E-Paper
Advertisement

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!
Advertisement

Festive Season Travel Guide: పండుగలు వచ్చాయంటే ఇంట్లో సందడి మాత్రమే కాదు.. ఎక్కడికైనా ట్రిప్ వెళ్లాలనే ఆలోచన కూడా మొదలవుతుంది. ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుస సెలవులు ఉండటంతో చాలామంది వెకేషన్ ప్లాన్ చేసుకుంటారు. అయితే, ఫ్యామిలీతో కలిసి వెళ్లాలన్నా, పార్ట్‌ నర్‌ తో ప్రశాంతంగా గడపాలన్నా, స్నేహితులతో ఎంజాయ్ చేయాలన్నా.. తమ ఇంట్రెస్ట్ కు తగిన డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోవడం ముఖ్యం. విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే, ఇండియాలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ పండుగ సీజన్‌లో మీ ట్రావెల్ ప్లాన్‌ కు ఉపయోగపడే ఐదు వెకేషన్ ఐడియాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్యామిలీ ట్రిప్ కోసం..

కుటుంబంతో కలిసి ప్రయాణించాలనుకునేవారికి జైపూర్, ఉదయ్‌పూర్, అమృత్‌ సర్, మైసూరు మంచి ఆప్షన్లుగా చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలు, ప్రసిద్ధ ఆలయాలు, స్థానిక మార్కెట్లు, టేస్టీ రీజినల్ ఫుడ్స్ ఆస్వాదించవచ్చు. పిల్లలకు కొత్త ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలియజేయడానికి కూడా ఇలాంటి ట్రిప్స్ ఉపయోగపడతాయి. పండుగ వేడుకల్లో పాల్గొంటూ కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయం గడపవచ్చు.

కపుల్స్ కోసం రొమాంటిక్ వెకేషన్

Advertisement

పార్ట్‌ నర్‌ తో కలిసి ప్రశాంతమైన వాతావరణంలో కొంత సమయం గడపాలనుకుంటే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి ఈశాన్య భారతదేశంలోని అందమైన ప్రాంతాలను ఎంచుకోవచ్చు. చుట్టూ పచ్చని కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, ప్రకృతి అందాల మధ్య చేసే ప్రయాణం ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది. సాయంత్రం వేళల్లో లాంగ్ వాక్స్, అందమైన వ్యూ పాయింట్ల సందర్శన, క్యాండిల్‌ లైట్ డిన్నర్‌ తో ఈ ట్రిప్‌ను మరింత మెమరబుల్‌గా మార్చుకోవచ్చు.

బీచ్ లవర్స్‌  కోసం..

సముద్ర తీరంలో రిలాక్స్ అవ్వాలనుకునేవారికి గోవా, కేరళ, అండమాన్ దీవులు మంచి డెస్టినేషన్లు. బీచ్‌లో సమయం గడపడం, స్థానిక ఫుడ్‌ రుచి చూడటం, తీర ప్రాంతాల అందాలను చూస్తూ గడపాలనుకునే వారు తమ ట్రిప్‌ లో వీటిని భాగం చేసుకోవచ్చు. అయితే, పండుగల సమయంలో కొన్ని బీచ్‌లు రద్దీగా ఉండే అవకాశం ఉంది. అందుకే, ముందుగానే హోటల్స్ బుక్ చేసుకోవడంతో పాటు, ప్రశాంతమైన బీచ్‌లను కూడా మీ ట్రావెల్ ప్లాన్‌లో చేర్చుకోవడం మంచిది.

పండుగల కోసం..

Advertisement

భారతీయ సంప్రదాయాలను దగ్గరగా చూడాలనుకునేవారికి వారణాసి, కోల్‌కతా, ఢిల్లీ, అహ్మదాబాద్ ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తాయి. వారణాసిలో దీపావళి వేడుకలు, కోల్‌కతాలో దుర్గా పూజ, ఢిల్లీలో దసరా రామ్‌లీలా ప్రదర్శనలు, అహ్మదాబాద్‌లో నవరాత్రి గర్బా నృత్యాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

 సోలో ట్రావెలర్స్ కోసం అడ్వెంచర్ ట్రిప్స్!

ఒంటరిగా ప్రయాణిస్తూ కొత్త ఎక్స్ పీరియెన్స్ పొందాలనుకునే వారికి రిషికేశ్, హంపి, పాండిచ్చేరి, మేఘాలయ మంచి ఆప్షన్స్ గా చెప్పుకోవచ్చు. ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీ, హెరిటేజ్ వాక్స్, వెల్‌ నెస్ రిట్రీట్స్ లాంటి యాక్టివిటీస్‌ తో టూర్ ను మరింత క్రేజీగా మార్చుకోవచ్చు.

Read Also: అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

Tags

Related News

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×