BigTV English

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

Telugu States Dasara Holidays 2024: తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దసరా పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ తరుణంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా దసరా సెలవులను ప్రకటించాయి.


తెలంగాణలో దసరాతో పాటు బతుకమ్మ వేడుకలు ఉన్నందున ప్రభుత్వం ముందస్తుగానే అక్టోబర్ 2 నుంచే సెలవులను ప్రకటించింది. ఇందులో భాగంగానే అక్టోబరు 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో పాటు రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు వరుస సెలవులు రానున్నాయి. దాదాపు 13 రోజులు సెలవులు రానుండటంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, దసరా సెలవులు ముగిసిన తర్వాత తిరిగి అక్టోబర్ 15 వ తేదీ నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయని విద్యాశాఖ తెలిపింది.


అయితే, అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతితో సెలవులు మొదలు కానున్నాయి. ఆ తర్వాత బతుకమ్మ, దసరా పండుగలు వస్తుండడంతో వరుసగా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అక్టోబర్ 1వ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించాయి. అలాగే జూనియర్​ కాలేజీలకు ప్రభుత్వం అక్టోబర్​ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది.

Also Read: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు కీలక పరిణామం.. వారికి రెడ్‌ కార్నర్‌ నోటీసులు!

ఇదిలా ఉండగా, తెలంగాణలో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించడంతో ఏపీలోనూ సెలవులు ఎప్పటినుంచి ఇస్తారనే చర్చ నడిచింది. తాజాగా, ఏపీ ప్రభుత్వం కూడా దసరా సెలవులు ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. ఏపీ విద్యాశాఖ సెలవుల లిస్ట్‌ను విడుదల చేసింది. ఇందులో అక్టోబర్ 4వ తేదీ నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి.

ఈ సెలవులు అక్టోబర్ 13తో ముగియనున్నాయి. ఇక, అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉండగా.. అక్టోబర్ 3వ తేదీన వర్కింగ్ డేగా పరిగణించారు. ఇటీవల ఏపీలో వర్షాల ప్రభావంతో సెలవులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో సెలవులు తగ్గించే అవకాశం ఉందని సమాచారం.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×