E-Paper
Advertisement

Budget Smart TVs: రూ.40వేల లోపు 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలు.. ఏఐ ఫీచర్లు వేరే లెవల్!

Budget Smart TVs: రూ.40వేల లోపు 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలు.. ఏఐ ఫీచర్లు వేరే లెవల్!
Advertisement

Budget Smart TVs: బడ్జెట్ ధరలో అదిరిపోయే ఏఐ ఫీచర్లు, సూపర్ పిక్చర్ క్వాలిటీ ఉండే టీవీ కొందామని చూస్తున్నారా? నిజానికి మధ్యతరగతి కుటుంబాలకు బిగ్ స్క్రీన్ టీవీ కొనడం అంటే ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ ఇప్పుడు ఆ టెన్షన్ అక్కర్లేదు. రూ.40 వేల లోపు కూడా ఇంటిని సినిమా హాల్‌లా మార్చేసే 4K ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలు బోలెడు ఉన్నాయి. మన లివింగ్ రూమ్‌ను మినీ థియేటర్లా మార్చేసే కొన్ని బెస్ట్ ఆండ్రాయిడ్ టీవీల గురించి ఇప్పుడు ముచ్చటించుకుందాం.

షావోమీ స్మార్ట్ టీవీ ఎక్స్ సిరీస్

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కావాలంటే షావోమీ తర్వాతే ఏదైనా. ఈ ఎక్స్ సిరీస్ టీవీలో 4K రిజల్యూషన్, డాల్బీ విజన్ ఉండటం వల్ల కలర్స్ కళ్లకు అద్దినట్టు చాలా నేచురల్‌గా కనిపిస్తాయి. ఈ టీవీ చుట్టూ అస్సలు బెజెల్స్ ఉండవు కాబట్టి.. టీవీ చూస్తున్నంత సేపు మంచి లగ్జరీ ఫీలింగ్ వస్తుంది. ఇందులో గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్ ఉండటం వలన వాడుకోవడం కూడా చాలా ఈజీ.

వన్‌ప్లస్ టీవీ యూ1ఎస్

Advertisement

వన్‌ప్లస్ అంటేనే బ్రాండ్. పైగా క్వాలిటీ విషయంలో అస్సలు తగ్గదు. ఈ టీవీలో ఉండే సినిమాటిక్ డిస్‌ప్లే ప్రతి సీన్‌ను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా చీకటిగా ఉండే సీన్లలో కూడా చిన్న చిన్న పిక్చర్స్ క్లియర్‌గా కనిపించేలా డైనమిక్ కాంట్రాస్ట్ ఫీచర్ హెల్ప్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే.. వన్‌ప్లస్ కనెక్ట్ యాప్ ఉంటే ఫోన్‌తోనే మొత్తం టీవీని కంట్రోల్ చేసేయొచ్చు.

Also Read: వావ్.. ఈ కూలర్ ఉంటే ఏసీతో పనే ఉండదట, అంత చల్లదనం ఎలా?

శాంసంగ్ క్రిస్టల్ 4కే నియో

Advertisement

నమ్మకానికి మారుపేరు శాంసంగ్ అని అందరికీ తెలిసిందే. ఈ క్రిస్టల్ 4కే సిరీస్ టీవీలు రంగులను చాలా అద్భుతంగా చూపిస్తాయి. దీనిలో ప్యూర్ కలర్ టెక్నాలజీ ఉండటం వల్ల మనం ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు అది మన కళ్లముందే నిజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక సౌండ్ విషయానికి వస్తే.. డాల్బీ డిజిటల్ ప్లస్ వల్ల థియేటర్లో మాదిరిగానే ఆడియో చుట్టూ ప్రతిధ్వనిస్తుంది. గేమ్స్ ఎక్కువగా ఆడేవారికి ఈ టీవీ బెస్ట్ ఆప్షన్.

ఏసర్ ఐ సిరీస్ ఆండ్రాయిడ్ టీవీ

తక్కువ రేటులో ఎక్కువ ఫీచర్లు ఉండాలని కోరుకునే వారికి ఏసర్ టీవీ సెట్ అవుతుంది. దీనిలో 30 వాట్ల పవర్‌ఫుల్ స్పీకర్లు ఉండటం వలన ఆడియో అదిరిపోతుంది. ఇది ఆండ్రాయిడ్ ఓఎస్‌తో వస్తుంది కాబట్టి.. మనకు కావాల్సిన యాప్స్‌ను ఈజీగా వాడుకోవచ్చు. బ్రైట్‌నెస్ కూడా చాలా బాగుంటుంది. పగటిపూట వెలుతురులో చూసినా పిక్చర్ క్లారిటీగా కనిపిస్తుంది.

రియల్‌మీ స్మార్ట్ టీవీ 4కే

రియల్‌మీ టీవీలు ఈ మధ్యకాలంలో యూత్‌ను బాగా ఆకర్షిస్తున్నాయి. దీనిలోని క్రోమ్ బూస్ట్ పిక్చర్ ఇంజిన్ వల్ల విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా, షార్ప్‌గా ఉంటాయి. వాయిస్ సెర్చ్ ఫీచర్ ఇందులో చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుంది. అంతేకాదు, రిమోట్‌లో బటన్లు నొక్కే అవసరం లేకుండానే.. జస్ట్ వాయిస్ ద్వారానే నచ్చిన సినిమాలు చూసే వెసులుబాటు కూడా ఉంది.

Also Read: భారీ డిస్కౌంట్‌తో షావోమీ 75 ఇంచుల టీవీ లాంచ్.. 4 ఏళ్ల వారంటీ ఉచితం!

Related News

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

రూ.లక్షలు పెట్టి ఏఐ ఫోన్ కొనాలా? లేక సాధారణ ఫోనే బెటరా? రెండింటికీ తేడా ఇదే!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

Big Stories

Advertisement
×