Chia Seeds: చియా సీడ్స్‌లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ బి, ఐరన్, కొవ్వు, కాల్షియం, భాస్వరం, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక రకాల పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. వీటిని తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. చియా సీడ్స్ బరువు తగ్గడానికి ఒక వరం లాంటివి. అందుకే డైటీషియన్లు కూడా చియా విత్తనాలను తినమని చెబుతుంటారు. ఇన్ని పోషకాలు ఉన్నప్పటికీ.. చియా గింజలు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కలిగిస్తాయి. అందుకే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు వీటిని తినకుండా ఉండాలి. మరి ఎవరు చియా సీడ్స్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
కిడ్నీ సమస్యలు ఉన్న వారు:
కిడ్నీ రోగులు చియా సీడ్స్ అస్సలు తినకూడదు. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు చియా విత్తనాలను తినడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. చియా విత్తనాలలో అధిక మొత్తంలో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్ళు ఏర్పడటానికి కారణమవుతాయి. మీకు మూత్రపిండాల సమస్యలు లేదా మూత్రపిండాల్లో రాళ్లు ఉంటే.. మీరు చియా సీడ్స్ అస్సలు తినకూడదు.
డయాబెటిస్:
డయాబెటిస్ సమస్య ఉన్నవారు చియా సీడ్స్ తినకుండా పూర్తిగా దూరంగా ఉండాలి. చియా సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో పనిచేస్తాయి. డయాబెటిస్ మందులు తీసుకుంటుంటే మాత్రం చియా చియా సీడ్స్ అస్సలు తినకండి.
అలెర్జీ సమస్యలు :
కొంతమందికి చియా చియా సీడ్స్ అంటే అలెర్జీ కూడా ఉంటుంది. చియా సీడ్స్ తిన్న తర్వాత చర్మంపై దద్దుర్లు, వాపు, దురద లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైతే.. అలాంటి వ్యక్తులు చియా సీడ్స్ తినకూడదు. మీకు అలెర్జీలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
జీర్ణక్రియ:
ఎవరికైనా జీర్ణ సంబంధిత సమస్య లు ఉంటే అలాంటి వారు చియా సీడ్స్ తినకూడదు. చియా సీడ్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మీకు ఇప్పటికే జీర్ణ సమస్యలు ఉంటే.. అధిక ఫైబర్ తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు , మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. చియా విత్తనాలను తీసుకోవడం వల్ల మీ జీర్ణక్రియ మరింత దిగజారిపోతుంది.
మందుల వాడకం :
చియా సీడ్స్‌లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. శరీరంలో విటమిన్ కె అధికంగా ఉండటం వల్ల రక్తం చిక్కగా మారుతుంది. మీరు ఇప్పటికే రక్తం పలుచబడేలా చేసే మందులు తీసుకుంటుంటే.. మాత్రం చియా సీడ్స్ తీసుకునే ముందు మీ డాక్టర్‌ను సంప్రదించాలి.
Also Read: డ్రై ఐ సిండ్రోమ్‌తో.. ఇబ్బంది పడుతున్నారా ?
గర్భిణీలు:
గర్భిణీలు చియా సీడ్స్ అస్సలు తినకూడదు.
మీరు గర్భవతి అయితే లేదా తల్లిపాలు ఇస్తున్నట్లయితే.. ఈ సమయంలో చియా సీడ్స్ కు దూరంగా ఉండటం చాలా మంచిది. గర్భధారణ సమయంలో వాంతులు , వికారం సాధారణ సమస్యలు వస్తాయి. ఇలాంటి సమయంలో మీరు చియా విత్తనాలను తీసుకుంటే.. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల గర్భధారణలో సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే చియా సీడ్స్ తినే ముందు ఖచ్చితంగా డాక్టర్ ను సంప్రదించాలి.