E-Paper
Advertisement

ఇంట్లోనే బిపి మెషీన్‌తో నరాల్లో రక్తం బ్లాకేజీ చేయవచ్చా? గుండె డాక్టర్ ఏం చెప్పారంటే

ఇంట్లోనే బిపి మెషీన్‌తో నరాల్లో రక్తం బ్లాకేజీ చేయవచ్చా? గుండె డాక్టర్ ఏం చెప్పారంటే
Advertisement

గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి రక్తనాళాలు, ధమనుల్లో అడ్డంకులు ఏర్పడడమే ప్రధాన కారణం. ఈ రక్తనాళాల్లో అడ్డంకులను సాధారణంగా వైద్య పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. అయితే దేశంలో ఒక ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజ్‌వీర్ ఇంట్లోనే సింపుల్ గా ఒక బిపి మెషీన్ సాయంతో గుర్తించవచ్చు. అయితే ఈ పద్ధతి పూర్తి స్థాయి వైద్య పరీక్షలకు ప్రత్యామ్నాయం కాదు కానీ ముందస్తు హెచ్చరికలను ఇస్తుంది.

బిపి మానిటరింగ్ ఎందుకు ముఖ్యం?

ఆర్టరీ బ్లాకేజీలు (ధమని అడ్డంకులు) నెమ్మదిగా పెరుగుతాయి. ప్రారంభ దశలో లక్షణాలు స్పష్టంగా కనిపించవు. బిపిని క్రమం తప్పకుండా చూడటం వల్ల గుండె సమస్యలను ముందస్తుగా గుర్తించవచ్చు. ఒక్కసారి కాకుండా కాలక్రమేణా బిపి వ్యాల్యూ చూడడం మంచిది.

బిపి మెషీన్ ఎలా సహాయపడుతుంది?

Advertisement

రెండు చేతుల్లో కూడా బిపి చెక్ చేయండి. రెండు చేతుల్లో తేడా ఎక్కువగా ఉంటే ధమని అడ్డంకి ఉండవచ్చని అనుమానించాలి. 5 నిమిషాలు విశ్రాంతి తీసుకుని, కాఫీ తాగకుండా లేదా వ్యాయామం చేయకుండా బిపి చెక్ చేయండి. ఒకే సమయంలో రోజూ తీసుకోండి.

ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి?

ఒక చేతిలో పల్స్ తక్కువగా ఉండటం, శ్వాస ఆడకపోవడం, ఛాతీ నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ఇవి గుండె సమస్యలను సూచిస్తాయి.

బీపీ మెషిన్ ఉపయోగించి ఇంట్లోనే ధమనుల్లో బ్లాకేజ్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

Advertisement

ధమనుల్లో బ్లాకేజ్ ప్రమాదాన్ని గుర్తించడానికి ‘ఆంకిల్ బ్రాకియల్ ఇండెక్స్’ అనే సులభమైన పరీక్ష ఉపయోగపడుతుంది. ఈ పరీక్షను సాధారణ బీపీ మెషిన్‌తో ఇంట్లోనే చేయవచ్చు.

ఎలా చేయాలి?

  • చేతి బీపీ కొలవాలి
    బీపీ కఫ్‌ను పైభుజానికి కట్టుకుని బీపీ కొలవాలి. అందులో పై సంఖ్య (సిస్టోలిక్ బీపీ)ను గుర్తుంచుకోవాలి.
    ఉదాహరణకు: 120/80 అయితే 120 తీసుకోవాలి.
  • కాలి మడమ వద్ద బీపీ కొలవాలి
    కఫ్‌ను కాలి మడమ పైభాగంలో కట్టుకుని బీపీ కొలవాలి. మళ్లీ పై సంఖ్యను గుర్తించాలి.
  • రేషియో లెక్కించాలి
    కాలి బీపీ సంఖ్యను చేతి బీపీ సంఖ్యతో భాగించాలి.

ఫలితాలు ఎలా అర్థం చేసుకోవాలి?

– బిపి వ్యాల్యూ సుమారు 1.0 ఉంటే.. ధమనులు సాధారణంగా ఉన్నాయి.
– బిపి వ్యాల్యూ 0.9 కంటే తక్కువ ఉంటే.. ధమనుల్లో బ్లాకేజ్ ప్రమాదం ఉండొచ్చు.
-1.4 కంటే ఎక్కువ ఉంటే.. ధమనులు గట్టిపడి వశ్యత కోల్పోయిన సూచన కావచ్చు. ఇది చాలా ప్రమాదకరం.
బీపీ రీడింగ్ చాలా ఎక్కువగా లేదా తక్కువగా వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

గమనిక:

ఈ ఇంటి పరీక్ష కేవలం సూచన మాత్రమే ఇస్తుంది. ఇది పూర్తి వైద్య నిర్ధారణ కాదు. ఖచ్చితమైన ఫలితాల కోసం తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.

ఇంట్లో చెక్‌ చేయడం వల్ల పరిమితులు

ఇంట్లో బిపి చెక్ చూడటం వల్ల అనుమానాలు వస్తాయి కానీ పూర్తి నిర్ధారణ కాదు. ఇసీజీ, ఆంజియోగ్రఫీ వంటి వైద్య పరీక్షలు అవసరం. డయాబెటిస్, అధిక కొలెస్ట్రాల్, ఎక్కువగా కదలకుండా పనిచేయడం వంటివి గుండె పోటు ప్రమాద అవకాశాలను పెంచుతాయి.

Also Read: వేసవిలో చెమటకాయల వల్ల మంట, దురదతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సహజ పద్ధతులతో ఉపశమనం

నివారణ చర్యలు

రోజూ వ్యాయామం, సమతుల్య ఆహారం, పొగతాగడం మానడం, బరువు నియంత్రణతో ధమని అడ్డంకులను తగ్గించవచ్చు. తగినంత నీళ్లు తాగడం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

ఇంట్లో బిపి మెషీన్ ఉపయోగించి అనుమానాలను గుర్తించవచ్చు కానీ డాక్టర్ సలహా తప్పనిసరి. ఆరోగ్యకర అలవాట్లు, క్రమం తప్పని చెకప్‌లు గుండెను రక్షిస్తాయి.

Related News

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసి పెట్టండి ఇంటిల్లిపాదీ ఇష్టంగా తింటారు!

హోటల్ స్టైల్ క్రిస్పీ ఇన్‌స్టంట్ రవ్వ దోశ.. 15 నిమిషాల్లో ఇలా తయారు చేసుకోండి!

పిల్లల చేతి నుంచి ఫోన్ తీసుకోగానే ఏడుస్తున్నారా? ఇలా చేస్తే స్వయంగా ఇచ్చేస్తాడు

మన రక్తంలో ప్లాస్టిక్ విధ్వంసం.. తాజా రీసెర్చ్‌లో తేలిన సంచలన విషయాలు!

ఈ నవరాత్రులకు 3 స్పెషల్ డిషెస్.. ప్రసాదంగానూ పెట్టొచ్చు, రుచికి తిరుగే ఉండదు!

ఇడ్లీ,దోశలోకి అదిరిపోయే రుచితో ఉల్లిపాయ చట్నీలు..ఇలా చేసేయండి!

Big Stories

Advertisement
×