E-Paper
Advertisement

Vettaiyan : సినిమా స్టోరీలో వేలు పెట్టిన రజినీకాంత్… ఆ సీన్స్ ఛేంజ్ 

Vettaiyan : సినిమా స్టోరీలో వేలు పెట్టిన రజినీకాంత్… ఆ సీన్స్ ఛేంజ్ 
Advertisement

Vettaiyan : స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ హడావిడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సినిమాలను రూపొందించేటప్పుడు కెప్టెన్ గా ఉండే డైరెక్టర్ కి సినిమాను  వదిలేయకుండా హీరోలు కథలో వేలు పెట్టడం వల్ల కొన్నిసార్లు సినిమాపై గట్టిగానే ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఈ విషయం బయట తెలియదు కాబట్టి సినిమా ప్లాప్ అయితే దానికి కారణం డైరెక్టర్ అంటూ దర్శకులనే టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఓ డైరెక్టర్ రజనీకాంత్ జోక్యం వల్లనే ఓ సినిమా ప్లాఫ్ అయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా తన కొత్త సినిమా విషయంలో కూడా రజనీకాంత్ జోక్యం వల్ల కొన్ని సన్నివేశాలను ఛేంజ్ చేసినట్టుగా తెలుస్తోంది. పైగా ఈ విషయాన్ని స్వయంగా రజనీకాంత్ చెప్పడం విశేషం.

‘వేట్టయన్’ స్టోరీలో మార్పులు  

Advertisement

టీజీ జ్ఞానవెల్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘వేట్టయన్’ మూవీ భారీ అంచనాల మధ్య అక్టోబర్ 10న దసరా కానుకగా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్ ఓ సందర్భంలో ఈ మూవీ స్టోరీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రజిని దగ్గరకు జ్ఞానవేల్  తీసుకు వచ్చిన స్టోరీని విన్న ఆయన కొన్ని మార్పులు చేర్పులు సూచించారట. ముఖ్యంగా కథలో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయమని రిక్వెస్ట్ చేశారట. ‘వేట్టయన్’ స్టోరీ గురించి రజనీకాంత్ ఓ సందర్భంలో మాట్లాడుతూ ‘టీజీ జ్ఞానువేల్ దర్శకత్వం వహించిన ‘జై భీమ్’ సినిమా నాకు బాగా నచ్చింది. కానీ అతనితో గతంలో మాట్లాడే ఛాన్స్ దొరకలేదు. అయితే ‘వేట్టయన్’ స్టోరీని వినమని సౌందర్య చెప్పడంతో విన్నాను. అయితే సినిమా తీయడానికి భారీగా డబ్బులు ఖర్చవుతుందని అనిపించిందని, అందుకే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయమని చెప్పాను. పది రోజుల సమయం కోరిన జ్ఞానవేల్ సినిమాను కమర్షియల్ గా మారుస్తాను గాని లోకేష్ కనగరాజ్ లాగా లేదా నెల్సన్ దిలీప్ కుమార్ లాగా మార్చలేను. నా స్టైల్ లో జనాలకు నచ్చేలా సినిమాను తీస్తాను అని జ్ఞానవేల్ చెప్పాడు. పది రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చిన జ్ఞానవేల్ ను చూసి ఆశ్చర్యపోయాను’ అని రజనీకాంత్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఆయన వల్లే సినిమా ప్లాప్..

Advertisement

కాగా గతంలో ముత్తు, నరసింహా లాంటి సినిమాలు చేసిన కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో వచ్చిన మూవీ ‘లింగ’. ఇందులో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించగా, ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే నెగిటివ్ టాప్ తో బొక్క బోర్లా పడింది. అయితే సినిమా డిజాస్టర్ కావడం పట్ల రవికుమార్ తాజాగా స్పందిస్తూ సినిమా విషయంలో అనవసరంగా రజనీకాంత్ చేసుకున్న జోక్యం వల్లే మూవీ డిజాస్టర్ అయ్యిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘వేట్టయన్’ మూవీ రిలీజ్ అవుతుండగా రజినీ స్టోరీ విషయంలో జోక్యం చేసుకున్నారన్న వార్త వైరల్ అవుతుంది. మరి ఈసారి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×