E-Paper
Advertisement

Bitter Gourd Juice For Diabetes: కాకరకాయ జ్యూస్‌తో షుగర్ కంట్రోల్.. మరెన్నో లాభాలు

Bitter Gourd Juice For Diabetes: కాకరకాయ జ్యూస్‌తో షుగర్ కంట్రోల్.. మరెన్నో లాభాలు

Bitter Gourd Juice For Diabetes: కాకర కాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాకరకాయ రుచిలో చేదుగా ఉంటుంది. కానీ అనేక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. షుగర్‌ని కంట్రోల్ చేయడంలో కాకరకాయ రసం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాకరకాయ జ్యూస్ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. అంతే కాకుండా రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది. కాకరకాయ రసం తాగడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు తరుచుగా కాకరకాయ రసాన్ని తాగవచ్చు. ఈ జ్యూస్‌ను ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. కాకరకాయ రసం తాగడం వల్ల కలిగే లాభాలు, దానిని తయారు చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కాకరకాయ రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..

షుగర్ తగ్గుతుంది: కాకర కాయ రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉండే చరాన్టిన్ సమ్మేళనం రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. దీనితో పాటు, కాకర కాయ రసం ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఫలితంగా శరీరంలోని అదనపు గ్లూకోజ్ తగ్గుతుంది.

జీర్ణవ్యవస్థ: కాకర కాయ రసం జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. కాకర కాయ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ సమస్యలు ఉన్నవారికి మేలు జరుగుతుంది. కాకర కాయ జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా మలబద్ధకం, అజీర్ణం , ఎసిడిటీ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

బరువు తగ్గుతుంది: అధిక బరువుతో ఇబ్బందిపడుతున్న వారు కాకర కాయ రసం తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది బరువు వేగంగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. కాకర కాయలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.

చర్మ సౌందర్యం: కాకర కాయ రసం చర్మ సౌందర్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మాన్ని డ్యామేడ్ కాకుండా కాపాడతాయి. అంతే కాకుండా కాకార కాయ జ్యూస్ తాగడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి.

కాకర కాయ రసం ఎలా తయారు చేయాలి ?

కావలసినవి:
కాకర కాయలు – 3
నీరు – తగినంత
నిమ్మరసం- రుచికి తగినంత
తేనె – 1 టేబుల్ స్పూన్

Also Read: గొంతు నొప్పిని ఈజీగా తగ్గించే డ్రింక్స్ ఇవే..

తయారుచేసే విధానం:
కాకర కాయ రసాన్ని కేవలం 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. కాకరకాయ రసం తయారు చేయడానికి ముందుగా కాకర కాయలను రెండుసార్లు కడిగి శుభ్రం చేసుకోండి. చివర్లను కత్తిరించి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. గింజలు, లోపలి తెల్లటి భాగాన్ని తీసేయండి. ఇప్పుడు తరిగిన కాకర కాయ ముక్కలను మిక్సీలో వేసి అవసరాన్ని బట్టి నీళ్లు పోసి మిక్స్ చేసుకోవాలి. ఈ రసాన్ని ఒక గ్లాస్‌లో స్టయినర్ సహాయంతో వడపోసి, రుచికి తగినంత నిమ్మరసం, తేనె కలపండి. ఈ రెండూ చేదును తగ్గిస్తాయి. అంతే కాకరకాయ జ్యూస్ తయారైనట్టే.

గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

గుడ్డు తింటే జరిగే మ్యాజిక్ ఇదే.. కానీ ఆ ఒక్క తప్పు అస్సలు చేయొద్దు!

నెల రోజులు చాయ్‌కి ‘టాటా’ చెబితే.. మీ బాడీలో జరిగే వింతలు ఇవే!

ఐటీ ఉద్యోగుల కోసం.. అదిరిపోయే ఆఫీస్ డెస్క్ వర్కవుట్స్

నరాల బలహీనతకు బై-బై! నరాలను ఇనుములా మార్చే 5 సూపర్ ఫుడ్స్..

మీ మూడ్ బాలేదా? అయితే ఈ ఫుడ్స్ తినండి

నాన్-స్టిక్ పాన్లకు గుడ్‌బై చెప్పి.. ఈ 3 రకాల పాత్రలను వాడండి!

ఏసీ గదిలో ఉంటే చర్మం పొడిబారుతోందా? ఈ చిన్న చిట్కాతో మీ చర్మాన్ని కాపాడుకోండి

బతికినంత కాలం రోగాల్లేకుండా ఉండాలా?.. ఈ అలవాట్లను మార్చుకోండి!

Big Stories

×