E-Paper
Advertisement

చెడు కొలెస్ట్రాల్‌ను సహజంగా కరిగించే.. బెస్ట్ డ్రింక్స్ ఇవే!

చెడు కొలెస్ట్రాల్‌ను సహజంగా కరిగించే.. బెస్ట్ డ్రింక్స్ ఇవే!
Advertisement

Natural drinks to lower cholesterol: ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ సమస్య ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడం చాలా ముఖ్యం. లేదంటే అది గుండె జబ్బులకు దారి తీస్తుంది. అయితే.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన వంటింట్లో దొరికే కొన్ని పదార్థాలతో తయారుచేసే డ్రింక్స్ మందుల కంటే ప్రభావవంతంగా కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. కొలెస్ట్రాల్‌ను సహజంగా నియంత్రించే  అద్భుతమైన డ్రింక్స్ గురించి, వాటి తయారీ విధానం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

చెడు కొలెస్ట్రాల్ రక్త నాళాల్లో పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీనిని నియంత్రించడానికి వ్యాయామంతో.. పాటు సరైన డ్రింక్స్ తాగడం చాలా కీలకం.

Advertisement

1. గ్రీన్ టీ :
గ్రీన్ టీలో ‘కాటెచిన్స్’ అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయ పడతాయి. రోజూ రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం గుండెకు రక్షణ ఇస్తుంది.

2. మెంతుల నీరు:
మెంతుల్లో ఉండే ‘సోల్యూబుల్ ఫైబర్’ కొలెస్ట్రాల్‌ను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటుంది. రాత్రంతా నానబెట్టిన మెంతులను ఉదయాన్నే నీటితో పాటు తీసుకోవడం లేదా ఆ నీటిని మరిగించి తాగడం.. వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

Advertisement

3. అల్లం, వెల్లుల్లి రసం :
వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. అల్లం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఈ రెండింటి మిశ్రమం రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. గోరు వెచ్చని నీటిలో కొద్దిగా అల్లం జ్యూస్, వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తాగండి.

4. ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతమైనది. ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలుపుకుని తాగడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి.

5. దాల్చిన చెక్క టీ :
దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్‌ను సమతుల్యంగా ఉంచుతుంది. ఒక చిన్న దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది.

Also Read: వేప ఆకుల జ్యూస్ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి!

డ్రింక్స్ తో పాటు పాటించాల్సిన ముఖ్య నియమాలు:
ప్రాసెస్ చేసిన ఆహారం వద్దు: జంక్ ఫుడ్, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి.

పీచు పదార్థాలు: ఓట్స్, పండ్లు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.

శారీరక శ్రమ: కనీసం రోజుకు 30 నిమిషాల వాకింగ్ చాలా అవసరం.

నీరు: రోజుకు 3 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు సులభంగా బయటకు వెళ్తాయి.

కొలెస్ట్రాల్ అనేది ఒక్క రోజులో పెరిగేది కాదు. అలాగే ఒక్క రోజులో తగ్గేది కూడా కాదు. పైన చెప్పిన డ్రింక్స్ క్రమం తప్పకుండా పాటిస్తూ.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకుంటే.. ఖచ్చితంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు. ఒకవేళ మీ కొలెస్ట్రాల్ లెవల్స్ చాలా ఎక్కువగా ఉంటే.. తప్పనిసరిగా డాక్టరును సంప్రదించి అవసరమైన మందులు వాడాలి. ప్రకృతిసిద్ధమైన డ్రింక్స్ మీకు అదనపు బలాన్ని , రక్షణను ఇస్తాయి.

Related News

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

Big Stories

Advertisement
×