Best food for liver : శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో కాలేయం ఒకటి. జీర్ణక్రియను మెరుగు పరచడం, హానికరమైన వ్యర్థాలను తొలగించడం దీని ప్రధాన బాధ్యత. అయితే.. ప్రస్తుత కాలంలో.. ఫాస్ట్ ఫుడ్, ఆల్కహాల్, సరైన వ్యాయామం లేకపోవడం వల్ల ‘ఫ్యాటీ లివర్’సమస్యలు పెరిగిపోతున్నాయి.ఖరీదైన మందుల కంటే.. మనం రోజూ తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా లివర్‌ను సహజంగానే క్లీన్ చేసుకోవచ్చు. కాలేయానికి ప్రాణం పోసే.. ఆ అద్భుతమైన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కాలేయాన్ని కాపాడుకోవడం ఎందుకు ముఖ్యం?
కాలేయం దెబ్బతింటే.. శరీరంలోని మొత్తం వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారిలో లివర్ సంబంధిత వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లివర్ ఆరోగ్యంగా ఉంటేనే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. లివర్ ఆరోగ్యం కోసం తినాల్సినవి..
1. వెల్లుల్లి:
వెల్లుల్లిలో ఉండే ‘అల్లిసిన్’,’సెలీనియం’ అనే పదార్థాలు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయ పడతాయి. ఇది లివర్ ఎంజైమ్‌లను ఉత్తేజితం చేసి శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది.
2. గ్రీన్ టీ :
గ్రీన్ టీలో ‘కాటెచిన్స్’ అనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయంలో.. పేరుకుపోయిన కొవ్వును కరిగించి, లివర్ ఫంక్షనింగ్‌ను మెరుగు పరుస్తాయని పరిశోధనల్లో తేలింది. ముఖ్యంగా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి ఇది గొప్ప ఔషధం.
3. పసుపు:
పసుపులో ఉండే ‘కర్కుమిన్’ కాలేయానికి ఒక రక్షణ కవచంలా పని చేస్తుంది. ఇది దెబ్బతిన్న కాలేయ కణాలను రిపేర్ చేయడంలో.. పితాశయం ఉత్పత్తిని పెంచడంలో తోడ్పడుతుంది.
4. ఆకుకూరలు:
పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఉండే క్లోరోఫిల్ రక్తంలోని రసాయనాలను పీల్చుకుని కాలేయంపై భారాన్ని తగ్గిస్తుంది. ఇవి కాలేయంలోని మెటల్స్, పురుగుమందుల అవశేషాలను తొలగిస్తాయి.
5. ఫ్యాటీ ఫిష్:
చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కాలేయంలో మంటను తగ్గిస్తాయి. ఇవి కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి..ఎంజైమ్ స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచుతాయి.
6. సిట్రస్ ఫ్రూట్స్:
ద్రాక్ష, నిమ్మ, నారింజ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి కాలేయంలో సహజమైన క్లీన్సింగ్ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ముఖ్యంగా..’గ్రేప్‌ఫ్రూట్’లో ఉండే నారింజెనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కాలేయాన్ని రక్షిస్తుంది.
7. కాఫీ:
చాలా మంది కాఫీ ఆరోగ్యానికి చెడు అని భావిస్తారు. కానీ కాలేయానికి కాఫీ చాలా మంచిది. పరిమితంగా.. కాఫీ తాగడం వల్ల లివర్ క్యాన్సర్, సిర్రోసిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
8. వాల్‌నట్స్:
వాల్‌నట్స్‌లో ఉండే అమినో యాసిడ్స్ లివర్‌లోని అమోనియాను తొలగించడంలో సహాయ పడతాయి. ఇవి కాలేయానికి అవసరమైన మంచి కొవ్వులను అందిస్తాయి.
Also Read: అలసట, కడుపు ఉబ్బరంగా ఉంటుందా? అది ఫ్యాటీ లివర్ కావచ్చు.. ఈ హెచ్చరికలు గమనించండి
లివర్ ఆరోగ్యం కోసం మరికొన్ని జాగ్రత్తలు:
మద్యపానానికి దూరం: ఆల్కహాల్ కాలేయానికి అతిపెద్ద శత్రువు. దీని వల్ల లివర్ సిర్రోసిస్ వచ్చే అవకాశం ఉంది.
చక్కెరను తగ్గించండి: సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్ కాలేయంలో కొవ్వును పెంచుతాయి.
నీరు ఎక్కువగా తాగాలి: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల టాక్సిన్స్ సులభంగా విసర్జించబడతాయి.
కాలేయం తనను తాను రిపేర్ చేసుకునే అద్భుతమైన శక్తి కలిగిన అవయవం. మనం చేయాల్సిందల్లా దానికి సరైన పోషకాలను అందించడమే.. పైన పేర్కొన్న ఆహార పదార్థాలను మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే.. కాలేయం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. మీరు మరింత ఉత్సాహంగా ఉంటారు.