E-Paper
Advertisement

Sinus Problem: వింటర్ ఎఫెక్ట్-సైనస్ వేధిస్తోందా.. డోంట్ వర్రీ, ఈ చిట్కాలు పాటిస్తే ఫుల్ రిలీఫ్!

Sinus Problem: వింటర్ ఎఫెక్ట్-సైనస్ వేధిస్తోందా.. డోంట్ వర్రీ, ఈ చిట్కాలు పాటిస్తే ఫుల్ రిలీఫ్!
Advertisement

Sinus Problem: ప్రస్తుతం సైనస్ అనేది  సాధారణ సమస్యగా మారిపోయింది. ఇది శీతాకాలంలో మరింత ఇబ్బంది పెడుతుంటుంది. వాతావరణం చల్లబడే కొద్దీ భరించలేని తలనొప్పి, జలుబు, గొంతు నొప్పి, ముక్కుదిబ్బడ, కళ్ల కిందిభాగంలో గుంజుతున్నట్టు అనిపించడం, తరచూ తుమ్ములు రావడం.. ఇలా అనేక విధాలుగా సైనస్ సమస్యలు వేధిస్తుంటాయి. అయితే, దీని ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యం చేస్తే బ్రైన్‌ ఫీవర్‌కు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో ఈ సైనస్ సమస్యను తుడిచిపెట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలని సూచిస్తున్నారు.

సైనస్ ఎందుకొస్తుంది?

జలుబు, దగ్గు, తుమ్ములు, తలనొప్పి ఎన్నిరోజులైనా తగ్గకుండా.. ముఖంలో ఉండే సైనసిస్​ అనే గాలి గదుల్లో వచ్చే ఇన్ఫెక్షన్‌ను సైనసైటిస్ అంటారు. ఈ సైనసిస్‌లనేవి కళ్లకు మధ్యలో రెండు, బుగ్గల దగ్గర రెండు, నుదుటి వెనుక రెండు, మెదడు భాగంలో మరో రెండు ఉంటాయి. ఈ ఎనిమిది సైనసిస్ గదులన్నీ గాలితో నిండి ఉంటాయి. ఇవి మనం తీసుకునే గాలిని శరీరం టెంపరేచర్‌‌కు తగ్గట్టు వేడిగా, తేమగా ఉండేలా చూస్తాయి. ఈ​ గదులకు గాయమైనా, ఇన్ఫెక్షన్ సోకినా సైనసైటిస్‌గా మారుతుంది. చల్లని గాలి, దుమ్ము, ధూళి, కాస్మొటిక్స్, పొల్యూషన్ వల్ల వాతావరణంలో విడుదలయ్యే కెమికల్స్, పెట్స్, స్విమ్మింగ్ పూల్ వాటర్‌‌లో ఉండే క్లోరిన్.. ఇలా రకరకాల​ అలర్జీలు సైనసైటిస్​ రిస్కును పెంచే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Read Also: ఆ టైంలో మొలకెత్తిన పెసర్లు తిన్నారో.. బరువు తగ్గి నాజూగ్గా కనిపించడం పక్కా!

లక్షణాలివే:

ఈ ఎనిమిది సైనస్ గదులన్నీ ముక్కుతో కనెక్ట్ అయ్యి ఉండటంతో.. సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ముందుగా ముక్కు పట్టేస్తుంది. కొన్నిసార్లు ముక్కు కారడంతో పాటు తుమ్ములు, ఆ వెంటనే దగ్గు వచ్చేస్తుంటుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంగా ఉండటం, కళ్లు, చెవులు, దంతాల చుట్టూ నొప్పి ఏర్పడవచ్చు. కొన్నిసార్లు ముక్కు వెనుక భాగం నుంచి గొంతు లోపలికి లిక్విడ్స్ విడదలవ్వడంతో పొడిదగ్గు కూడా వస్తుంటుంది.

Advertisement

అలాగే సైనస్ తీవ్రతరం అయినప్పుడు చాలామందికి ముఖమంతా నొప్పి పెడుతుంది. కొందరికి ముక్కు, కళ్ల దగ్గర వాపు కనిపిస్తుంది. కనుబొమ్మల దగ్గర జివ్వుమని లాగుతుంది. సైనసైటిస్​ ఎక్కువయ్యే కొద్దీ తలనొప్పి పెరుగుతుంటుంది. మధుమేహుల్లో, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నవాళ్లు, వయసు పైబడిన వాళ్లలో సైనస్ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇదిగో హోమ్ రెమిడీస్:

* శీతాకాలంలో ఎక్కువగా సైనస్ సమస్య వేధిస్తుంటే.. ఆవిరి పడితే నొప్పి తగ్గుతుందని NCBI నివేదిక పేర్కొంది. ఇది పాత టెక్నిక్‌ అయినప్పటికీ.. ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఆవిరి పట్టడం వలన ముక్కు భాగాలు తెరుచుకుంటాయి. దీంతో సైనస్ ఒత్తిడి తగ్గుతుంది.
* సైనస్ ఇబ్బంది పెడుతున్నప్పుటు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం ముఖ్యం. తలనొప్పి, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందాలంటే శరీరానికి సరిపడా నీళ్లు తాగాలి. గోరువెచ్చని నీళ్లు తాగితే ఇంకా మంచిది. వీటితో పాటు వేడి వేడి సూపులు కూడా తాగవచ్చు.
* అలాగే శీతాకాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలి. అలాగే ఒత్తిడిని తగ్గించేలా సమయం దొరికినప్పుడల్లా విశ్రాంతి తీసుకోవాలి. ప్రశాంతమైన నిద్ర మాత్రమే మన నుంచి సైనస్‌ ఇన్ఫెక్షన్లను దూరం చేయగలదు.
* సైనస్‌ తీవ్రత అధికమైనప్పుడు.. గోరువెచ్చని నీటిలో టవల్‌ ముంచి, ముక్కు, బుగ్గల దగ్గర కాపడం పెట్టండి. ఇలా చేస్తే.. సైనస్ నుంచి తక్షణ రిలీఫ్‌ పొందవచ్చు. సైనసైటిస్‌ నొప్పి, ఒత్తిడిని తగ్గించడానికి ఇదే బెస్ట్ ఎఫెక్టివ్‌ హోం రెమిడీ.
* అలాగే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కూడా సైనస్ సమస్యను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో పెప్పర్‌మెంట్‌ ఆయిల్‌ బెస్ట్ ఆప్షన్. గోరు వెచ్చని నీటిలో కొన్ని చుక్కల పెప్పర్‌మెంట్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పీల్చితే.. సైనస్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

Read Also: క్యాప్సికమంటే మొహం చిట్లించుకుంటున్నారా?.. శీతాకాలంలో తింటే లెక్కలేనన్ని ప్రయోజనాలు!

Related News

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

వర్షాకాలంలో జుట్టు రాలడం, చుండ్రు సమస్యలా ?

టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

ప్రతిరోజూ సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? ఈ 10 అలవాట్లు మీ జీవితాన్ని మార్చగలవు

చిన్న కిచెన్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. టాప్ 5 స్పేస్-సేవింగ్ ఫ్రిజ్‌లు బడ్జెట్ ధరలోనే

Big Stories

Advertisement
×