BigTV English

White Hair: చిటికెడు కాఫీ పొడితో.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది !

White Hair: చిటికెడు కాఫీ పొడితో..  క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది !

White Hair: ఈ రోజుల్లో.. జుట్టు సమస్యలు వృద్ధుల కంటే యువతలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అనేక మంది యువత ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యను ఎదుర్కుంటున్నారు. అయితే దీని నుండి బయటపడటానికి ఖరీదైన హెయిర్ కలర్స్ వాడుతుంటారు. మరికొంత మంది హోం రెమెడీస్ కూడా ట్రై చేస్తుంటారు. ఈ సమస్య కారణంగా.. చాలా మంది యువత తమ పనిని విడిచిపెట్టి మరీ డబ్బు , సమయాన్ని వృధా చేసుకోవలసి వస్తోంది. ఎందుకంటే తెల్ల జుట్టు మన ఆత్మవిశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంది.


ఇలాంటి సమయంలోనే తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి ఒక హోం రెమెడీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది తెల్ల జుట్టును తక్కువ సమయంలోనే నల్లగా మారుస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న హోం రెమెడీని ఎలా తయారు చేసుకుని వాడాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కాఫీ పౌడర్:
మీరందరూ కాఫీ పౌడర్ గురించి వినే ఉంటారు. మన ఆరోగ్యంతో పాటు.. కాఫీ పౌడర్ కూడా మన జుట్టుకు ఒక వరంలాగా పనిచేస్తుంది. అవును, కాఫీ పౌడర్ జుట్టుకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జుట్టును నల్లగా మార్చుకోవడానికి కాఫీ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది. కాఫీ పౌడర్ తో తయారు చేసిన హోం రెమెడీస్ వాడటం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా దీనిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రాకుండా ఉంటాయి.


ఇలా వాడండి:
కాఫీ పౌడర్ తో మీ జుట్టును నల్లగా చేసుకోవాలంటే.. మీరు దాదాపు 2 టీ స్పూన్ల కాఫీ పౌడర్ తీసుకోవాలి. తర్వాత దీనిని ఒక చిన్న కప్పు నీరు వేసి అందులో కలిపి మరిగించాలి. తర్వాత ఇందులోనే 5-6 చెంచాల టీ పౌడర్ కూడా వేసి వేడి చేయండి. సరిగ్గా మరిగిన తర్వాత, దీనిని గది చల్లారనివ్వండి. తర్వాత దీనిని జుట్టుకు అప్లై చేయండి. ఇందులో కాస్త హెన్నా కలిపి వాడినా కూడా మంచి ఫలితం ఉంటుంది. దాదాపు అరగంట పాటు అలాగే ఉంచి తరువాత, చల్లటి నీటితో జుట్టును శుభ్రం చేసుకోండి. మీరు ఈ హోం రెమెడీ వాడిన తర్వాత ఎలాంటి షాంపూను ఉపయోగించాల్సిన అవసరం లేదు. దీన్ని వారానికి 3 నుండి 4 సార్లు ఉపయోగించడం వల్ల తొందరగానే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

Also Read: సమ్మర్‌లో తరచుగా ముఖం నల్లబడుతోందా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే !

బ్లాక్ టీ , కాఫీతో మీ జుట్టును నల్లగా చేసుకోండి:

బ్లాక్ టీ, కాఫీ:
దీనితో పాటు, బ్లాక్ టీ , కాఫీ పేస్ట్ తయారు చేసుకుని వాడటం ద్వారా మీరు మీ జుట్టును సహజంగానే నల్లగా మార్చుకోవచ్చు. దీని కోసం.. మీరు ఒక పాన్‌లో నీరు , టీ ఆకులను వేసి బాగా మరిగించాలి. దీని తర్వాత అందులో కాఫీ పొడి కలపండి. ఇప్పుడు దానిని 5 నిమిషాలు మరిగించాలి. అనంతరం చల్లారిన తర్వాత, మిశ్రమాన్ని వడకట్టి జుట్టుకు అప్లై చేయండి. దీన్ని జుట్టు మీద 30 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై శుభ్రమైన, చల్లటి నీటితో జుట్టును వాష్ చేయండి. తలస్నానం చేసేటప్పుడు షాంపూ లేదా కండిషనర్ అస్సలు ఉపయోగించకండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×