E-Paper
Advertisement

కారణం లేకుండా మాయమయ్యే జనాలు… మిగిలిన వాళ్ళ పరిస్థితి ఘోరం… నరాలు తెగే ఉత్కంఠ

కారణం లేకుండా మాయమయ్యే జనాలు… మిగిలిన వాళ్ళ పరిస్థితి ఘోరం… నరాలు తెగే ఉత్కంఠ
Advertisement

Supernatural drama series on OTT : ఒక మాంచి ‘మైండ్ బాగ్లింగ్’ సిరీస్ చూడాలనుకుంటే, ఇప్పుడు చెప్పుకోబోయే సిరీస్ ను అస్సలు మిస్ కావద్దు. మూడు సీజన్లతో ఇది టాప్ రేటింగ్ తో ప్రశంసలు అందుకుంది. దీనికి ఐయండిబిలో 8.3 రేటింగ్ కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా అకస్మాత్తుగా సుమారు 14 కోట్ల మంది అదృశ్యమవ్వడం అనే ఒక వింత ఘటన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అస్సలు ఏమాత్రం అర్థం కాని వింత ఘటనలతో కథ పీక్స్ లో ఉంటుంది. గ్యారెంటీగా ఇది బుర్ర తిప్పేసే గట్టి సిరీస్. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

ఎక్కడ చూడచ్చు అంటే

ఈ అమెరికన్ సూపర్ న్యాచురల్ డ్రామా సిరీస్ పేరు ‘ది లెఫ్ట్‌ఓవర్స్’ (The leftovers). డేమన్ లిండెలోఫ్, టామ్ పెరోట్టా సృష్టించిన ఈ సిరీస్, 2011లో వచ్చిన పెరోట్టా నవల ఆధారంగా రూపొందింది. సిరీస్ మొత్తం మూడు సీజన్లలో 28 ఎపిసోడ్లుగా సాగుతుంది. మొదటి, రెండవ సీజన్లు తలా 10 ఎపిసోడ్లతో 2014, 2015 సంవత్సరాల్లో విడుదలవ్వగా, చివరి మూడవ సీజన్ మాత్రం 8 ఎపిసోడ్లతో 2017లో ముగిసింది. తక్కువ ఎపిసోడ్లలోనే ప్రేక్షకులు ఒక ఉత్కంఠభరితమైన అనుభూతిని పొందుతారు దీనిని చూస్తూ. విమర్శకులు దీనిని టీవీ చరిత్రలోనే ఒక “మాస్టర్‌పీస్” అని పిలుస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సిరీస్ ప్రతి సీజన్‌లోనూ తన లొకేషన్‌ను పూర్తిగా మార్చేస్తుంది. మొదటి సీజన్ న్యూయార్క్‌లో జరిగితే, రెండో సీజన్ టెక్సాస్‌కు, మూడో సీజన్ ఆస్ట్రేలియాకు మారుతుంది. ఇలా ప్రదేశాలు మారడం వల్ల కథలో ఎప్పుడూ ఒక రకమైన ఫ్రెష్ నెస్ ఉంటుంది. ఇక నటీనటుల విషయానికి వస్తే, జస్టిన్ థెరౌక్స్, క్యారీ కూన్ తమ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌ను ఇందులో ఇచ్చారు. ముఖ్యంగా క్యారీ కూన్ నటనకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ సిరీస్ Jio hotstarలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి, ఎటువంటి కారణం లేకుండా 14 కోట్ల మంది అకస్మాత్తుగా మాయమైపోతారు. ఈ వింత ఘటన జరిగిన మూడేళ్ల తర్వాత కథ మొదలవుతుంది. ఆ ఘటనలో చనిపోయిన వాళ్ళ కంటే, బతికి ఉన్నవాళ్లు అనుభవించే మానసిక బాధే ఈ సిరీస్ మెయిన్ పాయింట్. ప్రతి ఒక్కరూ తమ ఆత్మీయులను కోల్పోయి, అసలు ఇది దేవుడి మహిమా లేక సైన్సా అని అర్థం కాక అయోమయంలో ఉంటారు. ముఖ్యంగా కెవిన్ గార్వే అనే పోలీస్ ఆఫీసర్ చుట్టూ కథ తిరుగుతుంది. అతని భార్య ఒక వింతైన కల్ట్ గ్రూపులో చేరిపోతుంది. కొడుకు ఇంటి నుండి వెళ్లిపోతాడు. మరోవైపు నోరా డర్స్ట్ అనే మహిళ తన భర్తను, ఇద్దరు పిల్లలను ఆ ఘటనలో కోల్పోతుంది.

ఇలా ఒక్కొక్కరిది ఒక్కో బాధ. బతికున్న వాళ్ళు ఆ బాధ నుండి బయటపడటానికి రకరకాల దారులు వెతుక్కుంటారు. కొందరు మతాన్ని నమ్ముతారు, మరికొందరు పిచ్చివాళ్లలా ప్రవర్తిస్తుంటారు.ఈ సిరీస్ లో అసలు మనుషులు ఎందుకు మాయమయ్యారు అనే రహస్యం కంటే, మనిషికి ఎదురయ్యే అతిపెద్ద దుఃఖాన్ని ఎలా తట్టుకుంటారు అనే విషయాన్ని చాలా డీప్ గా చూపిస్తారు. రెండో సీజన్ నుండి కథ మరో మలుపు తిరిగి, టెక్సాస్ లోని ‘మిరాకిల్’ అనే ఊరికి మారుతుంది. అక్కడ ఒక్కరు కూడా మాయం కాలేదని ప్రచారం జరుగుతుంది. ఇందులో అసలు మనుషులు ఎలా మాయం అయ్యారు ? ఎక్కడికి వెళ్లారు ? మళ్ళీ వాళ్ళు తిరిగొచ్చారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.

Advertisement

Read Also : దెయ్యాల కోసం వెళ్తే వణికించే శవం… డిటెక్టివ్‌కి నిద్ర లేకుండా చేసిన ఆ భయంకరమైన రాత్రి

Related News

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

సముద్రం అడుగున యుద్ధ నౌక శిథిలాల్లో చిక్కుకున్న ఫ్రెండ్స్‌… చుట్టూ ప్రాణాలు తీసే షార్క్స్‌! బయటపడే దారి ఉందా?

దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్

కారులో కూర్చొని బ్యాంకుల్ని హ్యాక్‌ చేసే కుర్రాడు… ఒక్క పొరపాటుతో ప్రాణాల మీదకు…

చనిపోయినట్టు నటించి మార్చురీలోకి వెళ్ళే యువతి… చచ్చినా వదలకుండా దారుణం… ఓటీటీలోకి హారర్‌ థ్రిల్లర్‌

బాడీ షేమింగ్‌ చేస్తూ వేధించిన అమ్మాయిలు… వాళ్లను కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని చూసి కూడా నోరు మెదపని బాధితురాలు! స్పానిష్‌ రివెంజ్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×