E-Paper
Advertisement

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్

ఆన్‌లైన్‌లో యువతితో ప్రేమ.. ప్రియురాలిని కలవడానికి 1900 కిమీ ప్రయాణం.. ఏఐ దెబ్బకు మైండ్ బ్లాక్
Advertisement

DreamGirl Turns Fake| సోషల్ మీడియాలో పరిచయమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఓ వ్యక్తి ఎన్నో కలలు కన్నాడు. ఆమెతో కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని ఆశపడ్డాడు. చివరకు ఆమెను కలవడానికి తనకున్న ఆస్తులన్నీ అమ్ముకుని దాదాపు 1,900 కిలోమీటర్లు ప్రయాణించాడు. కానీ అక్కడికి వెళ్లాక అతడికి ఊహించని నిజం తెలిసింది. తాను ఇష్టపడిన అమ్మాయి నకిలీ అని తెలిసి అతని మైండ్ బ్లాక్ అయింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

2020లో సోషల్ మీడియాలో పరిచయమైన యువతి

బ్రెజిల్‌లోని మారన్యావో రాష్ట్రానికి చెందిన ఎడిమార్ మార్టిన్స్ లేబర్ పని చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. 2020లో జెస్సికా ఒలివెరా అనే మహిళ అతని సోషల్ మీడియాలో పరిచయమైంది. ఆమెను జెస్సికా ఫజెండెయిరా అని కూడా పిలిచేవారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్ ప్రకారం ఆమె ఒక గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న యువతి. ఆమె కుటుంబం వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు ఉన్నాయి. ఆ ఖాతాకు 3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నట్లు సమాచారం. తనతో పెళ్లి చేసుకునే వ్యక్తికి ఇల్లు, ఆర్థిక సహాయం అందిస్తానని జెస్సికా తన వీడియోల్లో చెప్పింది.

తల్లిని కోల్పోయిన బాధలో ఉన్న మార్టిన్స్‌కు కొత్త ఆశలు

Advertisement

తన తల్లి మరణం తర్వాత మార్టిన్స్ ఒంటరితనంతో బాధపడుతున్నాడు. ఈ సమయంలో జెస్సికా తన జీవితంలోకి వస్తే కొత్త జీవితం ప్రారంభించవచ్చని భావించాడు. ఆమె తనకు తోడుగా ఉంటుందని, భవిష్యత్తులో మంచి జీవితం అందిస్తుందని నమ్మాడు. అందుకే ఆమెతో ఆన్‌లైన్‌లో చాటింగ్ చేసేవాడు. ఆమెను తన జీవిత భాగస్వామిగా ఊహించుకున్న మార్టిన్స్ చివరకు ఆమెను ప్రత్యక్షంగా కలవాలని నిర్ణయించుకున్నాడు.

తన వద్ద ఉన్నదంతా అమ్ముకుని 1,900 కిలోమీటర్ల ప్రయాణం

అక్టోబర్ 9న మార్టిన్స్ తనకున్న వస్తువులను అమ్మి ప్రయాణానికి డబ్బు సమకూర్చుకున్నాడు. అనంతరం బ్రెజిల్‌లోని మినాస్ గెరైస్ రాష్ట్ర రాజధాని బెలో హారిజోంటేకు బయలుదేరాడు. ఒక రోజుకు పైగా బస్సులో ప్రయాణించిన అతడు అక్టోబర్ 11న అక్కడికి చేరుకున్నాడు. జెస్సికా ఫొటోలను వెంట తీసుకెళ్లి స్థానికులను ఆమె గురించి అడిగాడు. అయితే ఆమె ఎవరో ఆ ప్రాంతంలో ఎవరికీ తెలియలేదు. చివరకు ఓ స్థానిక రేడియో స్టేషన్‌ను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. జెస్సికా నిజమైన మహిళ కాదని, AIతో సృష్టించిన కల్పిత పాత్ర అని అతడికి తెలిసింది.

Advertisement

Also Read: మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

AI పాత్ర సృష్టించిన వ్యక్తి ఏమన్నాడంటే?

ఆ సోషల్ మీడియా ఖాతా వెనుక ఉన్న వ్యక్తి జెస్సికా AIతో రూపొందించిన పాత్రేనని అంగీకరించాడు. మార్టిన్స్‌తో నేరుగా ఎప్పుడూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. ఆ ఖాతా ద్వారా వ్యాపార ప్రయోజనాల కోసం ఎంగేజ్‌మెంట్ పొందడమే తమ ఉద్దేశమని తెలిపాడు. జెస్సికా ఏఐ పాత్ర ఆన్‌లైన్‌లో యూజర్స్‌తో స్పందించి చాట్ చేస్తుందని అన్నాడు. ఇదంతా విని మార్టిన్స్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. సంబంధం కోసం నిజాయితీగా ప్రయత్నించానని, ఈ అనుభవం తనకు బాధను మిగిల్చిందని చెప్పాడు.

Also Read: ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

మార్టిన్స్‌కు సాయం చేసిన అధికారులు

ప్రయాణానికి డబ్బంతా ఖర్చు కావడంతో మార్టిన్స్ బెలో హారిజోంటేలో చిక్కుకుపోయాడు. దీంతో స్థానిక అధికారులను సహాయం కోరాడు. సామాజిక కార్యకర్తలు అతడికి ఆహారం, స్నానం చేసుకునే సదుపాయాలు కల్పించారు. తిరిగి వెళ్లేందుకు బస్సు టికెట్ కూడా అందించారు. అయితే ఈ అనుభవంతో ప్రేమపై తన ఆశలను వదులుకోలేదని మార్టిన్స్ తెలిపాడు. మరోసారి బెలో హారిజోంటేకు వెళ్లి తనకు సరైన జీవిత భాగస్వామిని వెతుక్కుంటానని చెప్పాడు.

ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతి వ్యక్తిని నిజమైన వ్యక్తిగా నమ్మకూడదని ఈ ఘటన గుర్తుచేస్తోంది. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి వంటి కీలక నిర్ణయాలు తీసుకునే ముందు వారి గుర్తింపును నిర్ధారించుకోవడం ఎంతో ముఖ్యం.

Related News

ఆటిజం ఉన్న పిల్లలకు ఏకాగ్రత మెరుగుపరిచే టెక్నిక్.. కొత్త అధ్యయనంలో ఆసక్తికర ఫలితాలు

ఘాటు ఘాటుగా మష్రూమ్ పెప్పర్ ఫ్రై.. ఒక్కసారి ఇలా ట్రై చేస్తే టేస్ట్ అద్భుతం!

వంట రాని వాళ్లు కూడా నిమిషాల్లో చేసేయగల సూపర్ టేస్టీ పన్నీర్ భుర్జీ రెసిపీ!

థీమ్ పార్కుకు వెళుతున్నారా? జాగ్రత్త రోలర్ కోస్టర్ రైడ్స్‌తో మెదడుకు ప్రమాదం

పిల్లలు వద్దనుకోవడం స్వార్థమా? సమాజం చేసే విమర్శలకు సమాధానమిదే

భార్యా, తల్లా.. ఇద్దరి మధ్య నలిగిపోకుండా భర్త ఏం చేయాలి?

పిల్లల ఆరోగ్యంతో చెలగాటం వద్దు.. బేబీ ఫుడ్‌లో చక్కెరపై FSSAI కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×