Tollywood.. సాధారణంగా ప్రేమకు కళ్ళు ఉండవు అంటారు. అయితే కొంతమంది తమకంటే వయసులో రెండు రెట్లు లేదా మూడు రెట్లు పెద్దవారైన వ్యక్తులను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకొంతమంది అప్పటికే వారికి వివాహం జరిగి, పిల్లలు ఉన్నా సరే అలాంటి వారితో ఏడడుగులు వేస్తున్నారు. ఇంకొంతమంది తాము ప్రేమించిన వారికి అప్పటికే పెళ్లయింది అనే విషయం తెలియక, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. అయితే పెళ్లి అయిన తర్వాత ఈ విషయం తెలిసి దూరం అవుతున్నారు. అయితే ఇదంతా కాస్త పక్కన పెడితే.. ఆమె వయసు 17 ఏళ్ళే.. కానీ తనకంటే మూడు రెట్లు వయసులో పెద్దవాడైన వ్యక్తిని వివాహం చేసుకుంది. దీనికి తోడు ఆ వ్యక్తికి అప్పటికే మూడు వివాహాలు జరిగిపోయాయి. మరి నిజం తెలిసి పెళ్లి చేసుకుందా..? లేక పెళ్లి జరిగిన తర్వాత నిజం తెలిసిందా..? ఆ తర్వాత ఆమె ఏం చేసింది అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టిన నటి అంజు..
ఆమె ఎవరో కాదు ప్రముఖ నటి అంజు (Anju)..చైల్డ్ ఆర్టిస్ట్ గా నటనా జీవితాన్ని మొదలుపెట్టిన ఈమె తెలుగు, కన్నడ , తమిళ్ ,మలయాళం భాషల్లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే తనకంటే 31 ఏళ్లు పెద్దవాడైన నటుడిని వివాహం చేసుకుంది. ఇదే తాను చేసిన అతి పెద్ద తప్పు అంటూ తాజాగా ఒక మీడియా ఛానల్ తో మాట్లాడి అసలు విషయాన్ని బయటపెట్టింది. అంజు మాట్లాడుతూ.. “నాకు ఏడాదిన్నర వయసున్నప్పుడు డైరెక్టర్ మహేంద్రన్ నన్ను బాలనటిగా నటించమని ఇండస్ట్రీ లోకి తీసుకొచ్చారు. అక్కడి నుంచే నా కెరియర్ మొదలయ్యింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్ చేస్తున్నాను. అయితే నేను ఇండస్ట్రీలోకి రావడం మా అమ్మకి ఇష్టం లేదు. దీనికి తోడు నా పెళ్లి కూడా అనుకోకుండా జరిగిపోయింది.
టైగర్ ప్రభాకర్ వలలో పడ్డ అంజు..
అయితే ఒకసారి నేను కన్నడ సినిమా చేయడానికి బెంగళూరుకి వెళ్తే.. అక్కడ నన్ను స్టార్ హీరో టైగర్ ప్రభాకర్ (Tiger Prabhakar)చూసి ఇష్టపడ్డారు. వెంటనే పెళ్లి చేసుకుంటావా? అని అడిగారు. అయితే అప్పటికే అతడికి మూడు పెళ్లిళ్లు జరిగాయి. దీనికి తోడు పిల్లలు కూడా ఉన్నారు. ఆ సమాచారాన్ని అంతా నా దగ్గర దాచిపెట్టాడు. ముఖ్యంగా ఒక మలయాళ సినిమా కోసం నన్ను బుక్ చేశారు. ఆ సినిమాలో నేను, కుష్బూ నటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నేను టైగర్ ప్రభాకర్ కి చెప్పాను. వెంటనే నిర్ణయం తీసుకోమని సలహా ఇచ్చారు. అలా కూర్చొని ఆలోచించినప్పుడు కన్నడలో నటిస్తే కొత్త భాషలో నటించే అవకాశం వస్తుందని నిర్ణయించుకొని, ఆయన చెప్పినట్టే అవకాశాన్ని ఎంచుకున్నాను. ఇక ఆ సినిమాతోనే నాకు – ప్రభాకర్ కి మధ్య పరిచయం ఏర్పడింది.
ముసలాడిని పెళ్లి చేసుకొని నరకం చూసిన అంజు..
ఆ సమయంలో నా వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే. నా మనసు కూడా పెళ్లికి సిద్ధంగా లేదని చెప్పాను. అయినా అతడు వినలేదు. అప్పటికి ఆయన వయసు 50 ఏళ్లు. ఆయన్ను చూసి మా అమ్మ ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. అయినా సరే అమ్మ మాట వినకుండా ఇంట్లో చెప్పకుండా ప్రభాకర్ ను గుడ్డిగా నమ్మి పెళ్లి చేసుకున్నాను.. అప్పుడే తెలిసింది అతడికి మూడు పెళ్లిళ్లు అయ్యాయని, పిల్లలు కూడా ఉన్నారని. అప్పుడు నేనేదో తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అనిపించింది. ఎంతో బాధపడ్డాను. కుటుంబ సభ్యులను కూడా ఎదిరించి , పెళ్లి చేసుకున్నాను కదా.. నాకు నరకం తప్పదు అనుకున్నాను. ఇక అప్పటికే నేను గర్భవతిని. కొడుకు కూడా పుట్టాడు. ఇక ప్రభాకర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక అతనితో ఉండడం ఇష్టం లేక అతడి నుంచి విడిపోయాను అంటూ తెలిపింది. ఏదేమైనా మోసపోయి..బాధ నుంచి తేరుకొని ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చింది అంజు. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.