Color Psychology: మనం వేసుకునే దుస్తుల రంగులు మన వ్యక్తిత్వాన్ని, ఎదుటివారికి మనపై ఉండే అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే కొన్ని రంగులు మనల్ని కొంచెం చురుకుదనం తక్కువగా ఉన్నవారిలా చూపిస్తాయని రంగుల మనస్తత్వ శాస్త్రం (కలర్ సైకాలజీ) చెబుతోంది. నిజానికి రంగులు ఎవరి ఐక్యూనో మార్చలేవు కానీ, సమాజంలో మన ఇమేజ్‌ని మాత్రం ప్రభావితం చేయగలవు.
బూడిద (గ్రే) రంగును చాలామంది ఇష్టపడతారు. కానీ ఈ రంగు ఎక్కువగా వాడటం వల్ల మనలో ఎలాంటి ఉత్సాహం లేదన్నట్లు కనిపిస్తుంది. ఎప్పుడూ నిర్ణయాలు తీసుకోకుండా తటస్థంగా ఉండే మనస్తత్వాన్ని ఇది సూచిస్తుంది. కష్టాల నుంచి తప్పించుకునే గుణం, కొత్త విషయాలపై ఆసక్తి లేకపోవడం వంటి నెగెటివ్ ఇంప్రెషన్‌ను ఇది ఎదుటివారిలో కలిగిస్తుంది.
నలుపు రంగు మనకు గంభీరత్వాన్ని, అందాన్ని ఇస్తుంది. కానీ, నిత్యం నలుపు రంగు దుస్తులనే ధరిస్తే అది మనలోని మొండితనాన్ని, మార్పును అంగీకరించని గుణాన్ని చూపిస్తుంది. కొత్త ఆలోచనలను స్వాగతించని వారిగా మనల్ని ఇతరులు చూసే ప్రమాదం ఉంది. పైగా ఇది ఇతరులతో సులభంగా మాట్లాడకుండా ఒక పెద్ద గోడను కడుతుంది.
Also Read: లాండ్రీ డ్రైయర్‌లో అల్యూమినియం ఫాయిల్.. ప్రతి గృహిణీ తెలుసుకోవాల్సిన సీక్రెట్ ట్రిక్!
బేజ్, ఎర్త్ టోన్స్ (మట్టి రంగులు) సాధారణంగా ఉన్నదాంట్లోనే సర్దుకుపోయే మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. కొత్తగా ఏదైనా సాధించాలనే తపన లేదా సృజనాత్మకత లోపించినట్లుగా ఈ రంగులు సంకేతాలు ఇస్తాయి. సమాజంలో ఎదగాలనే ఆశయం లేనట్లు, కేవలం గుంపులో గోవిందాలా కలిసిపోవాలని అనుకుంటున్నట్లు ఈ రంగులు ప్రదర్శిస్తాయి.
ఈ రంగులు వేసుకున్నంత మాత్రాన ఒకరి తెలివితేటలు లేదా సృజనాత్మకత తగ్గిపోవు. నిజమైన ప్రతిభకు, బట్టల రంగుకు ఎలాంటి సంబంధం లేదు. కానీ, చూసే సమాజానికి మాత్రం ఆ వ్యక్తి నిస్తేజంగా, నాయకత్వ లక్షణాలు లేనివాడిగా కనిపించే అవకాశం ఉంది.
మొదటి చూపులోనే మనుషులను అంచనా వేసే ఈ రోజుల్లో.. రంగుల ఎంపికపై కొద్దిగా అవగాహన ఉండటం మంచిదే. మన నిజమైన ప్రతిభను అణచివేయకుండా, మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే రంగులను ఎంచుకోవడం ద్వారా సమాజంలో మనకు నచ్చిన గుర్తింపును సాధించుకోవచ్చు.
Also Read: చీపురను ఉప్పు నీటిలో నానబెడితే.. ఆ సమస్యలన్నీ మాయం, నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ ట్రిక్!