AP Weather Update: ఏపీలో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది, కొన్ని ప్రాంతాల్లో ఎండలు కాగా, మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర తమిళనాడు, నైరుతి బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
బంగాళఖాతం, అరేబియా సముద్రం వైపు నుండి తేమగాలులు వీస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖవారు హెచ్చరిస్తున్నారు. బుధవారం అనకాపల్లి(D) మాడుగుల 39.4°C, వైఎస్సార్(D) దువ్వూరులో 38.9°C, నంద్యాల జిల్లా కొత్తపల్లిలో 38.7°C, ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో 38.6°C, పల్నాడు జిల్లా అమరావతి, పార్వతీపురంమన్యం జియ్యమ్మవలసలో 38.3°C, అన్నమయ్య జిల్లా వతలూరులో 38.2°C, గుంటూరు జిల్లా తాడేపల్లి, విజయనగరం జిల్లా నెలివాడ 38.1°C అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అలాగే గురువారం అల్లూరిసీతారామరాజు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి జిల్లాల్లో వడగాలులు ప్రభావం, పిడుగులతో కూడిన వర్షం కూరిసేందుకు అవకాశం ఉంది.
Also Read: రజినికి చుక్కెదురు.. ఇక జైలుకేనా?
మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి, ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటకు రావాలని, లేదంటే ఇంట్లోనే ఉండాలని చేప్తున్నారు. వేడిగాలి నుండి తల, చెవులను కాపాడుకోవాలి. అలాగే శరీరం డీహ్రైడేట్ కాకుండా ఉండటానికి ORS, ఇంట్లో తయారుచేసిన పానీయీలు త్రాగాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.