E-Paper
Advertisement

బరువు తగ్గాలంటే ఆకలితో ఉండాల్సిన పనిలేదు.. ఈ 4 పనులు చేయండి చాలు!

బరువు తగ్గాలంటే ఆకలితో ఉండాల్సిన పనిలేదు.. ఈ 4 పనులు చేయండి చాలు!
Advertisement

Weight Loss Tips: బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నప్పుడు తక్కువ కేలరీలు తీసుకోవడం ముఖ్యం. అయితే తక్కువ తినాలంటే రోజంతా ఆకలితో ఉండాల్సిన అవసరం లేదు. మనం భోజనం చేసే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే కడుపు నిండిన అనుభూతితో పాటు కేలరీలను కూడా నియంత్రించుకోవచ్చు. తాజాగా చెన్నైకి చెందిన ప్రముఖ ఫిట్‌నెస్ కోచ్ రాజ్ గణపత్ సోషల్ మీడియా ద్వారా సూచించిన ఈ నాలుగు సింపుల్ పద్ధతులు అందుకు ఉపయోగపడతాయి.

భోజనానికి ముందు నీళ్లు తాగడం:

చాలా ఆకలిగా ఉన్నప్పుడు భోజనం మొదలుపెట్టే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం మంచిది. ఇది కడుపులో కొంత నిండిన భావన కలిగించి, వెంటనే ఎక్కువ ఆహారం తినకుండా నియంత్రించడంలో సహాయపడొచ్చు.

Advertisement

Also Read: మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఈ 5 ఆహారాలు మీ డైట్‌లో ఉండాల్సిందే!

ప్లేట్‌ను బ్యాలెన్స్‌గా ఉంచాలి:

మీ ప్లేట్‌లో ప్రోటీన్, కూరగాయలు, అన్నం లేదా మన శరీరానికి శక్తిని అందించే ఒక ప్రధానమైన కార్బోహైడ్రేట్‌లను సమానంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే నూనె, ఫ్రై, క్రీమ్ వంటి ఎక్కువ కేలరీలు ఉండే వంటకాలను తగ్గించడం మంచిది. ఇలా చేస్తే తక్కువ కేలరీలతో మంచి పోషకాలు అందుతాయి.

ముందుగా కూరగాయలు తినాలి:

Advertisement

భోజనం మొదట్లోనే కూరగాయలు తినడం మరో మంచి అలవాటు. కూరగాయల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. ఆ తర్వాత అన్నం, ఇతర కార్బోహైడ్రేట్‌ ఆహారాలు, ప్రోటీన్ తీసుకోవచ్చు.

భోజనం 20 నిమిషాల పాటు తినాలి:

ఆహారాన్ని తొందరగా తినకుండా కనీసం 20 నిమిషాలు సమయం తీసుకోండి. నెమ్మదిగా తింటే శరీరానికి కడుపు నిండిందనే సంకేతాలను గుర్తించడానికి సమయం దొరుకుతుంది. దీంతో అవసరానికి మించి తినకుండా ఉండటం సులభమవుతుంది.

Also Read: ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఇక హెచ్చరిక లేబుల్స్.. కీలక ప్రతిపాదన చేసిన FSSAI!

Tags

Related News

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

అతనంటే ఎంతో ఇష్టం.. కానీ ఐ లవ్ యు చెప్పడానికి భయం.. మనసులో మాట చెప్పేందుకు టిప్స్

ఈ ముగ్గురికి పొరపాటున కూడా సాయం చేయకండి..లేదంటే మీ జీవితమే నాశనం!

Big Stories

Advertisement
×