E-Paper
Advertisement

Council Inauguration: రేపే శాసనమండలి హాల్ ప్రారంభోత్సవం

Council Inauguration: రేపే శాసనమండలి హాల్ ప్రారంభోత్సవం
Advertisement

Council Inauguration: స్వేచ్ఛ బ్యూరో: ఈ నెల 8న శాసనమండలి హాల్ ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అసెంబ్లీలో సీఎం సెక్యూరిటీ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అసెంబ్లీ ఆవరణతో పాటు గాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ తల్లి విగ్రహ వద్ద సైతం పరిశీలన చేశారు. ఆ విగ్రహాన్ని సైతం అదే రోజూ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

Also Read: BRS Vs Congress: రాజ్యసభలో కాంగ్రెస్ క్లియర్.. BRS ఎందుకు పోటీ చేయలేదు? అసలు కారణం ఇదే!

హెరిటేజ్ భవనంను..

Advertisement

ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ, శాసనమండలి ఒకే దగ్గర ఉండేవి. అయితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేర్వురు భవనాల్లో కొనసాగుతున్నాయి. దీంతో ఒకే దగ్గర ఉండాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి హెరిటేజ్ భవనంను కాపాడుకునేందుకు చర్యలు చేపట్టారు. దాదాపు 30కోట్లతో శాసనమండలి పనులు పూర్తి చేసినట్లు సమాచారం. పార్లమెంట్ తరహాలో తెలంగాణ శాసన సభ ఉండబోతుంది. ఒకే చోట శాసన సభ , శాసన మండలి ఒకే దగ్గర ఉండనున్నాయి. ఎమ్మెల్యేలకు , ఎమ్మెల్సీలకు , అధికారులకు , మంత్రులకు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఎమ్మెల్యేలకు ,ఎమ్మెల్సీలకు అందరికి సెంట్రల్ హల్ నిర్మాణం చేశారు. డ్రైనేజ్, ఫ్లోరింగ్, ఎలక్ట్రిసిటీ, సీఎం ఛాంబర్, చైర్మన్, వైస్ చైర్మన్ చాంబర్ ,సెక్రటరీ ఆఫీస్, కౌన్సిల్ సెక్రెటరీయేట్, మీడియాకు హాల్ తయారు చేశారు. ప్రస్తుతం ఉన్న తెలంగాణ శాసన మండలిని, జూబ్లీహాల్ ను పునరుద్ధరణ చేసి ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకునే ఆలోచనలో సర్కార్ ఉంది.

Also Read: UPSC 2025: సివిల్ సర్వీసెస్‌లో సత్తా చాటిన తెలంగాణ యూత్..!

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×