Writer Thota Prasad : తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక సినిమాకు అనుకున్న స్టోరీని కొన్ని కారణాలతో మార్చి మరో సినిమా చేస్తారు. అయితే స్టోరీ నచ్చితే కొన్ని సినిమాలు హిట్ అవుతాయి. మరి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అనే సందేహం రావడం కామన్. అందుకు ఒక కారణం ఉంది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించిన శక్తి సినిమా అందరికి తెలిసే ఉంటుంది.. ఈ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. కానీ కొన్ని మైనస్ ల వల్ల మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. కానీ థియేటర్లలోకి వచ్చాక మాత్రం నిరాశపరిచింది. అయితే ఈ మూవీ ప్లాప్ అవ్వడానికి కారణం ఏంటో రైటర్ తోటా ప్రసాద్ బయట పెట్టారు.. ఆయన ఏమన్నారో ఒకసారి తెలుసుకుందాం..
రైటర్ తోటా ప్రసాద్..
తెలుగు సినిమా పరిశ్రమలో గోస్ట్ రైటర్ గా, రైటర్ గా డైలాగ్ రైటర్ గా ఇలా పలు సినిమాలకు తన రచన సహకారం అందించిన వ్యక్తి తోట ప్రసాద్.. ఈయనకు మంచి గుర్తింపు ఉంది. మొదట సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆపైన అక్కడి వాతావరణం నచ్చక సినిమా పరిశ్రమకు అనుబంధంగా ఉంటున్న ప్రింట్ మీడియా కోసం చాలా ఏళ్ళు పనిచేసి ఆపైన ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ తో కూడా పనిచేసారు. ఆ తర్వాత టాలీవుడ్ లోని స్టార్ డైరెక్టర్స్ అయిన గుణశేఖర్, పూరి జగన్నాథ్, మెహర్ రమేష్ వంటి డైరెక్టర్స్ తో కలిసి పనిచేసారు. తాజాగా ఆయన యూట్యూబ్ ఛానెల్స్ కీ ఇచ్చిన ఇంటర్వ్యూ లో శక్తి మూవీ గురించి సంచలన విషయాలను బయట పెట్టారు.
Also Read : ‘ఇంటింటి రామాయణం’ అవని ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?
ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ నటించిన శక్తి మూవీ గురించి సంచలన నిజాలను బయటపెట్టారు. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన మగధీర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమాను చూసి అశ్విని దత్ శక్తి సినిమాను తీయాలనుకున్నారు. ఇది కథలో కొన్ని మార్పులు జరగడంతో ఆ మూవీ రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిందని ఆయన అన్నారు.. ఈ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ పులిని చూసి నక్క బాధ పెట్టుకోవడం అంటే ఇదే అంటూ ఎన్టీఆర్ పై ట్రోల్స్ చేస్తున్నారు. ఇక దీనిపై ఎన్టీఆర్ రియాక్ట్ అవుతారేమో చూడాలి..
ఎన్టీఆర్ సినిమాలు విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఓ సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. అటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నాడు. తర్వాత సుకుమార్ కాంబోలో మరో మూవీ చెయ్యనున్నాడు. బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న సినిమాకు పెద్ద అనే టైటిల్ని ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లోకి రాబోతుంది.