Best onion chutney recipes: ఇడ్లీ,దోశ, వడ లేదా వేడి వేడి అన్నం..ఏదైనా సరే.. పక్కన మంచి చట్నీ ఉంటే.. ఆ రుచే వేరు. అందులోనూ ఉల్లిపాయతో చేసే చట్నీల టేస్ట్ ఎప్పుడూ.. నెంబర్ వన్గా ఉంటుంది. ఏమాత్రం శ్రమ లేకుండా.. ఇంట్లో ఉన్న పదార్థాలతో క్షణాల్లో తయారు చేసుకునే ఆనియన్ చట్నీలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. నోరూరించే ఆ ఉల్లిపాయ చట్నీల రుచి కరమైన వెరైటీలు, వాటి తయారీ విధానం..
వంటగదిలో ఉల్లిపాయ లేని వంటకం ఉండదంటే.. అతిశయోక్తి కాదు. కూరల రుచిని పెంచడమే కాకుండా.. పచ్చళ్లు, చట్నీలలో ఉల్లిపాయ ప్రధాన పాత్ర పోషిస్తుంది. తక్కువ సమయంలో.. సింపుల్గా తయారయ్యే ఆనియన్ చట్నీల కోసం నెటిజన్లు విపరీతంగా వెతుకుతున్నారు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ హడావుడిలో.. క్షణాల్లో చేసుకునే కొన్ని బెస్ట్ ఆనియన్ చట్నీ వెరైటీలు మీకోసం..
ఇడ్లీ, దోశెల్లోకి హోటళ్లలో తినే ఎర్రటి చట్నీ రుచి చాలా బాగుంటుంది.దీనిని ఇంట్లోనే ఈజీగా తయారు చేయెచ్చు.
కావలసినవి: ఉల్లిపాయలు, పచ్చి మిర్చి లేదా ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, తాలింపు గింజలు.
తయారీ విధానం: పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, ముక్కలుగా తరిగిన ఉల్లిపాయలను దోరగా వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. చివరగా.. ఆవాలు, కరివేపాకుతో తాలింపు పెడితే గుమ గుమలాడే హోటల్ స్టైల్ ఆనియన్ చట్నీ రెడీ!
కొంచెం పుల్లగా, కారంగా ఉండే.. ఈ చట్నీ దోశ , పొంగనాలకి సూపర్ కాంబినేషన్.
తయారీ విధానం: బాండీలో నూనె వేసి టమాటాలు,ఉల్లి పాయలు,పచ్చి మిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది.
ఉడికించకుండా.. పచ్చి ఉల్లిపాయతో.. చేసే ఈ చట్నీ ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. రాయలసీమ ప్రాంతంలో దీనికి విపరీతమైన క్రేజ్ ఉంది.
తయారీ విధానం: రోట్లో లేదా మిక్సీలో .. పచ్చి ఉల్లిపాయ ముక్కలు, తగినంత కారం, చింత పండు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా దంచాలి. దీనికి మంచి నూనెతో.. తాలింపు పెడితే దీని టేస్టే వేరు.వేడి అన్నంలోకి ఇది అద్భుతమైన జోడీ.
Also Read: స్వీట్ షాప్ స్టైల్ జ్యూసీ బాదుషా..ఈ చిన్న టిప్స్ పాటిస్తే రుచి అద్భుతం
కొబ్బరి పాలు లేదా ఎండు/పచ్చి కొబ్బరికి ఉల్లిపాయ కలిపి చేసే ఈ చట్నీ ఆరోగ్యానికి చాలా మంచిది.
తయారీ విధానం: పచ్చి కొబ్బరి తురుము, వేయించిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, అల్లం ముక్క కొద్దిగా.. వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది చలువ చేస్తుంది. బ్రేక్ ఫాస్ట్ మంచి రుచిని ఇస్తుంది.
ఎలాంటి కూరగాయలు అందుబాటులో .. లేనప్పుడు లేదా తక్కువ సమయంలో రుచి కరమైన బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేయాలనుకున్నప్పుడు.. ఈ ఆనియన్ చట్నీలు బెస్ట్ ఆప్షన్. ఈ హోమ్ మేడ్ రెసిపీలకు భారీ ఆదరణ లభిస్తోంది. మరి మీ ఇంట్లో ఈరోజు ఏ ఆనియన్ చట్నీ ట్రై చేస్తున్నారు? ఇప్పుడే వంట గదిలోకి వెళ్లి రెడీ చేయండి!