Drinking Alcohol: నిలబడి నీళ్లు తాగితే జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. ఈ విషయం దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. అయితే నిలబడి నీళ్లు తాగడం వల్ల కూడా ఆరోగ్యానికి హాని జరిగే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పబ్‌లు, పార్టీలకు వెళ్లినప్పుడు చాలా మంది నిల్చొని మందు తాగుతారు. దీని వల్ల శరీరంలో ఉండే చాలా రకాల అవయవాలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిలబడి తాగినప్పుడు చాలా తక్కువ సమయంలో ఎక్కువ మద్యం తీసుకునే ఛాన్స్ ఉందట. దీంతో శరీరంలోని బ్లడ్‌లో మద్యం చాలా వేగంగా కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా బ్లడ్ ఆల్కహాల్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చాలా మందికి త్వరగా మత్తు వచ్చే ఛాన్స్ ఉందట. మరికొందరిలో తలనొప్పి, కళ్లు తిరిగి పడిపోవడం, వికారం వంటివి కనిపించే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ALSO READ: రెడ్ వైన్ VS వైట్ వైన్.. ఏది మంచిది..?
నిలబడి ఆల్కహాల్ తాగడం వల్ల గుండె, జీర్ణవ్యవస్థ, లివర్, మెదడుతో పాటు కిడ్నీల పనితీరుపై కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని అంటున్నారు. వీటి వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. నిలబడి మందు తాగితే అవయవాలపై ఎలాంటి ప్రభావం పడుతుంది..? దీని నుంచి బయట పడాంలటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
లివర్:
నిలబడి తాగినా కూర్చొని తాగినా మితిమీరి మద్యం తీసుకోవడం వల్ల లివర్‌పై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించి మద్యం తీసుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే ప్రమాదం ఉందట. లివక్ చుట్టూ చెడు కొలెస్ట్రాల్ చేరుకోడాన్ని ఫ్యాటీ లివర్ డిసీజ్ అని పిలుస్తారు. దీని వల్ల కామెర్లు కూడా వచ్చే అవకాశం ఉందని. మరికొందరిలో అయితే మందు ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ హెపటైటిస్, లివర్ సిర్రోసిస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉందని డాక్టర్లు అంటున్నారు.
మెదడు:
మద్యం తాగినప్పుడు కేంద్ర నాడీ వ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. దీని వల్ల మెమరీ పవర్, మెదడు పని తీరు మందగించే ఛాన్స్ ఉంది. అందుకే నిలబడి ఎక్కువగా మందు తాగితే కళ్లు తిరుగుతాయట. మరికొందరైతే మైకం వచ్చి కింద పడిపోతారు.
గుండె:
నిలబడి మద్యం తాగితే గుండెపై చెడు ప్రభావం పడే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల గుండె కొట్టుకునే వేగంలో మార్పులు జరిగే అవకాశం ఉందట. మరికొందరిలో రక్తపోటు పెరిగే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
జీర్ణవ్యవస్థ:
నిలబడి తాగినప్పుడు మందు నేరుగా కడుపులోకి వెళ్తుంది. దీని వల్ల వికారం, వాంతులు, యాసిడ్ రిఫ్లక్స్ వంటివి వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. నిలబడి, త్వరగా మందు తాగినప్పుడు కడుపు ఉబ్బరం, అజీర్తి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
కిడ్నీ:
నిలబడి మద్యం తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలపై చెడు ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగానే అల్కహాల్ తాగితే యూరిన్ అధికంగా వస్తుంది. నిలబడి తాగినప్పుడు మద్యం కడుపులోకి త్వరగా వెళ్లి యూరిన్ రూపంలో బయటకు వస్తుంది. దీని వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అందుకే నిలబడి మద్యం తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తాగాల్సి వచ్చినా మద్యాన్ని నెమ్మదిగా తీసుకోవాలని చెబుతున్నారు. ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకోవాలి. అలాగే మద్యం అతిగా తీసుకోవద్దు అనుకునేవారు తాగడానికి ముందు భోజనం చేయడం మంచిది.