E-Paper
Advertisement

కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ

కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ
Advertisement

కాళేశ్వరం ప్రాజెక్టు మనుగడపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ.. అన్నారం.. సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ దిశగా అడుగులు వేగవంతం చేసింది. ఈ మూడు బ్యారేజీల మరమ్మతులు.. పునరుద్ధరణ పనులను సమన్వయం చేసేందుకు ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి కల్నల్ పరిచిత్ మెహ్రా నేతృత్వం వహించనున్నారు. దేశంలోని అత్యుత్తమ ఇంజినీర్లు, ప్రాజెక్టు నిపుణులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. క్షేత్రస్థాయిలో పనుల వేగాన్ని పెంచడం, సాంకేతిక అడ్డంకులను తొలగించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ప్రభుత్వం పేర్కొంది.

వర్షాకాలం ప్రారంభానికి ముందే ప్రాజెక్టు భద్రతను నిర్ధారించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం మే 30వ తేదీని గడువుగా నిర్ణయించింది. ప్రధానంగా బ్యారేజీల పునాదుల వద్ద జియో టెక్నికల్ పరిశీలనలను అత్యంత వేగంగా పూర్తి చేయాలని ఆదేశించింది. వర్షాలు మొదలైతే నదిలోకి నీరు వచ్చే అవకాశం ఉన్నందున.. ఆలోపే కీలకమైన భూగర్భ పరీక్షలు.. మట్టి నమూనాల సేకరణ ముగించాలని స్పష్టం చేసింది. ఈ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు కఠినమైన నిబంధనలను అమలులోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల వివరాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకల్లా ప్రభుత్వానికి నివేదిక రూపంలో పంపాల్సి ఉంటుంది.

Advertisement

కేంద్ర జల సంఘం (CWC).. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ పనులన్నీ సాగనున్నాయి. బ్యారేజీల డిజైనింగ్ మార్పులు.. దెబ్బతిన్న నిర్మాణాల బలోపేతంపై నిపుణుల బృందం దృష్టి సారిస్తుంది. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొంది. రోజువారీ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకుని లక్ష్యాలను చేరుకోవాలని సూచించింది. ప్రాజెక్టు భద్రత రాష్ట్ర ప్రయోజనాలతో ముడిపడి ఉన్నందున అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేసింది.

ఈ కమిటీ ఏర్పాటుతో కాలేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల ప్రక్రియలో స్పష్టత వచ్చింది. బ్యారేజీల కింద ఇసుక కోతకు గురైన ప్రాంతాలను గుర్తించడం.. కుంగిన పిల్లర్ల సామర్థ్యాన్ని పరీక్షించడం వంటి కీలక పనులు యుద్ధ ప్రాతిపదికన సాగనున్నాయి. కాలంతో పోటీ పడుతూ ఈ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికల ఆధారంగా తదుపరి నిర్మాణ పనుల వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.

Advertisement

ALSO READ: Delimitation : తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ రగిలించారా?

Related News

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

Big Stories

Advertisement
×