Mehreen Pirzada:ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada)తొలిసారి నాని (Nani ) హీరోగా నటించిన ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఇక మొదటి సినిమాతోనే మంచి రెస్పాన్స్ లభించడంతో ఈమెకు తెలుగులో క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అలా వరుసగా సందీప్ కిషన్, విజయ్ దేవరకొండ, సాయి ధరంతేజ్, శర్వానంద్, గోపీచంద్, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్ వంటి వారితో అవకాశాలు అందుకొని నటించింది. ఇక చివరిగా ‘స్పార్క్’ సినిమాలో కనిపించింది.. గత రెండేళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నప్పటికీ కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా మారింది ఈ ముద్దుగుమ్మ.
మన ప్రయాణం అక్కడ నుండే మొదలైంది – మెహ్రీన్
ఈ క్రమంలోనే తాజాగా ఇంస్టాగ్రామ్ ద్వారా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్టులో.. “సెగల్ ఈ పెయింటింగ్ వేశారు. ఇక్కడ నుంచే మా ప్రయాణం మొదలైంది. మమ్మల్ని ఆకృతి చేసిన క్షణాల నుండి పుట్టింది. ప్రతి బ్రష్ స్ట్రోక్ ఒక కథను చెబుతుంది. మనం ఇక్కడికి ఎలా చేరుకున్నామని.. ప్రతి మలుపు, ప్రతి నిశ్శబ్ద విజయం మనం కలలుగన్న జీవితానికి దగ్గర చేసింది. ఇది కళ కాదు.. ఇది మనం.. ఈ పెయింటింగ్ జీవించినా.. ప్రేమించనా.. కలిసి ఉన్నా.. ఎప్పటికీ ఉంటుంది” అనే క్యాప్షన్ ను జత చేసింది. అంతేకాదు ఇద్దరూ ఒకే కలర్ దుస్తులను ధరించిన ఫోటోలను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఇంకొంతమంది అతనెవరో తెలియకపోయినా పలు రకాలుగా చర్చించుకుంటూ ఉండడం గమనార్హం . ముఖ్యంగా పెయింటింగ్ ద్వారా వీరిద్దరూ ఒకటయ్యారేమో అని, త్వరలోనే వివాహం చేసుకుంటారా అనే రేంజ్ లో కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే మెహ్రీన్ షేర్ చేసిన పోస్టు వైరల్ అవ్వడమే కాకుండా పలు రకాల అభిప్రాయాలకు తెరలేపుతోందని చెప్పవచ్చు.
HHVM Release date:ఇది కదా అసలైన పండగంటే.. సమ్మర్ స్పెషల్ గా హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ లాక్..!
మెహ్రీన్ వ్యక్తిగత జీవితం..
ఒక మెహ్రీన్ విషయానికి వస్తే.. కెరియర్ పీక్స్ లో ఉండగానే హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు , అదంపూర్ ఎమ్మెల్యే భవ్య భిష్నోయ్ తో మార్చి 2021లో నిశ్చితార్థం జరిగింది. 2021 చివర్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే 2021లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా పెళ్లి వాయిదా పడింది. మళ్లీ సినిమాలలో నటించాలని మెహ్రీన్ కలలు కనడంతో.. ఈ విషయాన్ని పెళ్ళికొడుకు వారు ఒప్పుకోలేదని దాంతో జూలై 2021 లోనే ఈ జంట నిశ్చితార్థం రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఇక అప్పటినుంచి ఒంటరిగా ఉంటూ పలు సినిమాలలో నటిస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ గత రెండేళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా. ఇక ఈమె కెరియర్ విషయానికి వస్తే 1995 నవంబర్ 5న పంజాబ్ భటిండా లో జన్మించింది. మోడల్గా కెరియర్ ఆరంభించిన ఈమె ఆ తర్వాత నటిగా మారింది. ఇక ప్రస్తుతం ఇప్పుడు ఇలా అతనితో ప్రయాణం అంటూ పోస్ట్ షేర్ చేసింది.