E-Paper
Advertisement

2025 Sankranti Releases: కన్ఫ్యూజింగ్ సంక్రాంతి 2025.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అంతా అయోమయం, గందరగోళం!

2025 Sankranti Releases: కన్ఫ్యూజింగ్ సంక్రాంతి 2025.. ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అంతా అయోమయం, గందరగోళం!
Advertisement

2025 Sankranti Releases: మామూలుగా సంక్రాంతి అంటేనే సినిమాల పండగ అని మూవీ లవర్స్ ఫీలవుతుంటారు. అందుకే సంక్రాంతికి ఎన్ని సినిమాలు పోటీ ఉన్నా.. మరొక సినిమా రంగంలోకి దిగడానికి ఎప్పుడూ వెనకాడదు. అలా స్టార్ హీరోల సినిమాలు అన్నీ సంక్రాంతికే విడుదలయ్యి హిట్ సాధించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ 2025 సంక్రాంతికి మాత్రం ఎవరు థియేటర్లలో సందడి చేయనున్నారో? ఎవరు రేసు నుండి తప్పుకోనున్నారో అనే విషయాలపై క్లారిటీ లేదు. మఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకే ఇలా విడుదల తేదీలపై కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడం ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ఈ సంక్రాంతికి ఒక్క స్టార్ హీరో అయినా థియేటర్లలో సందడి చేస్తుందా లేదా అని సందేహం మొదలయ్యేలా చేస్తోంది.

మళ్లీ వాయిదా

Advertisement

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ సినిమాపై ఇంకా క్లారిటీ లేదు. ‘పుష్ప’ విడుదలయ్యి మూడేళ్లు అవుతుండడంతో బన్నీ ఫ్యాన్స్ అంతా ‘పుష్ప 2’పైనే ఆశలు పెట్టుకున్నారు. మూవీ విడుదలకు సంబంధించి ఇప్పటికీ పలు రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. అలా అనౌన్స్ చేయడం, పోస్ట్‌పోన్ అవ్వడం కామన్‌గా మారిపోయింది. దీంతో ‘పుష్ప 2’ అసలు వస్తుందా రాదా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ప్రస్తుతం డిసెంబర్ 6న ‘పుష్ప 2’ విడుదల అవుతుందని మేకర్స్ నమ్మకంతో చెప్తున్నారు. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ‘పుష్ప 2’ డిసెంబర్ 6 నుండి జనవరి 10కి పోస్ట్‌పోన్ అవ్వనుంది. దీంతో సంక్రాంతి సినిమాపై ఎఫెక్ట్ పడనుందా అని చర్చలు మొదలయ్యాయి.

Also Read: అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. పుష్ప 2 మూవీ మళ్లీ వాయిదా?

Advertisement

నిర్మాతకే నష్టం

ప్రస్తుతం జనవరి 10న విడుదల తేదీని కన్ఫర్మ్‌గా ఖరారు చేసుకున్న సినిమాలు ఏమీ లేవు. కానీ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’.. అదే రోజున విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ‘పుష్ప 2’ కూడా అదే రోజు విడుదలయితే ఇద్దరు మెగా హీరోల మధ్య గట్టి పోటీ జరగనుంది. అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది. ‘గేమ్ ఛేంజర్’కు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్న మరో చిత్రం ‘వెంకీ 76’ చాలాకాలం క్రితమే సంక్రాంతికి రానున్నట్టు ప్రకటించింది. అలా ఆయన నిర్మించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలయితే నిర్మాతగా దిల్ రాజుకే నష్టం జరుగుతుంది. ఒకవేళ ‘గేమ్ ఛేంజర్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే ‘వెంకీ 76’ వెనక్కి తగ్గక తప్పదేమో అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

అన్నీ తప్పుకుంటున్నాయి

చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సోషల్ ఫ్యాంటసీ డ్రామా ‘విశ్వంభర’.. షూటింగ్ మొదలయినప్పుడే 2025 సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించింది. కానీ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి వస్తుందేమో అనే అనుమానంతో ప్రస్తుతం సంక్రాంతి రేసు నుండి తప్పుకోవడానికి కూడా చిరంజీవి వెనకడడం లేదని తెలుస్తోంది. ఇలా అయితే ఒక సినిమా వస్తుందేమో అనే అనుమానంతో మరొక సినిమా తప్పుకుంటూ పోతే అసలు 2025 సంక్రాంతికి మూవీ లవర్స్‌కు నిరాశే మిగిలేలా ఉందని నెటిజన్లు విమర్శిస్తు్న్నారు. మూవీ మేకర్స్ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసినా కూడా వాటిని పూర్తిగా నమ్మలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×