E-Paper
Advertisement

కాకరకాయ గింజలను పారేస్తున్నారా? ఈ హెల్త్ సీక్రెట్స్ తెలిస్తే కళ్లకు అద్దుకుని తింటారు!

కాకరకాయ గింజలను పారేస్తున్నారా? ఈ హెల్త్ సీక్రెట్స్ తెలిస్తే కళ్లకు అద్దుకుని తింటారు!
Advertisement

Bitter Gourd Seeds Benefits: సాధారణంగా ఇంట్లో కాకరకాయ కూర వండేటప్పుడు చాలామంది లోపల ఉన్న గింజలను తీసి పారేస్తుంటారు. అవి చేదుగా ఉంటాయనో, లేదంటే కడుపులో అరగవనో అనుకుంటారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే.. లేత కాకర గింజల్లో బోలెడన్ని పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా లేతగా, తెల్లగా ఉండే గింజలు తింటే అరుగుదల బాగుంటుంది. పైగా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

ఎలాంటి గింజలు తినాలంటే?

కాకరకాయ గింజలు తినేటప్పుడు ఒక చిన్న విషయం గమనించాలి. కాయ లేతగా ఉన్నప్పుడు లోపల ఉండే గింజలు మెత్తగా, తెల్లగా ఉంటాయి. వీటిని వంటల్లో వాడుకోవచ్చు, ఇవి కూరలో కలిసిపోవడతో.. చక్కగా అరిగిపోతాయి కూడా. కానీ కాయ ముదిరిపోయినప్పుడు గింజలు గట్టిగా, ఎర్రగా మారిపోతాయి. అలాంటి వాటిని మాత్రం తీసి పక్కన పెట్టేయడమే మంచిది. ఎందుకంటే.. అవి తింటే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు.

Advertisement

Also Read: రోజూ రుద్దే పని లేకుండా.. బాత్రూమ్ టైల్స్ మెరిసిపోవాలంటే ఇలా ట్రై చేయండి!

బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్‌కు:

ఈ గింజల్లో పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమై, మనకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. అంతేకాదు.. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి కూడా ఈ గింజలు ఎంతగానో సహాయపడతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. మధుమేహం ఉన్నవాళ్లు వీటిని కూరలతో పాటు తింటే మంచిదే.

కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమే:

Advertisement

అమృతం అయినా ఎక్కువైతే చేదే కదా.. కాకర గింజలు మంచివని చెప్పి మరీ ఎక్కువగా తినేయకూడదు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లలు, అలాగే కడుపునొప్పి లేదా గ్యాస్ సమస్యలతో ఇబ్బందిపడేవారు వీటిని కాస్త చూసి చూడనట్టు పరిమితంగానే తీసుకోవాలి. మొదటిసారి ట్రై చేసేవాళ్లు కొద్దిగా తిని చూడండి.. మీ శరీరానికి పడుతుందో లేదో గమనించండి. ఏదేమైనా, పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రం డాక్టర్ సలహా తీసుకోవడమే అన్నిటికంటే బెస్ట్.

Also Read: బర్నర్ రంధ్రాలు మూసుకుపోయాయా? మెకానిక్ అవసరం లేదు.. ఈ చిన్న ట్రిక్ చాలు!

 

Related News

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

Big Stories

Advertisement
×