Henna For White Hair: ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఇదిలా ఉంటే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి చాలా మంది మార్కెట్‌లో దొరికే హెయిర్ కలర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. తెల్లజుట్టు సమస్య నుంచి బయటపడాలంటే హెన్నాను అప్లై చేయండి.
జుట్టు అందాన్ని పెంచే ఉత్తమ మార్గాలలో హెన్నా ఒకటి. మహిళలు, పురుషులు తమ జుట్టును బలంగా, నల్లగా, అందంగా మార్చుకోవడానికి సహజమైన రంగును ఉపయోగిస్తున్నారు. పూర్వ కాలంలో మెహందీ ఆకులను జుట్టుకు ఉపయోగించేవారు. ఇప్పుడు హెన్నా పౌడర్‌ను హెయిర్ కోసం ఉపయోగిస్తున్నారు. మెహందీని శతాబ్దాలుగా, సహజమైన హెయిర్ డైగా వాడుతున్నారు. రసాయన జుట్టు రంగులను వాడకుండా హెన్నాను వాడటం వల్ల జుట్టు నల్లగా మారుతుంది.
మీ నెరిసిన జుట్టుకు రంగు లాగానే కాకుండా, హెన్నా మీ జుట్టును పోషకాలతో సమృద్ధిగా ఉంచుతుంది. హెన్నా పౌడర్ హెయిర్ ట్రీట్మెంట్, హెయిర్ కండిషనింగ్, జుట్టును బలోపేతం చేయడం నుండి లోతైన పోషణ వరకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది.
జుట్టు రంగును పెంచుతుంది: హెన్నా అనేది ఒక సహజమైన జుట్టు రంగు. దీనిని జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
మీ స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: హెన్నా అద్భుతమైన యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. హెన్నా యొక్క ఈ లక్షణాలు మీ స్కాల్ప్‌ను శుభ్రంగా, ఇన్‌ఫెక్షన్ లేకుండా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా, ఇది శరీరానికి చల్లదనాన్ని , ప్రశాంతతను అందిస్తుంది. ఇది దురద, వాపులను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
మీ జుట్టును కండిషన్ చేయండి:
కండిషనింగ్ కోసం హెన్నా హెయిర్ మాస్క్ ఉపయోగించడం చాలా మంచిదని భావిస్తారు. ఇది జుట్టును చాలా కాలం పాటు మృదువుగా ఉంచుతుంది. హెన్నాతో పాటు పెరుగు, తేనె, గుడ్లు కూడా కలపి హెయిర్ మాస్క్ లాగా వేసుకోవచ్చు.
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది:
హెన్నా జుట్టు రాలడం తగ్గించడంలో సహాయపడుతుంది . అంతే కాకుండా జుట్టు చివర్లు చిట్లడాన్ని నివారిస్తుంది. జుట్టు డ్యామేజ్ తగ్గిస్తుంది. జుట్టును బలపరుస్తుంది. స్కాల్ప్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను పెంచుతుంది.
హెన్నాలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది మీ జుట్టుకు పోషణ ,బలాన్ని అందించడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును రక్షిస్తుంది. అదనంగా ఇది హెయిర్ క్యూటికల్స్‌ను మూసివేస్తుంది. ఇది జుట్టు రాలడాన్ని నిరోధించడమే కాకుండా మీ జుట్టుకు సిల్కీ, సాఫ్ట్ షైన్ ఇస్తుంది.
మీరు మీ తెల్ల జుట్టుకు రంగు వేయడానికి హెన్నాను అప్లై చేయాలనుకుంటే, మీ జుట్టు పొడవును బట్టి హెన్నాను తీసుకొని, ఒకటి నుండి రెండు చెంచాల ఆవాల నూనె ,నీటిని కలిపి మందపాటి పేస్ట్ చేయండి.
డ్రై హెయిర్‌పై హెన్నాను అప్లై చేయడం వల్ల జుట్టు మరింత విరిగిపోతుంది. అందువల్ల, జుట్టును కొద్దిగా తడి చేసిన తర్వాత మాత్రమే హెన్నాను రాయండి . హెన్నాను 30 నిమిషాల కంటే ఎక్కువసేపు జుట్టుపై ఉంచకూడదు. తర్వాత సాధారణ నీటితో వాష్ చేయండి. దీని కారణంగా జుట్టు యొక్క రంగు మారుతుంది. అంతే కాకుండా హెయిర్ లేత నారింజ రంగులోకి మారుతుంది.
ఈ ప్యాక్ జుట్టుకు కూడా మేలు చేస్తుంది:
2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకుని దానికి 1 టేబుల్ స్పూన్ ముల్తానీ మిట్టిని కలపండి. తర్వాత ఈ ప్యాక్‌ని మీ జుట్టుకు అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత వాష్ చేసుకోండి. వారానికి రెండు సార్లు దీనిని ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుతుంది.
Also Read: జుట్టు త్వరగా పెరగాలా ? అయితే ఈ ఆయిల్ వాడండి
హెన్నా అప్లై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు:
హెన్నా అప్లై చేయడం వల్ల జుట్టుకు చాలా మేలు జరుగుతుంది.
హెన్నా ఒక సహజమైన కండీషనర్. ఇది మీ జుట్టును సిల్కీగా ఉంచుతుంది.
అంతే కాకుండా హెన్నా మన దెబ్బతిన్న జుట్టును కూడా రిపేర్ చేస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.