Muhammad Sarwar: లష్కరే తోయిబా (LeT) కీలక నాయకుడు, గ్లోబల్ టెర్రరిస్ట్ చౌదరి మహమ్మద్ సర్వార్ పాకిస్థాన్లోని లాహోర్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. లాహోర్లోని ఒక మసీదులో నమాజ్ చేయడానికి మెట్లు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
సంస్థలో సర్వార్ పాత్ర
లష్కరే తోయిబా స్థాపక సభ్యులలో ఒకరైన సర్వార్, సంస్థలో చాలా కీలకమైన స్థానాల్లో పనిచేశాడు. LeT ఆర్థిక విభాగానికి డిప్యూటీ చీఫ్గా బాధ్యతలు నిర్వర్తించడంతో పాటు, పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ చీఫ్గా సుదీర్ఘకాలం వ్యవహరించాడు.
ఉగ్రవాద కార్యకలాపాలు, నిధుల సమీకరణ
పంజాబ్ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తరించడంలో ఇతడు ముఖ్యపాత్ర పోషించాడు. కొత్తగా యువకులను ఉగ్రవాదంలోకి రిక్రూట్ చేసుకోవడం, సంస్థ నిర్వహణకు కావలసిన నిధులను విరాళాల రూపంలో వసూలు చేయడమే ఇతని ప్రధాన బాధ్యత. సర్వార్ మరణంతో లష్కరే తోయిబా ఆర్థిక, రిక్రూట్మెంట్ వ్యవస్థకు పెద్ద దెబ్బ తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: కేసీఆర్ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్