E-Paper
Advertisement

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?
Advertisement

Sleep Tips: ఉదయం లేవగానే నీరసంగా అనిపిస్తుందా? రోజంతా ఏదో అలసటగా ఉండి, కాఫీ తాగినా పెద్దగా ఉపయోగం కనిపించడం లేదా? అయితే మీ నిద్ర సమయాన్ని ఒకసారి గమనించాల్సిందే. రాత్రి ఎప్పుడు పడుకుంటున్నారన్నది ముఖ్యమే అయినా.. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, సరిపడా గంటలు నిద్రపోవడం కూడా చాలా ముఖ్యం. అందరికీ ఒకే బెడ్‌టైమ్ సరిపోదని నిపుణులు చెబుతున్నారు.

అందరికీ ఒకే రూల్ ఉండదు:

రాత్రి ఎప్పుడు పడుకోవాలనే విషయంలో అందరికీ ఒకే రూల్ ఉండదు. కొంతమందికి రాత్రి త్వరగా పడుకుని ఉదయాన్నే లేవడం బాగా సెట్ అవుతుంది. మరికొందరికి ఆలస్యంగా పడుకుని ఆలస్యంగా లేవడమే సౌకర్యంగా ఉంటుంది. కాబట్టి.. మీ శరీరానికి ఏ సమయం సరిపోతుందో చూసుకోవడం మంచిది. అయితే ప్రతిరోజూ దాదాపు ఒకే సమయానికి నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి.

7 – 9 గంటలు నిద్ర అవసరం:

Advertisement

చాలామంది పెద్దలకు రాత్రికి 7 నుంచి 9 గంటల నిద్ర అవసరం. ఒక రోజు ఐదు గంటలు, మరో రోజు పది గంటలు నిద్రపోవడం కంటే ప్రతిరోజూ దాదాపు ఒకే సమయం నిద్రపోవడం మంచిది. ఇలా చేస్తే ఉదయం లేవగానే ప్రశాంతంగా అనిపించే అవకాశం ఉంటుంది. రోజంతా ఏకాగ్రత కూడా మెరుగుపడుతుంది.

Also Read: బరువు తగ్గాలంటే ఆకలితో ఉండాల్సిన పనిలేదు.. ఈ 4 పనులు చేయండి చాలు!

ఎలా నిద్రపోయారన్నది ముఖ్యం:

Advertisement

ఎక్కువ గంటలు నిద్రపోయినా రాత్రంతా మధ్యలో లేస్తూ ఉంటే నిద్ర సరిగా పట్టినట్టు కాదు. నిద్ర పట్టడానికి చాలా సమయం పడటం, తరచూ మెలకువ రావడం, ఉదయం లేచిన తర్వాత కూడా అలసటగా ఉండటం వంటివి నిద్ర నాణ్యత బాగోలేదని చెప్పే సంకేతాలు కావచ్చు.

ఈ మార్పులు చేసుకోవాల్సిందే:

ఉదయం కాసేపు ఎండలో ఉండటం, పగటిపూట వ్యాయామం చేయడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల నిద్ర మెరుగుపడుతుంది. పడుకునే 6 నుంచి 8 గంటల ముందు కాఫీ, ఇతర కెఫీన్ పానీయాలు తగ్గించడం మంచిది. రాత్రి పడుకునే ముందు ఫోన్ ఎక్కువగా చూడకుండా పుస్తకం చదవడం, సంగీతం వినడం కూడా ఉపయోగపడుతుంది.

డాక్టర్‌ను ఎప్పుడు కలవాలంటే?

సరిపడా నిద్రపోయినా ప్రతిరోజూ అలసటగా ఉంటే దాన్ని లైట్ తీసుకోకూడదు. నిద్ర సమస్యలు కొన్ని నెలలుగా కొనసాగుతున్నా, లేదా ఉదయం లేచిన తర్వాత కూడా ఫ్రెష్‌గా అనిపించకపోయినా వైద్య నిపుణులను కలవడం మంచిది. సరైన కారణం తెలుసుకుని చికిత్స తీసుకుంటే నిద్రతో పాటు రోజువారీ శక్తి కూడా మెరుగుపడవచ్చు.

Also Read: మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఈ 5 ఆహారాలు మీ డైట్‌లో ఉండాల్సిందే!

Tags

Related News

చాణక్య నీతి.. ఈ 6 సందర్భాల్లో మౌనంగా ఉండటమే తెలివైన నిర్ణయం

తెల్లని బట్లలు పాతబడి పసుపుపచ్చగా మారుతున్నాయా? మళ్లీ మెరిసిపోయే తెల్లదనం కోసం టిప్స్

ఫైనాన్షియల్ మాస్టర్స్.. ఈ 3 తేదీల్లో పుట్టినవారు ఏ బిజినెస్ చేసినా సూపర్‌హిట్

కడుపు బరువుగా అనిపిస్తుందా? భోజనం తర్వాత పైనాపిల్ తింటే చాలా ప్రయోజనాలు

నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? రోజూ ఈ వ్యాయామం చేస్తే మంచి గాఢనిద్ర మీ సొంతం

Zomatoలో ఈ టేస్టీ ఫుడ్స్ ఇక దొరకవ్..ఎందుకంటే ?

నేలపై కూర్చొని భోజనం చేయడం మంచిదేనా? వాస్తు ప్రకారం ప్రభావం ఇదే

Big Stories

Advertisement
×