Belching: తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వకపోతే అడపాదడపా వచ్చే తేన్పులు సర్వసాధారణం. అయితే కొంతమందికి పదే పదే పుల్లటి తేన్పులొస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. ముఖ్యంగా అజీర్తి సమస్య ఉన్నవారికి తేన్పులు కూడా అధికంగానే వస్తుంటాయి. ఇవి విపరీతంగా రావడానికి అనేక కారణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే కొన్ని రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా కొందరికి పొట్టలో గ్యాస్ ఏర్పడి తేన్పులు వస్తుంటాయి. ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ.. అస్తమానం విసిగిస్తుంటే మాత్రం ఈ హోమ్ రెమిడీస్ ట్రై చేయమని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్.
అస్తమానం తేన్పులు వస్తుంటే.. ఒక పచ్చి అరటికాయలో పావు వంతు ముక్కను కట్ చేసుకుని, దాని పొట్టు తీసేసి తినేయండి. ఇలా పూటకు ఒకసారి తినాల్సి ఉంటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా. తేన్పులు కూడా తగ్గిపోతాయి. అలాగే గ్యాస్ సమస్య నుంచి సైతం ఉపశమనం పొందవచ్చు.
Also Read: వింటర్ ఎఫెక్ట్-సైనస్ వేధిస్తోందా.. డోంట్ వర్రీ, ఈ చిట్కాలు పాటిస్తే ఫుల్ రిలీఫ్!
తేన్పుల సమస్యను తగ్గించుకోవాలంటే రోజూ భోజనం చేసిన తర్వాత రెండు లవంగాల్ని నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. దీనివల్ల ఆ సమస్య ఇట్టే పారిపోతుంది. అలాగే రోజుకు రెండుసార్లు ఒక గ్లాస్ చొప్పున కొబ్బరినీళ్లు తాగిన ఫలితం ఉంటుంది. లేదంటే ఒక టీస్పూన్ చొప్పున వాము, మిరియాలును తీసుకుని కలిపి దంచాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా తేనె కలిపి రోజుకు రెండు సార్లు తినాలి. ఇలా తరచూ చేస్తుంటే తేన్పులు క్రమంగా తగ్గిపోతాయి.
తేన్పుల సమస్యకు అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. భోజనానికి ముందు ఒక టీస్పూన్ అల్లం రసం తీసుకోండి. ఇలా రోజుకు మూడు పూటలా చేయాలి అలాగే భోజనం తర్వాత గుప్పెడు సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి మింగాలి. మరో చిట్కా ఏంటంటే.. పుదీనా ఆకుల రసాన్ని ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని దాన్ని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి సేవిస్తుండాలి. అదేవిధంగా.. కమోమిల్ టీ కూడా తేన్పుల సమస్యకు బాగానే పనిచేస్తుంది.
బ్రేవ్ బ్రేవ్ మంటూ అస్తమానం వేధించే తేన్సుల సమస్య ఉన్నవాళ్లు తేల్లిగా జీర్ణం అయ్యే ఆహారాలను మాత్రమే తీసుకోవాలి. కారం, మసాలాలు అధికంగా ఉండే ఆహారాలు, నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్‌ను దూరం పెట్టాలి. ఈ క్రమంలో పెరుగు, మజ్జిగను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ప్రో బయోటిక్ ఆహారాలు కాబట్టి వీటిని తీసుకుంటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే తేన్పుల సమస్య ఉన్నవాళ్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలి.
Also Read: ఈ సందేహం మీకూ ఉందా.. పీరియడ్స్ టైంలో తలస్నానం చేయాలా? వద్దా?