E-Paper
Advertisement

పిల్లాడు తెల్లగా, మెరిసిపోయే చర్మంతో పుట్టాలంటే ఇవి తినండి.. తల్లి, బిడ్డకు ఎంతో ఆరోగ్యకరం

పిల్లాడు తెల్లగా, మెరిసిపోయే చర్మంతో పుట్టాలంటే ఇవి తినండి.. తల్లి, బిడ్డకు ఎంతో ఆరోగ్యకరం
Advertisement

గర్భివతి మహిళలు తినే ఆహారం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సమతుల్యమైన, పోషకాలు నిండిన ఆహారం తీసుకుంటే గర్భంలో బిడ్డ సరైన విధంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. కావాల్సిన పోషకాలు లభిస్తే శరీరంలో ఎనర్జీ లెవెల్స్, రోగనిరోధక శక్తి పెరుగుతాయి.

కాంతివంతమైన చర్మం కోసం రోజూ తాజా పండ్లు తినండి

తాజా పండ్లలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. నారింజ, ఆపిల్, అరటి, స్ట్రాబెర్రీ, దానిమ్మ వంటి పండ్లు రోజూ తినాలి. వీటిలో ‘విటమిన్ సి’ చర్మాన్ని కాంతివంతంగా చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడి, శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది.

ఆకు కూరలు ఎక్కువగా తినండి

Advertisement

పాలకూర, బ్రోకలీ, మెంతికూర వంటి ఆకు కూరలు ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ అందిస్తాయి. ఫోలిక్ యాసిడ్ బిడ్డ మెదడు, వెన్నుపాము సరైన విధంగా అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. రక్తహీనత తగ్గుతుంది.

పాలు, డైరీ ఉత్పత్తులు తీసుకోండి

పాలు, పెరుగు, పన్నీర్ కాల్షియం,, ప్రోటీన్ అందిస్తాయి. ఇవి బిడ్డ ఎముకలు, దంతాలు బలంగా పెరగడానికి సహాయపడతాయి. తల్లి ఎముకల ఆరోగ్యానికి కూడా మంచివి. లో ఫ్యాట్ డైరీ ఉత్పత్తులు ఎంచుకోవడం మంచిది.

డ్రై ఫ్రూట్స్, నట్స్ తినండి

Advertisement

బాదం, వాల్‌నట్, ఖర్జూరం, ఎండు ద్రాక్ష వంటివి ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ అందిస్తాయి. ఇవి శక్తిని పెంచడానికి, బిడ్డ మెదడు అభివృద్ధికి సహాయపడతాయి. మధ్యాహ్నం ఆకలి అయినప్పుడు తినడానికి మంచి స్నాక్స్ గా తినొచ్చు.

ప్రోటీన్ ఎక్కువగా తినండి

గుడ్డు, పప్పులు, బీన్స్, చేపలు, చికెన్, సోయా వంటి ఆహారాలు ప్రోటీన్ అందిస్తాయి. ఇవి బిడ్డ అవయవాలు, కణజాలాలు బలంగా పెరగడానికి తోడ్పడతాయి. తల్లికి శక్తి కూడా అందుతుంది.

తగినంత నీళ్లు తాగండి

గర్భావస్థలో ఎక్కువ నీళ్లు తాగడం చాలా అవసరం. ఇది శరీరం సరిగా పని చేయడానికి, రక్తప్రసరణ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు, తాజా జ్యూస్‌లు కూడా మంచివి. మలబద్ధకం, అలసట తగ్గుతాయి.

జంక్ ఫుడ్ మానేయండి

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఆహారాలు, ఎక్కువ ఉప్పు, చక్కెర ఉన్నవి తగ్గించాలి. ఇంటి వంటలు, తాజా ఆహారాలు ఎక్కువగా తినాలి.

Also Read: తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయకూడదు.. పిల్లలు మనసులో ద్వేష భావన కలుగుతుంది

ఆరోగ్యకరమైన కొవ్వు గల ఆహారాలు తీసుకోండి

అవకాడో, నట్స్, విత్తనాలు, ఆలివ్ ఆయిల్ వంటివి మంచి కొవ్వులు అందిస్తాయి. ఇవి బిడ్డ మెదడు అభివృద్ధికి సహాయపడతాయి.

సరైన ఆహారంతో కాంతివంతమైన చర్మం 

పండ్లు, కూరగాయలు, నీళ్లు తగినంత తీసుకుంటే తల్లి చర్మం కూడా మెరుగ్గా ఉంటుంది.

డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోండి

గర్భావస్థ సమయంలో ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితులు వేరుగా ఉంటాయి. డాక్టర్ సలహా మేరకు ఆహారం, పోషాకాల్లో మార్పులు చేసుకోవాలి. క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకోవాలి.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×