E-Paper
Advertisement

Black Cherry Tomato: నల్ల టమాటోలతో అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు!

Black Cherry Tomato: నల్ల టమాటోలతో అద్భుత ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు!
Advertisement

Black Cherry Tomato: బ్లాక్ చెర్రీ టమాటోలు సాధారణ టమాటోలతో పోలిస్తే కొంచెం ప్రత్యేకంగా కనిపించే టమాటోలు. నలుపు రంగులో ఉండి తియ్యగా, రుచిగా ఉంటాయి. ఇటీవల ఆరోగ్యంపై దృష్టి పెట్టే వాళ్లు వీటిని ఎక్కువగా ఆహారంలో చేర్చుకుంటున్నారు. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండటంతో శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి. బ్లాక్ చెర్రీ టమాటోల వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లాక్ చెర్రీ టమాటోల ఆరోగ్య ప్రయోజనాలు:
1. శరీరానికి అవసరమైన పోషకాలు:
బ్లాక్ చెర్రీ టమాటోలలో విటమిన్ A, C, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతే కాకుండా వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.

Advertisement

2. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు:
ఈ టమాటోల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి కణాలను రక్షించడంలో సహాయ పడతాయి. దీంతో అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.

3. గుండె ఆరోగ్యానికి మంచివి:
బ్లాక్ చెర్రీ టమాటోలలో ఉండే పొటాషియం, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయ పడతాయి. అంతే కాకుండా ఇవి రక్తపోటు నియంత్రణలో కూడా ఉపయోగపడతాయి.

Advertisement

4. చర్మం మెరుగు పడుతుంది:
ఈ టమాటోలలో ఉన్న విటమిన్ C , యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం కాంతివంతంగా కనిపించేందుకు కూడా ఇవి సహాయ పడతాయి. అంతే కాకుండా చర్మం మెరుస్తే ఉండటానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

5. జీర్ణక్రియకు సహాయపడతాయి:
బ్లాక్ చెర్రీ టమాటోలలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరచి పొట్ట సంబంధిత సమస్యలు తగ్గించడంలో సహాయ పడుతుంది.

6. బరువు తగ్గడంలో సహాయపడతాయి:
ఈ టమాటో లలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందుకే బరువు తగ్గాలని అనుకునే వాళ్లు తమ ఆహారంలో వీటిని సులభంగా చేర్చుకోవచ్చు.

7. కంటి ఆరోగ్యానికి మంచివి:
బ్లాక్ చెర్రీ టమాటోలలో విటమిన్ A ఉంటుంది. ఇది కంటి చూపు మెరుగు పరచడంలో అంతే కాకుండా కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయ పడుతుంది.

Also Read: వంటకు సన్‌ఫ్లవర్ ఆయిల్ ఎందుకు మంచిది? తెలిస్తే షాక్ అవడం గ్యారంటీ

8. రోగనిరోధక శక్తిని పెంచుతాయి:
ఈ టమాటోలలో ఉన్న విటమిన్ C శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. తరచూ వీటిని ఆహారంలో బాగంగా చేసుకోవడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.

9. రక్తప్రసరణ మెరుగుపరుస్తాయి:
బ్లాక్ చెర్రీ టమాటోస్ రక్తప్రసరణను మెరుగు పరచడంలో సహాయ పడతాయి. ఇది శరీరంలోని అవయవాలకు సరైన ఆక్సిజన్ , పోషకాలు చేరేందుకు సహాయ పడుతుంది.

10. సలాడ్లు, వంటకాల్లో రుచిని పెంచుతాయి:
బ్లాక్ చెర్రీ టమాటోలను సలాడ్లు, పాస్తా, సూప్‌లు వంటి వంటకాలలో ఉపయోగిస్తే రుచి మరింత పెరుగుతుంది. అలాగే ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి.

Related News

ఇంటి ఖర్చులకు నెలజీతం సరిపోవడం లేదా? అదనపు ఆదాయం ఇలా సంపాదించండి

భోజనం చేసినా, ఏదైనా తాగినా వెంటనే లిప్‌స్టిక్ పాడవుతోందా? రోజంతా పెదాలు కలర్‌ఫుల్‌గా ఉండేందుకు చిట్కాలు

ప్రతిరోజూ హెల్మెట్ ధరిస్తే జుట్టు డ్యామేజ్.. ఈ సులభమైన హెయిర్ కేర్ చిట్కాలు మీ కోసం

పాము, ముంగీస లాంటి స్వభావం వీరిది.. ఈ తేదీల్లో పుట్టినవారు పెళ్లి తరువాత గొడవపడుతూనే ఉంటారు

మద్యం లేదా సిగరెట్.. ఆరోగ్యానికి ఏది ఎక్కువ ప్రమాదకరం.. ఏది ముందుగా మానేయాలి?

ఉద్యోగం చేసే భార్యభర్తల మధ్య ఒత్తిడి, గొడవలు.. దాంపత్య జీవితం కాపాడుకోవడానికి ఇలా చేయడం తప్పనిసరి

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

రోగాలు మాయం.. వర్షాకాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయలు

Big Stories

Advertisement
×