E-Paper
Advertisement

అలసట, కడుపు ఉబ్బరంగా ఉంటుందా? అది ఫ్యాటీ లివర్ కావచ్చు.. ఈ హెచ్చరికలు గమనించండి

అలసట, కడుపు ఉబ్బరంగా ఉంటుందా? అది ఫ్యాటీ లివర్ కావచ్చు.. ఈ హెచ్చరికలు గమనించండి
Advertisement

Fatty Liver: శరీరంలో కాలేయం అనేది అత్యంత కీలకమైన అవయవం. ఇది రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా.. జీర్ణక్రియలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే.. కాలేయ కణాలలో అధికంగా కొవ్వు పేరుకుపోవడాన్నే ‘ఫ్యాటీ లివర్’ అంటారు. ఇది ప్రారంభంలో .. పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా.. సరైన సమయంలో గుర్తించకపోతే లివర్ సిర్రోసిస్ లేదా లివర్ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. అసలు ఫ్యాటీ లివర్ రావడానికి కారణాలేంటి? మన శరీరం ఇచ్చే హెచ్చరికలు ఎలా ఉంటాయి? అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం.

ఫ్యాటీ లివర్ అంటే ఏంటి?
సాధారణంగా కాలేయంలో.. కొద్ది పాటి కొవ్వు ఉండటం సహజం. కానీ.. కాలేయం బరువులో 5 నుంచి 10 శాతం కంటే.. ఎక్కువ కొవ్వు ఉంటే దానిని ‘ఫ్యాటీ లివర్ డిసీజ్’గా పరిగణిస్తారు. ఇందులో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి.

Advertisement

ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్: అతిగా మద్యం సేవించడం వల్ల వస్తుంది.

నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ (NAFLD): మద్యం తాగని వారిలో కూడా ఆహారపు అలవాట్లు, బరువు వల్ల వస్తుంది.

Advertisement

ఫ్యాటీ లివర్ రావడానికి ప్రధాన కారణాలు:
మన శరీరంలో కొవ్వు జీవక్రియ దెబ్బతిన్నప్పుడు.. ఫ్యాటీ లివర్ ఏర్పడుతుంది. దీనికి గల ముఖ్య కారణాలు ఇవే..

అధిక బరువు: శరీర బరువు ఎక్కువగా ఉండటం, ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల లివర్‌పై ఒత్తిడి పెరుగుతుంది.

మధుమేహం: షుగర్ లెవల్స్ నియంత్రణలో లేకపోతే.. కాలేయంలో కొవ్వు నిల్వలు పెరుగుతాయి.

ఆహారపు అలవాట్లు: అధికంగా నూనెలో వేయించిన పదార్థాలు, జంక్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ , చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం.

ఇన్సులిన్ రెసిస్టెన్స్: మన కణాలు ఇన్సులిన్‌కు సరిగ్గా స్పందించకపోవడం వల్ల కొవ్వు కరగకుండా కాలేయంలోనే ఉండిపోతుంది.

రక్తంలో కొవ్వు: కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణం.

జెనెటిక్స్: కొన్నిసార్లు వంశ పారంపర్యంగా కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

ముందస్తు లక్షణాలు :

ఫ్యాటీ లివర్‌ను ‘సైలెంట్ కిల్లర్’ అంటారు ఎందుకంటే.. ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అయితే.. సమస్య తీవ్రమవుతున్నప్పుడు మన శరీరం కొన్ని సూచనలు ఇస్తుంది.

విపరీతమైన అలసట: ఎప్పుడూ నీరసంగా ఉండటం, చిన్న పనికే అలసిపోవడం.

కడుపు పైభాగంలో నొప్పి: కుడి వైపు పక్కటెముకల కింద అసౌకర్యంగా లేదా భారంగా అనిపించడం.

ఆకలి తగ్గడం: సరిగ్గా ఆకలి వేయకపోవడం, బరువు హఠాత్తుగా తగ్గిపోవడం.

కడుపు ఉబ్బరం: జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు రావడం.

కాళ్ళలో వాపు: తీవ్రత పెరిగితే పాదాలు, కాళ్ళలో నీరు చేరి వాపులు రావచ్చు.

చర్మం, కళ్ళు పసుపు రంగులోకి మారడం: ఇది లివర్ తీవ్రంగా దెబ్బతిన్నప్పుడు కనిపించే జాండిస్ లక్షణం.

Also Read: హెయిర్ ఫాల్‌కి చెక్ పెట్టే సూపర్ ఫుడ్స్.. వారం రోజుల్లోనే మార్పు చూస్తారు!

నివారణ మార్గాలు:
ఫ్యాటీ లివర్‌ను ప్రాథమిక దశలోనే.. గుర్తిస్తే లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చు.

వ్యాయామం: రోజుకు కనీసం 30-40 నిమిషాల వాకింగ్ లేదా వ్యాయామం చేయడం వల్ల కాలేయంలోని కొవ్వు కరుగుతుంది.

ఆరోగ్యకరమైన డైట్: ఆకుకూరలు,తృణధాన్యాలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నూనె, చక్కెరను తగ్గించాలి.

మద్యపానానికి దూరం: కాలేయాన్ని రక్షించుకోవాలంటే.. ఆల్కహాల్‌ను పూర్తిగా మానేయాలి.

నియంత్రణ: బరువును, రక్తపోటును, షుగర్‌ను అదుపులో ఉంచుకోవాలి.

Related News

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ బేస్ ఇచ్చే క్రేజీ బడ్స్!

మీ బంధువులు, స్నేహితులను ఈ 4 ప్రశ్నలు ఎప్పుడూ అడగకూడదు.. రిలేషన్ దెబ్బతింటుంది

ఛార్జింగ్ అవసరం లేని.. ఈ మ్యాజికల్ వేరబుల్ డివైస్ విశేషాలివే!

ఐలైనర్ సరిగ్గా రావడం లేదా? పర్ఫెక్ట్ లుక్ కోసం ఈజీ మేకప్ ట్రిక్స్‌ ఇవిగో

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

Big Stories

Advertisement
×