Ahmed Shehzad On Virat Kohli: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ రేంజ్ అంతా కాదు. క్రికెట్ లోనే కాకుండా సంపాదనలో కూడా మనోడు దూసుకు వెళ్తున్నాడు. మూడేళ్ల కిందటే లండన్ లో సెటిల్ అయిన విరాట్ కోహ్లీ గురించి తాజాగా పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ కూడా తనలాగే ఉంటాడని… కానీ తన కంటే పెద్ద అందగాడు కాదంటూ పరువు తీశారు. నా హెయిర్ స్టైల్ ను కాపీ కొట్టి.. అమ్మాయిలను పడేస్తుంటాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నా హెయిర్ స్టైల్ కాపీ కొట్టి, అనుష్క శర్మను పడేశాడంటూ సెటైర్లు పేల్చారు. అంతేకానీ కోహ్లీ పీకిందేమీ లేదంటూ హేళన చేశారు. దీంతో విరాట్ కోహ్లీపై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ అహ్మద్ షెజాద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారారు.
విరాట్ కోహ్లీ లైఫ్ స్టైల్ పై పాకిస్తాన్ మాజీ ఓపెనర్ గా అహ్మద్ షెజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ తనలాగే ఉంటాడని.. ఇద్దరి హెయిర్ స్టైల్స్ కామన్ గా ఉంటాయని తనతో చాలా మంది చెప్పినట్టు గుర్తు చేశారు. తామిద్దరి బ్యాటింగ్ స్టైల్ కూడా ఒకే తరహాలో ఉంటుందని చెప్పినట్టు వివరించారు. విరాట్ కోహ్లీ ఎలా దూకుడుగా ఆడతాడో… తాను కూడా అదే తరహాలో ఆడతానని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు పలు సార్లు. తనతో అన్నట్టు పేర్కొన్నారు. ప్రతి విషయంలో విరాట్ కోహ్లీ, తనకు ఉన్న కామన్ విషయాలను చర్చించేవారన్నారు. నా హెయిర్ స్టైల్ కాపీ కొట్టి, అనుష్కను కోహ్లీ పడేశాడంటూ బాంబ్ పేల్చారు.
వాస్తవానికి విరాట్ కోహ్లీ కంటే తానే అద్భుతంగా ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయని అహ్మద్ షెజాద్ వివరించారు. కానీ భారతదేశంలో విరాట్ కోహ్లీ పుట్టడం వల్ల ఉన్నత స్థాయికి ఎదిగాడని ఎమోషనల్ అయ్యారు. అదృష్టం తన వైపు కాకుండా విరాట్ కోహ్లీ వైపు ఉండడంతో అతడు లెజెండ్ అయ్యాడని పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ టాలెంట్ ఉన్నప్పటికీ పాకిస్తాన్ దేశంలో పుట్టడం వల్ల తాను ఎదగలేకపోయానని అహ్మద్ షెజాద్ ఎమోషనల్ అయ్యారు. విరాట్ కోహ్లీకి బీసీసీఐతో పాటు మహేంద్రసింగ్ ధోని లాంటి వాళ్ళు ఎంతో మంది అండగా నిలిచారని… ఫామ్ కోల్పోయిన కూడా వెనుక నుంచి నడిపించారని ప్రశంసించారు. కానీ పాకిస్తాన్ క్రికెట్లో అలాంటి పరిస్థితులు లేవని ఆగ్రహించారు. ఒకడు డీలా పడిపోతే… వాడిని మరింత తొక్కేసే ప్రయత్నం చేస్తారని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్ క్రికెట్ లో కుట్రలు తప్ప… ఎంకరేజ్మెంట్ ఉండదని షాకింగ్ నిజాలను బయటపెట్టారు.