E-Paper
Advertisement

Healthy Skin: ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది

Healthy Skin: ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు.. మీ ముఖం మెరిసిపోతుంది
Advertisement

Healthy Skin: చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, చర్మం పొడిబారుతుంది. అంతే కాకుండా నిస్తేజంగా కనిపిస్తుంది. ముఖ చర్మం మృదువుగా, మెరుస్తూ ఉండటానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను తప్పకుండా పాటించాలి.

చలి, పొడి గాలి వల్ల చర్మం పొడిబారి నిర్జీవంగా మారడమే చర్మం గరుకుగా మారుతుంది. మీరు కూడా ఈ రకమైన సమస్యను ఎదుర్కుంటే గనక కొన్ని రకాల టిప్స్ మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. మరి చర్మం కాంతిని పెంచడానికి ఉపయోగపడే 5 ముఖ్యమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

బాగా మాయిశ్చరైజ్ చేయండి: మాయిశ్చరైజర్‌ని రోజుకు కనీసం రెండుసార్లు ఉపయోగించండి. రాత్రి పడుకునే ముందు రిచ్ మాయిశ్చరైజర్ వాడండి. హైలురోనిక్ యాసిడ్ , సిరమైడ్లతో కూడిన మాయిశ్చరైజర్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉండే పోషకాలు చర్మాన్ని తేమగా ఉంచుతాయి. అంతే కాకుండా గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి.

వేడి నీటితో స్నానం చేయకూడదు: వేడి నీరు చర్మం నుండి తేమను తొలగిస్తుంది. అందుకే గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. సూర్యుని హానికరమైన కిరణాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఇంటి నుండి బయలుదేరే ముందు తప్పకుండా సన్‌స్క్రీన్‌ని వాడాలి.

Advertisement

హోం రెమెడీస్: తేనె, పెరుగు, కలబంద వంటి సహజమైన పదార్థాలు చర్మాన్ని మృదువుగా , మెరిసేలా చేస్తాయి. వారానికి ఒకసారి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. నీరు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అంతే కాకుండా చర్మానికి లోపల నుంచి పోషణను అందిస్తుంది.

Also Read: హెన్నా ఇలా వాడారంటే.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారడం గ్యారంటీ

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి: విటమిన్లు సి, ఇ, ఎ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను తినండి. మొలకెత్తిన విత్తనాలు తినడం వల్ల కూడా చర్మానికి కూడా మేలు జరుగుతుంది.

ఒత్తిడిని తగ్గించండి: ఒత్తిడి చర్మంపై ప్రభావం చూపుతుంది. యోగా, మెడిటేషన్ లేదా మీకు నచ్చిన ఏదైనా యాక్టివిటీ చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోండి.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×