E-Paper
Advertisement

నిన్నటి రాగి జావ.. నేటి సూపర్ ఫుడ్, బెల్లం కలిపి తాగితే మీ ఆరోగ్యానికి తిరుగుండదు!

నిన్నటి రాగి జావ.. నేటి సూపర్ ఫుడ్, బెల్లం కలిపి తాగితే మీ ఆరోగ్యానికి తిరుగుండదు!

Bellam Ragi Java: మన పూర్వీకులు అందించిన అద్భుతమైన ఆహారాలలో ‘రాగి జావ’ మొదటి వరుసలో ఉంటుంది. ముఖ్యంగా రాగి జావలో చక్కెరకి బదులుగా బెల్లం కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అపారం. దీనిని ఒక సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు.  సమ్మర్‌లో శరీరాన్ని చల్లబరచడమే కాకుండా.. రక్తహీనతను తగ్గించడానికి, ఎముకలను దృఢంగా మార్చడానికి బెల్లం రాగి జావ ఎంతగానో తోడ్పడుతుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు రాగి జావ తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం రాగి జావ.. వంటింటి అమృతం:
1. ఎముకల పుష్టికి క్యాల్షియం నిధి:
రాగులలో ఇతర తృణధాన్యాల కంటే ఎక్కువగా క్యాల్షియం ఉంటుంది. బెల్లం రాగి జావ తాగడం వల్ల ఎముకలు, పళ్ళు బలంగా తయారవుతాయి. ఇది వృద్ధులలో వచ్చే ఆస్టియోపోరోసిస్ (ఎముకల బలహీనత) సమస్యను నివారిస్తుంది. ఎదుగుతున్న పిల్లలకు ఇది అత్యవసరమైన ఆహారం.

2. రక్తహీనత నుంచి విముక్తి:
చాలా మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతుంటారు. రాగులు , బెల్లం రెండింటిలోనూ ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రోజూ బెల్లం రాగి జావ తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి, రక్తం శుద్ధి అవుతుంది. దీని వల్ల నీరసం, అలసట తగ్గుతాయి.

3. బరువు తగ్గడానికి సహకరిస్తుంది:
రాగులలో ‘ట్రిప్టోఫాన్’ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం  వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. తక్కువ కేలరీలతో ఎక్కువ శక్తినిచ్చే ఈ జావ బరువు తగ్గాలనుకునే వారికి ఒక గొప్ప బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్.

4. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది:
వేసవి కాలంలో శరీరం వేడెక్కడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. రాగి జావ శరీరానికి సహజమైన చల్లదనాన్ని ఇస్తుంది. ఎండదెబ్బ తగలకుండా కాపాడుతుంది. అంతే కాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

5. షుగర్ కంట్రోల్:
రాగులలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అకస్మాత్తుగా పెరగనివ్వదు. అయితే.. షుగర్ పేషెంట్లు బెల్లాన్ని తక్కువగా తీసుకోవాలి లేదా డాక్టర్ సలహా మేరకు వాడుకోవడం మంచిది.

6. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
రాగి జావలో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఇది జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసి, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను అదుపులో ఉంచుతుంది.

7. ఒత్తిడి , ఆందోళనను తగ్గిస్తుంది:
రాగులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , అమైనో ఆమ్లాలు మెదడును ప్రశాంతంగా ఉంచుతాయి. ఇది నిద్రలేమి, ఒత్తిడి , మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో సహాయ పడుతుంది.

8. చర్మ సౌందర్యం, జుట్టు పెరుగుదల:
ఇందులోని అమినో యాసిడ్స్ చర్మం ముడతలు పడకుండా కాపాడి, యవ్వనంగా ఉంచుతాయి. ఐరన్ , క్యాల్షియం వల్ల జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది.

తయారీ విధానం:
రెండు స్పూన్ల రాగి పిండిని నీటిలో ఉండలు లేకుండా కలిపి, మరిగే నీటిలో పోసి ఉడికించాలి. అది దగ్గరపడ్డాక తగినంత బెల్లం పొడి, చిటికెడు యాలకుల పొడి వేసి కలిపి దించుకోవాలి. పాలు కావాలనుకునే వారు చివరలో కొద్దిగా పాలు కలుపుకోవచ్చు.

Related News

ఇంటి బయట ॐతో పాటు ఈ నాలుగు చిహ్నాలుంటే.. మీ జీవితంలో సుఖ సంతోషాలే

మార్కెట్‌ నుంచి తెచ్చిన మొక్కలు ఇంట్లో ఎండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే ఏళ్ల తరబడి పచ్చగా పెరుగుతాయి

వేసవి నీరసం వల్ల ఓఆర్ఎస్ తాగుతున్నారా? ప్యాకెట్లు వద్దు.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

Big Stories

×