E-Paper
Advertisement

Kidney Stones: ఎండలు పెరిగితే కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Kidney Stones: ఎండలు పెరిగితే కిడ్నీలో రాళ్లు ఎందుకు వస్తాయి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

Kidney Stones: వేసవి కాలంలో ఎండలు పెరగడంతో పాటు మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్‌లో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం చాలా ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. దీనికి ప్రధాన కారణం డీహైడ్రేషన్. మనం తగినంత నీరు తాగకపోవడం వల్ల మూత్రం చిక్కబడి, అందులోని లవణాలు రాళ్లుగా మారుతాయి. వేసవిలో మన ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కిడ్నీ రాళ్ల సమస్య నుంచి ఎలా బయటపడాలో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

వేసవిలో కిడ్నీ రాళ్లు ఎందుకు పెరుగుతాయి?

భానుడి భగభగలు మొదలయ్యాయంటే చాలు.. ఆసుపత్రుల్లో కిడ్నీ రాళ్ల సమస్యతో చేరే వారి సంఖ్య ఒక్కసారిగా పెరుగుతుంది. దీనిని “సమ్మర్ కిడ్నీ స్టోన్ సిండ్రోమ్” అని కూడా పిలుస్తుంటారు. అసలు ఎండలకు.. కిడ్నీలో రాళ్లకు ఉన్న సంబంధం ఏంటి?

1. డీహైడ్రేషన్:
మన కిడ్నీలు రక్తాన్ని వడపోసి మలినాలను యూరిన్ ద్వారా బయటకు పంపుతాయి. సమ్మర్‌లో విపరీతమైన చెమట వల్ల శరీరంలోని నీరు బయటకు పోతుంది. మనం ఆ స్థాయిలో నీటిని తిరిగి తీసుకోకపోతే.. యూరిన్ పరిమాణం తగ్గి చిక్కగా మారుతుంది. యూరిన్ లో ఉండే కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి లవణాలు కరగకుండా ఒకచోట చేరి స్పటికాలుగా మారి.. క్రమంగా రాళ్లుగా మారుతాయి.

2. విటమిన్-డి ప్రభావం:
వేసవిలో మనం ఎండలో ఎక్కువగా తిరుగుతాము. సూర్యరశ్మి వల్ల మన శరీరంలో విటమిన్-డి ఉత్పత్తి పెరుగుతుంది. విటమిన్-డి మన శరీరం కాల్షియంను గ్రహించేలా చేస్తుంది. రక్తంలో కాల్షియం స్థాయిలు పెరిగినప్పుడు.. అది యూరిన్ ద్వారా బయటకు వెళ్లే క్రమంలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది.

3. ఆహారపు అలవాట్లు:
ఎండల వల్ల మనం తరచుగా కూల్ డ్రింక్స్, సోడాలు తాగుతుంటాం. వీటిలో ఉండే ఫాస్పారిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి దోహదం చేస్తుంది. అలాగే వేసవిలో ఉప్పు (సోడియం) ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ తిన్నా.. మాంసాహారం అతిగా తీసుకున్నా కిడ్నీలపై భారం పడుతుంది.

4. శారీరక శ్రమ, చెమట:
బయట పనులు చేసేవారు. వ్యాయామం చేసేవారు వేసవిలో విపరీతంగా చెమటలు కక్కుతారు. చెమట ద్వారా నీరు పోవడమే కాకుండా.. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతింటుంది. ఇది కిడ్నీల పని తీరుపై ప్రభావం చూపి స్టోన్స్ ఏర్పడటానికి కారణమవుతుంది.

నివారణ మార్గాలు:
నీరు అమృతం: రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. యూరిన్ పారదర్శకంగా ఉంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం.

నిమ్మరసం: నిమ్మజాతి పండ్లలో ఉండే ‘సిట్రేట్’ కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. రోజుకు ఒక గ్లాసు నిమ్మరసం తాగడం చాలా మంచిది.

ఉప్పు తగ్గించండి: ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి. దీని వల్ల యూరిన్ లో కాల్షియం స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

Also Read: ఆరోగ్యం కోసం చేసే.. ఈ 10 పెట్టుబడులు మీ జీవితాన్నే మార్చేస్తాయి!

కొబ్బరి నీళ్లు: ప్రకృతి ప్రసాదించిన కొబ్బరి నీళ్లు వేసవిలో కిడ్నీలకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరానికి చలువ చేయడమే కాకుండా విషతుల్యాలను బయటకు పంపుతాయి.

కిడ్నీ రాళ్లు రావడం అనేది కేవలం వాతావరణం మీద మాత్రమే కాదు.. మన లైఫ్ స్టైల్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. వేసవిలో దాహం వేసే వరకు ఆగకుండా.. క్రమం తప్పకుండా నీరు తాగుతూ ఉండాలి. తీవ్రమైన వెన్నునొప్పి, యూరిన్ లో మంట వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే డాక్టర్‌‌‌ని సంప్రదించడం ఉత్తమం.

Related News

మీ అబ్బాయి కోసం పెళ్లిసంబంధాలు చూస్తున్నారా? ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి సర్వ గుణ సంపన్నురాలు

వేసవిలో అద్దంలా మెరిసిపోయే ముఖ చర్మం కావాలా? ఈ టిప్స్ మీ కోసమే

కొత్త ఇల్లు మీ కోసం సంతోషాలు తీసుకొస్తుందా లేదా కష్టాలకు కారణమవుతుందా? దీనికి కారణాలు ఇవే

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

Big Stories

×