Birth Control Pills causes Cancer: బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం వల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్ కూడా పోయే అవకాశం ఉందని ఇటీవల కొన్ని పరిశోధనల్లో తెలింది. అయితే వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ఇతర క్యాన్సర్లు వచ్చే ఛాన్స్ కూడా ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు కొంతమంది మహిళల ఆరోగ్య పరిస్థితి, డైట్, జీవనశైలి, మెటబాలిజం, హార్మోనల్ ఇంబాలన్స్ వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని పరిశోధనలు చేశారు. అయితే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడిన మహిళల్లో 43శాతం మందికి ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ తగ్గిపోయిందట. ఇద్దరి కంటే ఎక్కువమంది పిల్లలు ఉన్న తల్లుల్లో ఈ ఒవేరియన్ క్యాన్సర్ రిస్క్ 39శాతం తగ్గుతుందట.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ, ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్లు కూడా వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని బర్త్ కంట్రోల్ పిల్స్ ఇతర క్యాన్సర్లు రావడానికి కారణం కావొచ్చని అంటున్నారు.
బర్త్ కంట్రోల్ పిల్స్ వల్ల క్యాన్సర్లు..!
బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోవడం వల్ల శరీరంపై కూడా చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని పరిశోధకులు చెబుతున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం, బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకోవడం టెంపరరీ మెమరీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అధికంగా బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకున్నప్పుడు సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
ALSO READ: వీళ్లు చియా సీడ్స్ అస్సలు తినకూడదు
బర్త్ కంట్రోల్ పిల్స్‌ని కొన్ని రోజులు వాడినా గర్భాశయ క్యాన్సర్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొందరిలో వీటి వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. పిల్స్ వాడిన మొదటి రోజుల్లో ఈ రిస్క్ తక్కువగానే ఉంటుందట. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడడం ఆపేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అయినా దీని ప్రభావం పెరిగే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
పిల్స్ వాడుతున్నప్పుడు, ఎప్పటికప్పుడు డాక్టర్‌తో ఆరోగ్యం మానిటర్ చేయించుకోవడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే గర్భాశయ గమనక్యాన్సర్, వేరియస్ ఇతర క్యాన్సర్లకు దారితీసే HPV వైరస్ సోకకుండా ఉండాలంటే ముందుగానే టీకా వేయించుకోవడం మంచిది.
బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతున్న సమయంలో ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా లేదా హార్మోన్లలో మార్పులు వచ్చినట్లుగా అనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్స్ వాడుతున్న సమయంలో ఆహారం, వ్యాయామం, నిద్ర విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.