BigTV English

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Jani Master.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న జానీ మాస్టర్ (Jani Master) పై లైంగిక ఆరోపణలు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించాయి. మైనర్ గా ఉన్నప్పటి నుంచే జూనియర్ మహిళా కొరియోగ్రాఫర్ పై కన్ను వేశాడని, ఆమెను లైంగికంగా హింసించి, మానసికంగా, శారీరకంగా చిత్రవధకు గురి చేశాడు అంటూ సదరు బాధిత యువతి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. 2017 నుంచే తనపై అత్యాచారానికి పాల్పడుతున్నాడని, ప్రస్తుతం తన వయసు 21 సంవత్సరాలు అంటూ చెప్పిన యువతి, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెట్టాడు అంటూ పోలీసుల ముందు చెప్పుకొచ్చింది. దీంతో పలు సెక్షన్ల కింద ఎఫ్ ఐ ఆర్ కేస్ ఫైల్ చేయడమే కాకుండా, పోక్సో చట్టం కింద కూడా జానీ మాస్టర్ పై కేసు ఫైల్ చేసి తాజాగా అరెస్టు చేశారు.


జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు..

అయితే జానీ మాస్టర్ చేసిన తప్పుకు కఠిన శిక్ష విధించాలి అని , అనసూయను మొదలుకొని, ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్, సింగర్ చిన్మయి తదితరులు బాధిత యువతికి అండగా నిలిచారు. అంతేకాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా జానీ మాస్టర్ కు వ్యతిరేకంగా బాధిత యువతకి తన సినిమాలో అవకాశం ఇస్తానని కూడా హామీ ఇచ్చారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి, అటు ఆడియన్స్ నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జానీ మాస్టర్ జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇలా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం, మరొకవైపు అరెస్టు చేయడంతో జానీ మాస్టర్ కు తాజాగా సెలబ్రిటీల నుండి మద్దతు పెరుగుతోంది.


జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు..

Jani Master : 'Master innocent' is getting increasing support day by day... How many people have supported...?
Jani Master : ‘Master innocent’ is getting increasing support day by day… How many people have supported…?

ఇటీవల స్వర్ణ మాస్టర్.. జానీ మాస్టర్ గురించి తెలియకపోయినా సరే ఆయనకు అండగా నిలిచింది. మైనర్ గా ఉన్నప్పటి నుండే అత్యాచారం చేస్తున్నాడని చెబుతోంది కదా.. అప్పుడు ఎందుకు మీడియాతో చెప్పలేదు..పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు.. ఆయన నుంచి ఏదైనా ఆశించి ఉండవచ్చు.. లేదా ఆయనకు నేషనల్ స్థాయి గుర్తింపు లభించడంతో జీర్ణించుకోలేక ఎవరైనా ఈమెతో ఇలా చేయిస్తున్నారేమో అంటూ జానీ మాస్టర్ కు అండగా నిలిచింది స్వర్ణ మాస్టర్. ఇక స్వర్ణ మాస్టర్ తో పాటు పలువురు సెలబ్రిటీలకు కూడా మద్దతు పలుకుతున్నారు. జానీ మాస్టర్ అమాయకుడని ఆయన అలాంటివాడు కాదు అంటూ సపోర్ట్ చేస్తున్నారు.

దిగ్గజ నిర్మాతలు కూడా సపోర్ట్..

నిన్నటికి నిన్న నాగబాబు కూడా నిజం నిరూపణ అయ్యే వరకు ఎవరిని నిందితుడిగా చేర్చకూడదు అంటూ ఇన్ డైరెక్ట్ పోస్ట్ చేసిన విషయం తెలిసింది. అలాగే ఆట సందీప్ మాస్టర్ భార్య, ప్రముఖ మహిళా కొరియోగ్రాఫర్ జ్యోతి రాజ్ కూడా జానీ మాస్టర్ కి అండగా నిలిచింది.. అబ్బాయిలు ఎవరైనా ఆడపిల్లల్ని ఏడిపిస్తే వాళ్లతో తప్పుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా శిక్షించాలి. చట్టం దృష్టిలో అందరూ సమానమే కానీ కొన్ని చట్టాలను ఉపయోగించుకొని కొంతమంది అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ గా ప్రవర్తిస్తూ.. లైఫ్ లో బాగా కష్టపడి ఎదిగిన అబ్బాయిల కెరియర్ ను దెబ్బ కొట్టడానికి చూస్తున్నారు. అలాంటి వాళ్ళను శిక్షించాలి అని కూడా తెలిపింది.

ఆవేదన వ్యక్తం చేస్తున్న జానీ మాస్టర్ భార్య..

అంతేకాదు రీసెంట్ గా రాము అనే డాన్స్ మాస్టర్ తో పాటు సీనియర్ నిర్మాత సీ. కళ్యాణ్ కూడా జానీ మాస్టర్ కు మద్దతు పలికారు. ఆయన అలాంటి వ్యక్తి కాదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక జానీ మాస్టర్ భార్య అయితే ఇన్నాళ్ల పాటు సైలెంట్ గా ఉన్న ఈమె.. తాజాగా తన భర్త పై పోక్సో కేసు పెట్టడంతో.. ఒక మైనర్ పై దాడి చేసినట్టు పోక్సో కేస్ కూడా పెట్టారు కదా.. ఇదే నిజమైతే నా భర్తను వదిలేస్తా అంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఎవరైనా కావాలని చేస్తున్నారా లేక నిజం ఇదేనా అనే విషయం తెలియాలి అంటే నిజా నిజాలు బయటకి రావాలని నెటిజన్స్ కూడా కోరుతున్నారు. మొత్తానికైతే చాలామంది సెలబ్రిటీలు జానీ మాస్టర్ అలాంటివాడు కాదని ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×