E-Paper
Advertisement

ఛీ, ఛీ.. స్లో బాల్స్ వేసేలా SRH బౌల‌ర్లకు డ‌బ్బులు ఇచ్చాడు..కోహ్లీపై త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

ఛీ, ఛీ.. స్లో బాల్స్ వేసేలా SRH బౌల‌ర్లకు డ‌బ్బులు ఇచ్చాడు..కోహ్లీపై త‌న్వీర్ ఆరోప‌ణ‌లు
Advertisement

Tanveer Ahmed On Kohli  : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో ( Indian Premier League 2026 Tournament ) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు శుభారంభం చేసింది. ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ( SRH), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB) జట్లు తలపడ్డాయి. ఈ రెండు జట్ల మధ్య చిన్న స్వామి స్టేడియం వేదికగా శనివారం రోజున రాత్రి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముఖ్యంగా విరాట్ కోహ్లీ 69 పరుగులతో ఇరగదీశాడు. ఈ దెబ్బకు హైదరాబాద్ చిత్తయింది. అయితే, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన అద్భుతంగా రాణించిన విరాట్ కోహ్లీ పైన పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ) షాకింగ్ కామెంట్స్ చేశాడు. స్లో బాల్స్ వేయడానికి సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు విరాట్ కోహ్లీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు యాజమాన్యం డబ్బులు ఇచ్చినట్లు ఆరోపణలు చేశారు. అందుకే 69 పరుగులు చేసినట్లు బాంబు పేల్చారు తన్వీర్ అహ్మ‌ద్.

Also Read: IPL telecast in Bangladesh: బిగ్ రిలీఫ్‌..బంగ్లాదేశ్ లో ఐపీఎల్ పై నిషేధం ఎత్తివేత‌..ముస్తాఫిజుర్ రీ-ఎంట్రీ !

స్లో బాల్స్ వేసేలా SRH బౌల‌ర్లకు డ‌బ్బులు ఇచ్చాడు

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మొదటి మ్యాచ్ లో హైదరాబాద్ పైన బెంగుళూరు గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లో 69 పరుగులు సాధించాడు విరాట్ కోహ్లీ. ఇందులో ఐదు సిక్సర్లతో పాటు ఐదు బౌండరీలు ఉండడం గమనార్హం. 181 స్ట్రైక్ రేటుతో రఫ్ఫడించాడు విరాట్ కోహ్లీ. అయితే విరాట్ కోహ్లీ ఈ ఇన్నింగ్స్ ఆడడంపై పాకిస్తాన్ విషం కక్కడం మొదలుపెట్టింది. మొదటగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయి మాట్లాడాడు.

విరాట్ కోహ్లీ టెస్ట్ ప్లేయర్ అని.. కానీ హైదరాబాద్ పై అద్భుతంగా అయినట్లు వెల్లడించారు. దీనంతటి వెనుక ఫిక్సింగ్ ఉందని బాంబు పేల్చారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన బౌలర్లకు బెంగళూరు యాజమాన్యం డబ్బులు ఇచ్చిందని.. అందుకే వాళ్లు స్లో డెలివరీస్ విసిరినట్లు ఆరోపణలు చేశారు. దీంతో విరాట్ కోహ్లీ సిక్సర్లు అలాగే బౌండరీలు అవలీలగా కొట్టగలిగాడని తెలిపారు. ఇది అందరికీ తెలిసిన సత్యం అన్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో మొదటి నుంచి ఈ స్కాం జరుగుతోందని ఫైర్ అయ్యారు. విరాట్ కోహ్లీ కేవలం పర్సనల్ రికార్డుల కోసం మాత్రమే ఆడతాడని బాంబు పేల్చారు పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ ( Tanveer Ahmed ). ఇది ఇలా ఉండగా నిన్న జరిగిన మొదటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 201 పరుగులు సాధించింది. అయితే బౌలింగ్ లో విఫలమైన నేపథ్యంలో అ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది హైదరాబాద్. విరాట్ కోహ్లీ అటు పడిక్క‌ల్ ఇద్దరు ఆకట్టుకోవడంతో 15 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్ అయింది.

Advertisement

Also Read: Mohammad Amir: ఐపీఎల్ అంటేనే ఫిక్స‌ర్స్ లీగ్..అంపైర్ల నుంచి చీర్ గ‌ర్ల్స్ అంద‌రూ అమ్ముడుపోయేవాళ్లే

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×