SRH – IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ఎలిమినేటర్ వరకు వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు (Sunrisers Hyderabad ) ఊహించని షాక్ తగిలింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం దెబ్బకు… హైదరాబాద్ ఇంటిదారి పట్టింది. బ్యాటింగ్ లో చాలా బలంగా ఉన్న హైదరాబాద్.. 244 పరుగులు చేయలేకపోయింది. 300 కూడా అవలీలగా కొట్టే హైదరాబాద్ జట్టు.. ఎలిమినేటర్ లో మాత్రం చేతులెత్తేసింది. ఈ క్రమంలో వచ్చే సీజన్ పై కావ్య పాప ( Kavya Maran) ఇప్పటి నుంచే దృష్టి పెట్టారట.
Also Read: Vaibhav-Parag: వైభవ్ పెద్ద హీరో ఏం కాదు..అసూయ బయటపెట్టిన రియాన్ పరాగ్, ఇదిగో షాకింగ్ వీడియో
ఐపీఎల్ 2027 కోసం ఇప్పటినుంచి జట్టును తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు బాగానే ఉన్నారు. కానీ మిడిల్ ఆర్డర్ కాస్త డిస్టర్బ్ గా ఉంది. కాటేరమ్మ కొడుకు క్లాసెన్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి మినహా మిడిల్ ఆర్డర్ లో తోపు ఆటగాళ్ళు లేదు. ఈ క్రమంలో మొత్తం అరడజన్ ప్లేయర్లను వచ్చే సీజన్ వరకు వదిలేసి.. దాదాపు 25 కోట్లు ఆదా చేసుకున్నందుకు ప్లాన్ చేస్తున్నారట.
2027 ఐపీఎల్ నేపథ్యంలో దాదాపు అర డజన్ ప్లేయర్లను వదిలేసేందుకు కావ్య పాప డిసైడ్ అయ్యారట. ఇందులో ముందు వరుసలో లియాం లివింగ్ స్టోన్ ఉంటాడు. ఇతన్ని 13 కోట్లు పెట్టి కొంది కావ్య. కచ్చితంగా లివింగ్ స్టోన్ ను కావ్య పాప వదిలేసేందుకు డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత హర్షల్ పటేల్ ను ₹8 కోట్లకు కొనుగోలు చేశారు కావ్య. అతన్ని కూడా వేలంలో వదిలేసేందుకు సిద్ధమయ్యారు. డేవిడ్ పైన్ ను 1.5 కోట్లకు కొనుగోలు చేయగా.. స్మరణ్ రవిచంద్రన్ (Smaran Ravichandran) రూ.30 లక్షలకు తీసుకున్నారు. శ్రీలంక ఆల్రౌండర్ కమిందు మెండిస్ ను రూ.75 లక్షలకు తీసుకోవడం జరిగింది.
అటు జయదేవ్ ఉనద్కత్ ను కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. పైన పేర్కొన్న ప్లేయర్లు ఎవరు కూడా పెద్దగా రాణించడం లేదు. అవకాశం ఇచ్చినా కూడా.. దుర్వినియోగం చేసుకున్నారు. వీళ్ళందరినీ వచ్చే సీజన్ వరకు వదిలేసేందుకు కావ్య పాప సిద్ధమయ్యారట. దీంతో దాదాపు 25 కోట్లు ఆదా చేసుకోనుంది కావ్య పాప. ఆ డబ్బులతో అదిరిపోయే కుర్రాలను నెక్స్ట్ సీజన్ సందర్భంగా కొనియవచ్చు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా నిన్న న్యూ చండీగఢ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఇందులో వైభవ్ సూర్య వంశీ 97 పరుగులు చేయడంతో రాజస్థాన్ 243 పరుగులు సాధించగలిగింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో తేలిపోయిన హైదరాబాద్, 196 పరుగుల వద్ద ప్యాకప్ అయ్యింది. దీంతో 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
Also Read: Abdul Razzaq: PSL అల్లా కంటే పవిత్రమైనది..ఐపీఎల్ అతిపెద్ద ఫిక్సింగ్ హబ్ Abdul Razzaq: PSL
Hyderabad IPL team की मलकिन Kavya Maran को इतने गुस्से में शायद ही कभी देखा गया हो।
Kavya के गुस्से की वजह 15 साल के नाबालिग Vaibhav Suryavanshi बने।
मैच के दौरान Kavya लगातार Vaibhav की तरफ इशारे करती रहीं, मगर Vaibhav ने उन इशारों को पूरी तरह नजरअंदाज करते हुए लगातार छक्के… pic.twitter.com/FQqajrjTUW
— Rehan_Idrisi (@MR_COOL77777) May 27, 2026