BigTV English

Summer Tan Removal: సమ్మర్‌లో తరచుగా ముఖం నల్లబడుతోందా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే !

Summer Tan Removal: సమ్మర్‌లో తరచుగా ముఖం నల్లబడుతోందా ? అయితే ఈ టిప్స్  మీ కోసమే !

Summer Tan Removal: సమ్మర్ వచ్చిందంటే చాలు వివిధ రకాల సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చర్మం ఈ సమయంలో ఎక్కువగా ప్రభావితం అవుతుంది. ఎండ, చెమట, ఇతర కారణాలు చర్మాన్ని నిర్జీవంగా మారుస్తాయి. అంతే కాకుండా బలమైన సూర్య కిరణాల వల్ల సమ్మర్ లో ముఖంపై ట్యాన్ పెరుగుతుంది. ఫలితంగా చర్మం నిర్జీవంగా, నల్లగా కనిపిస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మనం సమ్మర్‌లో కొన్ని రకాల టిప్స్ తప్పకుండా పాటించాలి.


చాలా మంది ఉదయం పూట మాత్రమే సన్ స్కీన్ వాడతుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం పూర్తిగా రక్షించబడుతుందని అనుకుంటారు, కానీ ముఖం అందంగా ఉండాలన్నా అంతే కాకుండా ట్యాన్ పెరగకూడదన్నా రాత్రి పూట స్కిన్ కేర్ తప్పకుండా పాటించాలి. ఎందుకంటే రాత్రి సమయంలో మాత్రమే చర్మం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. మరి ఇక నుండి అయినా సమ్మర్‌లో గ్లోయింగ్ స్కిన్, ట్యాన్ రిమూవల్ కోసం రాత్రి పూట  స్కిన్ కేర్ టిప్స్ పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్లెన్సర్ వాడకం:
ముఖం కాంతివంతంగా మారాలంటే.. మొదటగా చేయాల్సింది ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు మీ ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడం. పగటి పూట చెమట, కాలుష్యం, ఫేస్ ఆయిల్స్, మేకప్ కారణంగా ముఖ రంధ్రాలు మూసుకుపోతాయి. వీటి వల్ల మొటిమలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మీరు నీరసంగా కూడా కనిపిస్తారు.


టోనర్ వాడకం:
ముఖం శుభ్రం చేసుకున్న తర్వాత టోనర్ తప్పకుండా ఉపయోగించాలి. ఇది చర్మం యొక్క Ph స్థాయిని సమతుల్యం చేస్తుంది. అంతే కాకుండా ముఖం రంధ్రాలను కూడా బిగుతుగా మారుస్తుంది. రోజ్ వాటర్, కలబందతో తయారు చేసిన టోనర్ ముఖానికి అప్లై చేయడం ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.

అలోవెరా జెల్, లేదా నైట్ సీరం:
రాత్రి పూట చర్మాన్ని లోతుగా పోషించడానికి అలోవెరా జెల్ లేదా ఏదైనా విటమిన్ సి ఉన్న నైట్ సీరం ఉపయోగించండి. ఇవి చర్మాన్ని రిపేర్ చేస్తాయి. అంతే కాకుండా మచ్చలను కూడా రాకుండా చేస్తాయి. చర్మం జిడ్డుగా ఉండే వీటిని రాత్రి పూట వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మాయిశ్చరైజర్:
రాత్రి పూట ముఖానికి మాయిశ్చరైజర్ వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. అంతే కాకుండా ట్యాన్ ను పూర్తిగా తొలగిస్తుంది. చర్మం జిడ్డుగా ఉంటే జెల్ ఆధారిత సీరం , పొడిగా ఉంటే క్రీమ్ ఆధారిత సీరం ఎంచుకోండి.

బ్యూటీ స్లీప్:
ఎంత ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించినా కూడా మీరు తగినంత నిద్రపోకపోతే..మీ చర్మం ఆరోగ్యంగా కనిపించదు.రాత్రి 6-8 గంటల నిద్ర చర్మాన్ని రిపేర్ చేస్తుంది. అంతే కాకుండా కళ్ల క్రింద డార్క్ సర్కిల్స్ రాకుండా చేస్తుంది. సహజంగా అందంగా కనిపించాలంటే తగినంత నిద్ర చాలా ముఖ్యం.

Also Read: రాత్రిపూట శుభ్రం చేయకుండా .. పాత్రలను సింక్‌లో వదిలేస్తున్నారా ? అయితే రోగాలు కొని తెచ్చుకున్నట్లే !

హోం రెమెడీస్:
శనగపిండి, పెరుగు, పసుపులతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చర్మం ఎక్స్ ఫోలియేట్ అవుతుంది. అంతే కాకుండా ఇది ట్యాన్ ను తొలగిస్తుంది.
నిమ్మకాయ, తేనెతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ వాడటం వల్ల ముఖంపై మురికి తొలగిపోతుంది. అంతే కాకుండా ఇది చర్మాన్ని తెల్లగా మారుస్తుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×