E-Paper
Advertisement

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!
Advertisement

BSNL Plans: ప్రైవేటు టెలికాం సంస్థలు తమ రీఛార్జ్ ఛార్జీలను పెంచడంతో చాలామంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ (BSNL) వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం 4G సేవలు మాత్రమే అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ కు 9.3 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. అయితే డేటాతో పనిలేకుండా కేవలం కాలింగ్ సౌకర్యం మాత్రమే కావాలనుకునే వారి కోసం ఈ సంస్థ ప్రత్యేకంగా వాయిస్-సెంట్రిక్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో రెండు చౌకైన ప్లాన్లు విశేషంగా యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇంతకీ అవి ఏవి? వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఈ కథనంలో చూద్దాం.

రూ.99 ప్లాన్..

తక్కువ బడ్జెట్ కాలింగ్ బెనిఫిట్స్ కావాలనుకునేవారికి ఈ రూ.99ల స్పెషల్ టారిఫ్ వోచర్ సరిగ్గా సరిపోతుంది. ఇది 14 రోజుల వ్యవధితో రానుంది. దేశవ్యాప్తంగా ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఇందులో 50MB హై స్పీడ్ డేటాను సైతం బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. డేటా లిమిట్ అయిపోయినా.. 40kbps స్పీడ్ తో అపరిమితంగా ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే సగటున రోజుకు రూ.7.07 ఖర్చు కానుంది.

రూ. 439 ప్లాన్

Advertisement

ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కలిగిన చౌకైన ప్లాన్ కోరుకునేవారి కోసం బీఎస్ఎన్ఎల్ దీన్ని తీసుకొచ్చింది. 80 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ వల్ల యూజర్ కు సగటున రోజుకు రూ.5.49 మాత్రమే ఖర్చు కానుంది. ఇక బెనిఫిట్స్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ లోనూ ఏ నెట్ వర్క్ కు అయినా ఉచితంగా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో ఫ్రీ 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అయితే వాయిస్ ఓన్లీ ప్లాన్ కావడం వల్ల ఇందులో ఎలాంటి డేటా బెనిఫిట్స్ లభించదు.

Also Read: నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

రెండింటిలో ఏది బెస్ట్?

Advertisement

ఈ రెండు ప్లాన్లను పరిశీలిస్తే.. ఎక్కువ వ్యాలిడిటీ, రోజువారీ ఖర్చు పరంగా రూ.439 ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. అలా కాకుండా తక్కువ బడ్జెట్ లో ఫ్రీ కాల్స్ తో పాటు డేటా కావాలని భావిస్తే.. రూ.99 ప్లాన్ ట్రై చేయవచ్చు. అయితే ఉంటున్న ప్రాంతాలను బట్టి ప్లాన్ల ధరలు, బెనిఫిట్స్ లో కాస్త వ్యత్యాసం ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి రీఛార్జ్ చేసుకునే ముందు ప్లాన్ వివరాలను ఒకసారి చెక్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: నా జీవితంలో నేను చేసిన ఆల్ఫా పని అదే.. ఎన్నో నిజాలు బయటపెట్టిన అల్లు అర్జున్!

Tags

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×