E-Paper
Advertisement

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న కౌన్సిలర్.. పోలీసుల మౌనం వెనుక మర్మమేంటో..?
Advertisement

Medchal News: స్వేచ్ఛ బ్యూరో: ఎల్లంపేట మున్సిపల్ 16వ వార్డు కౌన్సిలర్ సురేష్ రెడ్డి వాహనం ఇప్పుడు వివాదానికి కేంద్రంగా మారింది. గతంలో పీఏసీఎస్ చైర్మన్‌గా పనిచేసిన ఆయన, ప్రస్తుతం కౌన్సిలర్‌గా ఉన్నప్పటికీ, కారుపై ఇంకా ‘పీఏసీఎస్ చైర్మన్’ బోర్డు కొనసాగుతుండటం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం అధికార హోదాలను అనధికారంగా వాహనాలపై ప్రదర్శించడం స్పష్టమైన ఉల్లంఘన. అయినా ప్రజాప్రతినిధే ఇలా బహిరంగంగా నిబంధనలను ధిక్కరించడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Also read: వరి పంటలో సరికొత్త రికార్డ్.. RNR 25105 వంగడం సిద్ధం..!

చట్టాలు కొందరికేనా..!

Advertisement

సాధారణ ప్రజలు చిన్న తప్పు చేసినా వెంటనే జరిమానాలు విధించే ట్రాఫిక్ పోలీసులు, ఇలాంటి స్పష్టమైన ఉల్లంఘనపై ఎందుకు స్పందించడంలేదన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. “నియమాలు సామాన్యులకేనా? నాయకులకు వర్తించవా?” అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మాజీ అనే సూచన కూడా లేకుండా ‘పీఏసీఎస్ చైర్మన్’ బోర్డు వాడటం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది అధికార దుర్వినియోగానికి సంకేతమని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరించి, నిబంధనలు అందరికీ సమానమని నిరూపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Also read: తమిళనాడులో ‘దళపతి’ రాజకీయం.. ఓట్ల చీలిక ఎవరికి లాభం.. ఎవరికి నష్టం?

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×