E-Paper
Advertisement

Anti Aging Foods: వయస్సు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించాలా ? అయితే ఇవి తినండి

Anti Aging Foods: వయస్సు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించాలా ? అయితే ఇవి తినండి
Advertisement

Anti Aging Foods:  వృద్ధాప్య ప్రభావం ముఖం, శరీరంపై కనిపించకూడదని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే దీని కోసం, సరైన జీవనశైలి, ఆహారపు అలవాట్లను కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో మారిన జీవనశైలి చిన్నవయసులోనే ఆరోగ్య సమస్యలకు కారణం అవుతోంది. అంతే కాకుండా ముఖంపై ముడతలు రావడం వంటి సమస్యలు చిన్న వయసులోనే కనిపిస్తున్నాయి. మీరు అలాంటి సమస్యలను నివారించాలనుకుంటే మాత్రం ముందుగానే మీ ఆహారంలో యాంటీ ఏజింగ్ ఫుడ్స్‌ను చేర్చుకోండి. ఈ ఆహారాలు మిమ్మల్ని దృఢంగా చేస్తాయి. అంతే కాకుండా మీ ముఖానికి కొత్త మెరుపును తెచ్చి పెడతాయి.

మనం మన వృద్ధాప్యాన్ని ఆపలేము, కానీ కొన్ని ఆహార పదార్థాలను తినడం ద్వారా ఏజ్ పెరుగుతున్నా యంగ్ గా కనిపిస్తాము. మరి ఎలాంటి ఫుడ్ తింటే యంగ్ గా కనిపిస్తామో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

5 యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే ..

దానిమ్మ : వయస్సు పెరుగుతున్న కూడా మిమ్మల్ని మీరు యవ్వనంగా ఉంచుకోవాలనుకుంటే, దానిమ్మపండు తినండి. దానిమ్మలో ఉండే విటమిన్లు, పోషకాలు, యాంటీ-ఆక్సిడెంట్లు చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. అంతే కాకుండా ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో కూడా సహాయపడతాయి. చర్మాన్ని ఫ్లెక్సిబుల్‌గా ఉంచే సమ్మేళనాలు దానిమ్మలో ఉంటాయి.

Advertisement

అవకాడో: వయసు పెరిగే కొద్దీ చర్మం తేమను కోల్పోతుంది. దీని వల్ల చర్మం పొడిబారడంతోపాటు చికాకుగా మారుతుంది. అవకాడోలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇందులో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని సంరక్షిస్తుంది. ఈ సమ్మేళనాలు చర్మంపై సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తాయి. వీటిలోని ఆరోగ్య పోషకాలు శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.

గుడ్డు : మీరు మాంసాహారులు అయితే గుడ్లు తినడం ప్రారంభించండి. గుడ్డు ఒక అద్భుతమైన యాంటీ ఏజింగ్ ఫుడ్. దీనిని ప్రోటీన్ పవర్ హౌస్ అని కూడా అంటారు. గుడ్డు.. దెబ్బతిన్న కండరాలను రిపేర్ చేస్తుంది. ఇది పెరుగుతున్న వయస్సుతో కండరాల స్థాయిని నిర్వహిస్తుంది.

Also Read: పొద్దు తిరుగుడు విత్తనాలను గురించిన ఈ విషయాలు మీకు తెలుసా ?

ఆకుపచ్చ కూరగాయలు: వయస్సు పెరిగేకొద్దీ, మీ ఆహారంలో ఆకు కూరలు తినండి. బచ్చలికూర, ఆవాలు, మెంతులు వంటి ఆకుకూరలు యాంటీ ఏజింగ్ గుణాలతో నిండి ఉన్నాయి. పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లతో సహా అనేక పోషకాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తూ, మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పెరుగు: మిమ్మల్ని యవ్వనంగా ఉంచడంలో పెరుగు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రోబయోటిక్స్, కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారం ఇది. పెరుగు ఒక అద్భుతమైన యాంటీ ఏజింగ్ ఫుడ్, ఇది వయసు పెరుగుతున్నా కూడా చర్మాన్ని మృదువుగా , మెరిసేలా చేస్తుంది. దీన్ని తినడం వల్ల ముడతలు కూడా తగ్గుతాయి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×