E-Paper
Advertisement

Head Bath: ఈ సందేహం మీకూ ఉందా.. పీరియడ్స్ టైంలో తలస్నానం చేయాలా? వద్దా?

Head Bath: ఈ సందేహం మీకూ ఉందా.. పీరియడ్స్ టైంలో తలస్నానం చేయాలా? వద్దా?
Advertisement

Head Bath: నెలసరి సమయంలో మహిళలు తలస్నానం చేయకూడదని కొంతమంది పెద్దలు ఇప్పటికీ చెబుతుంటారు. దీంతో స్త్రీలు పీరియడ్స్‌లో ఉన్నప్పుడు హెడ్ బాత్ చెయ్యాలా, వద్దా? అని కాస్త గందరగోళానికి గురవుతుంటారు. ఈ అపోహ పాతకాలం నుంచి ఈ ఆధునిక కాలంలోనూ కొనసాగుతోంది. ముఖ్యంగా సంప్రదాయాలను పాటించే కుటుంబాల్లో ఇలాంటి ఆచారాలను మరీ గట్టిగా నమ్ముతుంటారు. మరి ఈ విషయంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..

ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవు:

నెలసరి వచ్చినప్పుడు చల్లని నీటితో తలస్నానం చేస్తే జలుబు చేస్తుందని, ఎక్కువ బ్లీడింగ్ అవుతుందనే మాటలు ఇప్పటికీ వినిపిస్తుంటాయి. కానీ ఇవేవీ శాస్త్రీయంగా నిరూపితం కాలేదు. నెలసరి సమయంలో తలస్నానం చేయకూడదు అనేది కేవలం ఒక అపోహ మాత్రమే అనే నిజాన్ని చాలామంది గ్రహించాల్సిన విషయం.

Advertisement

Read Also: ఇంట్లోనే మినీ వ్యాయామశాల.. బాడీ ఫిట్‌నెస్‌పై దిగులేలా!

ఈ అపోహలు ఎలా పుట్టాయంటే..

ప్రాచీన కాలంలో.. స్త్రీలు నదులు లేదా చెరువుల్లో స్నానం చేసేవారు. ఆ రోజుల్లో పరిశుభ్రత సౌకర్యాలు తక్కువగా ఉండేవి. కాబట్టి.. నెలసరప్పుడు నదుల్లో జుట్టు కడగటం వల్ల నీరు అపరిశుభ్రం అవుతుందనే ఉద్దేశంతో ఈ నియమాన్ని పాటించి ఉండవచ్చు. అంతేకాకుండా, చలికాలంలో తలస్నానం చేస్తే జలుబు చేస్తుందని, అది పీరియడ్స్ సమయంలో ఇబ్బందులు కలిగిస్తుందని కూడా నమ్మేవారు. కొన్ని సంస్కృతుల్లో, తలస్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుందని, దానివల్ల రక్తస్రావం ఆగిపోతుందని లేదా కడుపునొప్పి పెరుగుతుందని కూడా నమ్మేవారు. అయితే, ఇవన్నీ కేవలం సాంప్రదాయ నమ్మకాలు మాత్రమే.

సైన్స్ ఏం చెబుతోంది?

Advertisement

ఆధునిక వైద్య శాస్త్రం ఈ నమ్మకాలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేస్తోంది. నెలసరి అనేది గర్భాశయంలో జరిగే ఒక సహజ ప్రక్రియ. తల స్నానం చేయడం అనేది శరీరానికి బయట జరిగే ఒక సాధారణ పని. ఈ రెండింటికీ ఏ విధమైన సంబంధం లేదు. పీరియడ్స్ టైంలో జుట్టు కడగడం వల్ల రక్తస్రావం ఆగిపోవడం లేదా కడుపునొప్పి పెరగడం వంటివి జరగదు.

తలస్నానం చేస్తే కలిగే లాభాలు:

* నెలసరి సమయంలో నొప్పితో పాటు తీవ్రమైన చెమట, అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో తల స్నానం చేయడం వల్ల శరీరం తాజాగా ఉంటుంది.
* పీరియడ్స్ టైంలో తలస్నానం చేయడం వలన.. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో వచ్చే తలనొప్పి లేదా ఒత్తిడి కాస్త తగ్గుముఖం పడుతుంది.
* తలలో పేరుకుపోయిన జిడ్డు, దుమ్ము తొలగిపోతాయి. చుండ్రు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
* గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే.. శరీరానికి ఉపశమనం లభిస్తుంది. కడుపునొప్పిని తగ్గించడానికి గోరువెచ్చని స్నానం సహాయపడుతుంది.
* తలస్నానం తర్వాత జుట్టు పొడిగా ఉండేలా చూసుకోవాలి. లేదంటే తలనొప్పి, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

Read Also: దీన్నింకా మసాలా అనుకుంటున్నారా.. శీతాకాలంలో నల్ల మిరియాలు తీసుకుంటే ఫుల్ హెల్త్!

Related News

LED ఫేస్ మాస్క్ ముఖంపై ముడతలు తగ్గిస్తుందని ప్రచారం.. నిజంగా పనిచేస్తుందా?

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

Big Stories

Advertisement
×