Sunflower Oil Benefits: సన్‌ఫ్లవర్ ఆయిల్ అంటే పొద్దుతిరుగుడు గింజల నుంచి తయారయ్యే ఆరోగ్యకరమైన నూనె. ఇది తేలికగా జీర్ణమయ్యే గుణం కలిగి ఉండటంతో.. పాటు శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది. ముఖ్యంగా విటమిన్ E, మంచి కొవ్వులు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. అంతే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కాపాడటం నుంచి చర్మం మెరుగు పడే వరకు ఎన్నో ప్రయోజనాలు ఇది అందిస్తుంది. అందుకే చాలా కుటుంబాల్లో రోజువారీ వంటలో సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు సన్‌ఫ్లవర్ ఆయిల్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వంటకు సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు:
1.గుండె ఆరోగ్యానికి మంచిది:
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఉన్న అసంతృప్త కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి సహాయప డతాయి. అంతే కాకుండా దీంతో గుండె జబ్బుల ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.
2. విటమిన్ E సమృద్ధిగా ఉంటుంది:
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో విటమిన్ E ఎక్కువగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి శరీరంలోని కణాలను రక్షిస్తుంది. అలాగే చర్మం ,జుట్టు ఆరోగ్యానికి కూడా సహాయ పడుతుంది.
3. తేలికగా జీర్ణమవుతుంది:
కొంత మందికి ఇతర వంట నూనెలతో పోలిస్తే సన్‌ఫ్లవర్ ఆయిల్ తేలికగా జీర్ణమవుతుంది. అందువల్ల వంటలో ఉపయోగించినప్పుడు పొట్టపై భారం పడకుండా జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.
4. శరీరానికి శక్తిని అందిస్తుంది:
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఉన్న ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రోజు వారీ పనుల్లో ఉత్సాహంగా ఉండటానికి ఇది సహాయ పడుతుంది.
5. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:
ఈ నూనెలో ఉండే పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో చిన్నచిన్న ఇన్ఫెక్షన్లు అంతే కాకుండా జబ్బుల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.
6. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లోని విటమిన్ E , ఫ్యాటీ ఆమ్లాలు చర్మాన్ని మృదువుగా అంతే కాకుండా కాంతివంతంగా ఉంచడంలో సహాయ పడతాయి. అలాగే చర్మం పొడిబారకుండా కాపాడుతాయి.
7. మెదడు పనితీరు:
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఉన్న కొవ్వు ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి సహాయ పడతాయి. ఇవి మెదడు కణాల పని తీరును మెరుగు పరచి జ్ఞాపక శక్తిని పెంచడంలో ఉపయోగపడతాయి.
Also Read: బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే వేసవి కాలం మీకు ఒక వరమే.. ఎందుకో తెలుసా?
8. బరువు నియంత్రణ:
సరైన పరిమితిలో సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉపయోగించడం వల్ల శరీరంలో కొవ్వు నిల్వలు అధికంగా పెరగకుండా నియంత్రించవచ్చు. బరువు నియంత్రణలో కూడా ఇది ఎంతగానో సహాయ పడుతుంది.
9. వంటకు అనుకూలమైన నూనె:
సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు మంచి స్మోక్ పాయింట్ ఉంటుంది. అందుకే దీన్ని వేయింపు, వేపుడ్ల కోసం సులభంగా ఉపయోగించవచ్చు. ఇది ఆహారం రుచిని కూడా మెరుగు పరుస్తుంది.
10. హార్మోన్ సమతుల్యత:
సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో ఉండే అవసరమైన కొవ్వు ఆమ్లాలు శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడటానికి సహాయ పడతాయి. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.