E-Paper
Advertisement

తక్కువ ధరకే డ్రై ఫ్రూట్స్.. ఈ మార్కెట్లకు వెళ్తే మీ డబ్బు సగం ఆదా!

తక్కువ ధరకే డ్రై ఫ్రూట్స్.. ఈ మార్కెట్లకు వెళ్తే మీ డబ్బు సగం ఆదా!
Advertisement

Cheapest Dry Fruit Markets in India: మన దేశంలో డ్రై ఫ్రూట్స్ వాడకం రోజురోజుకూ పెరుగుతోంది. ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్ వంటివి మన ఆహారంలో భాగమయ్యాయి. అయితే..సూపర్ మార్కెట్లలో వీటి ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. అందుకే చాలా మంది తక్కువ ధరకే నాణ్యమైన డ్రై ఫ్రూట్స్ ఎక్కడ దొరుకుతాయా అని వెతుకుతుంటారు. ఇండియాలోని కొన్ని ప్రధాన నగరాల్లోని హోల్‌సేల్ మార్కెట్లలో మనకు ఊహించని తక్కువ ధరలకే ఇవి లభిస్తాయి.రిటైల్ ధరలతో పోలిస్తే.. ఇక్కడ 40% నుంచి 50% వరకు తక్కువ ధరకే డ్రై ఫ్రూట్స్ కొనొచ్చు.

డ్రై ఫ్రూట్స్ తక్కువ ధరకే లభించే హోల్‌సేల్ మార్కెట్లు..

Advertisement

వేగంగా మారుతున్న లైఫ్ స్టైల్ కారణంగా ఫిట్‌నెస్‌ కోసం ప్రతి ఒక్కరూ డ్రై ఫ్రూట్స్‌ను ఆశ్రయిస్తున్నారు. మీరు వ్యాపారం కోసం కాకపోయినా.. ఇంటి అవసరాల కోసం బల్క్ గా కొనుగోలు చేయాలనుకుంటే..ఈ క్రింది మార్కెట్లు మీకు బెస్ట్.

1.ఖారీ బావోలి, ఢిల్లీ :
ఆసియాలోనే అతిపెద్ద మసాలా దినుసులు, డ్రై ఫ్రూట్స్ మార్కెట్‌గా ఖారీ బావోలి పేరుగాంచింది. పాత ఢిల్లీలో ఉన్న ఈ మార్కెట్ 17వ శతాబ్దం నుంచి నడుస్తోంది.

Advertisement

ప్రత్యేకత: ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల నుంచి నేరుగా దిగుమతి అయిన డ్రై ఫ్రూట్స్ లభిస్తాయి.

ధర: సాధారణ మార్కెట్ ధరలతో పోలిస్తే.. ఇక్కడ 30-50% తక్కువ ధరకే బాదం, పిస్తా, అంజీర్ వంటివి లభిస్తాయి.

2.మజీద్ బందర్,ముంబై :
ముంబైలోని మజీద్ బందర్ డ్రై ఫ్రూట్స్ హోల్‌సేల్ వ్యాపారానికి ప్రధాన కేంద్రం. ఇక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు డ్రై ఫ్రూట్స్ ఎగుమతి అవుతుంటాయి.

ప్రత్యేకత: ఇక్కడ నాణ్యతను బట్టి వివిధ గ్రేడ్ల డ్రై ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయి. మీరు బేరమాడగలిగితే చాలా తక్కువకే లభిస్తాయి.

3.బేగం బజార్, హైదరాబాద్ :
దేశంలో అతి తక్కువ ధరలకు డ్రై ఫ్రూట్స్ దొరికే ప్రదేశం హైదరాబాద్‌లోని బేగం బజార్. ఇక్కడ జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష ధరలు చాలా తక్కువగా ఉంటాయి.

ప్రత్యేకత: పండుగ సీజన్లలో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. హోల్‌సేల్ ధరలకే రిటైల్ పరిమాణంలో కూడా కొనుగోలు చేసే అవకాశం కొన్ని షాపుల్లో ఉంటుంది.

4. క్రఫోర్డ్ మార్కెట్, ముంబై :
ముంబైలోని మరో ప్రసిద్ధ మార్కెట్ క్రఫోర్డ్. ఇక్కడ ప్రీమియం క్వాలిటీ డ్రై ఫ్రూట్స్ ,విదేశీ చాక్లెట్లు లభిస్తాయి. ప్యాకేజింగ్, గిఫ్ట్ బాక్సుల కోసం ఇది బెస్ట్ ప్లేస్.

5. బారాబజార్, కోల్‌కతా:
నార్గ్ ఇండియాలో అతిపెద్ద వాణిజ్య కేంద్రం బారాబజార్. ఇక్కడ డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఇతర ఆహార పదార్ధాలు అతి తక్కువ ధరకే లభిస్తాయి.

హోల్‌సేల్ మార్కెట్‌లో కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి:
నాణ్యత: హోల్‌సేల్ మార్కెట్లలో పాత స్టాక్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనేముందు రంగు, వాసన, రుచిని పరీక్షించాలి. పురుగులు పట్టినట్లుగా ఉంటే అస్సలు కొనకండి.

Also Read: వేసవిలో మట్టి కుండలోని నీటిని.. ఐస్ లా మార్చే సింపుల్ ట్రిక్స్ ఇవే!

బల్క్ కొనుగోలు: హోల్‌సేల్ ధరలు వర్తించాలంటే కనీసం 1 కేజీ లేదా 5 కేజీల ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. స్నేహితులు లేదా బంధువులతో కలిసి గ్రూపుగా కొంటే మరింత లాభదాయకంగా ఉంటుంది.

సీజన్ ముఖ్యం: డ్రై ఫ్రూట్స్ సీజన్ లో కొంటే తాజా స్టాక్ దొరుకుతుంది.

ఆన్‌లైన్ పోలిక: కొన్ని సార్లు హోల్‌సేల్ మార్కెట్ ధరలకు, ఆన్‌లైన్ ఫ్లాష్ సేల్స్ ధరలకు పెద్ద తేడా ఉండదు. కాబట్టి రేట్లు సరిచూసుకోవడం మంచిది.

ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోవడానికి బడ్జెట్ అడ్డంకి కాకూడదు. పైన పేర్కొన్న మార్కెట్లు నాణ్యత, ధర విషయంలో మీకు బెస్ట్ డీల్స్ అందిస్తాయి.

Related News

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సాయం చేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు కష్టకాలంలో తోడుగా నిలుస్తారు

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

Big Stories

Advertisement
×