాంటైన్ (పచ్చి అరటి) కాస్త పొడవుగా, గట్టిగా ఉంటుంది. దీంట్లో చక్కెర శాతం తక్కువ, స్టార్చ్ ఎక్కువ. అందుకే దీన్ని పచ్చిగా తినలేము. తిన్నా కూడా కాస్త చప్పగా లేదా వగరుగా అనిపిస్తుంది. మన దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో దీన్ని వంటల్లో ఒక ముఖ్యమైన కూరగాయగా వాడతారు. ఉడకబెట్టడం, వేయించడం లేదా చిప్స్ చేసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది.

Advertisement

ప్లాంటైన్ పక్వానికి వచ్చే కొద్దీ దాని రంగు ఆకుపచ్చ నుండి పసుపు, ఆ తర్వాత నలుపు రంగులోకి మారుతుంది. పచ్చగా ఉన్నప్పుడు కూరలు, వేపుళ్లు, చిప్స్ లాంటి కారంగా ఉండే వంటకాలకు వాడుకుంటే.. బాగా పండిన తర్వాత (నల్లగా మారాక) కాస్త తియ్యటి వంటకాలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. అంటే ఇది పండే కొద్దీ వండే విధానం కూడా మారిపోతుందన్నమాట.

సంక్షిప్తంగా చెప్పాలంటే.. మనం తినే సాధారణ అరటిపండు ఒక తియ్యటి పండు (డెజర్ట్) అయితే, ప్లాంటైన్ మాత్రం వంటగదిలో కూరగాయలా వ్యవహరిస్తుంది. రూపురేఖలు ఒకేలా ఉన్నా, ఒకటేమో నేరుగా నోట్లోకి వెళ్తుంది, ఇంకోటేమో స్టవ్ మీదికి వెళ్తుంది.

Also Read: బట్టల రంగును బట్టి మనుషులను అంచనా వేస్తారా? కలర్ సైకాలజీ ఏం చెబుతోందంటే?

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×