BigTV English

Allu Arjun : హయ్యెస్ట్ పెయిడ్ బ్రాండ్ అంబాసిడర్… పుష్పాగాడి ఫీవర్ ఇట్లుంటది

Allu Arjun : హయ్యెస్ట్ పెయిడ్ బ్రాండ్ అంబాసిడర్… పుష్పాగాడి ఫీవర్ ఇట్లుంటది

Allu Arjun : ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా పుష్ప గాడి ఫీవర్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ‘పుష్ప’ (Pushpa) మూవీతో అల్లు అర్జున్ (Allu Arjun) క్రియేట్ చేస్తున్న సెన్సేషన్ అంతా కాదు. అలాగే ఫస్ట్ పార్ట్ “పుష్ప” మూవీతో అల్లు అర్జున్ నేషనల్ అవార్డును అందుకోవడం మాత్రమే కాదు ఆయన క్రేజ్ అమాంతంగా ఆకాశాన్ని తాకుతుందా అన్నట్టుగా పెరిగిపోయింది. దానికి నిదర్శనం అల్లు అర్జున్ ఇప్పుడు ఇండియాలోనే హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ మాత్రమే కాదు.. హయ్యెస్ట్ పెయిడ్ బ్రాండ్ అంబాసిడర్ కూడా.


ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) స్టార్ డం ఆల్ టైం హైలో ఉంది. ‘పుష్ప’ రాజ్ గా ఆయన తెరపైకి తిరిగి రావాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఆసియాలోనే అత్యధిక పారితోషకం తీసుకునే బ్రాండ్ అంబాసిడర్ గా చరిత్రను క్రియేట్ చేశారు. ఇటీవల అల్లు అర్జున్ పాపులర్ కూల్ డ్రింక్ లలో ఒకటైన థమ్స్ అప్ యాడ్ లో భాగమైన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఈ యాడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించగా, ఇప్పుడు ఆ ప్లేస్ ని అల్లు అర్జున్ కబ్జా చేశారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని, ఈ యాడ్ కోసం ఆయనకు దేశంలో మరే ఇతర హీరోకు ఇవ్వనంత భారీగా రెమ్యూనరేషన్ చెల్లించినట్టుగా తెలుస్తోంది. పైగా దీనికి ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ తో ఏసియాలోనే అత్యధిక పారితోషికం అందుకున్న బ్రాండ్ అంబాసిడర్ గా మరో ఐకానిక్ రికార్డును క్రియేట్ చేశారు. అయితే ఇంతకీ థమ్స్ అప్ యాడ్ కి బన్నీ తీసుకున్న పారితోషికం ఎంత అన్న విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

ఇక అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన ఈ యాడ్ తో థమ్స్ బ్రాండ్ కు సంబంధించిన మార్కెట్ విలువ మరింతగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటిదాకా అల్లు అర్జున్ RedBus, Hotstar, Frooti, ​​OLX, Colgate, 7 Up, Coca-Colaతో సహా అనేక బ్రాండ్‌లకు సంబంధించిన ప్రాడక్ట్ లకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అయితే ఆ యాడ్స్ అన్నిటి కంటే థమ్స్ అప్ యాడ్ కి అల్లు అర్జున్ అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది.


ఇదిలా ఉండగా మరోవైపు అల్లు అర్జున్ (Allu Arjun) ఇండియాలోనే అత్యధిక పారితోషం అందుకుంటున్న స్టార్ హీరోగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారు. “పుష్ప 2 : ది రూల్” (Pushpa 2) మూవీ కోసం ఆయన ఏకంగా 300 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే ఆయన ఇప్పటిదాకా హయ్యెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్ గా ఉన్న షారుఖ్ ఖాన్ రికార్డులను గల్లంతు చేసినట్టే. మరి “పుష్ప 2” మూవీ రిలీజ్ కాకముందే పుష్పరాజ్ రూల్ ఇలా ఉంటే.. రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవడం కష్టమేం కాదు. “పుష్ప 2” మూవీ డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతోంది. నవంబర్ 17న ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×