ఆశ ఉండవచ్చు గానీ.. అత్యాశ ఉండకూడదు అంటారు పెద్దలు. ఉన్నదానితో సరిపెట్టుకోకుండా.. ఇంకా కావాలని తపిస్తే.. ఇదిగో ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు పట్టిన గతే పడుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.85 లక్షల ఫాలోవర్లు కలిగిన ప్రముఖ బ్రిటీష్-నైజీరియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇటీవల థాయిల్యాండ్‌లోని బ్యాంకాక్‌కు వెళ్లాడు. అక్కడే అతడికి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. సరదాగా తన రహస్య భాగాన్ని పెద్దగా, పొడవుగా మార్చుకుంటే ఎలా ఉంటుందని భావించాడు. ఇందుకు అతడి భార్య డానియెల్ సింబా అల్లెన్ కూడా అంగీకరించింది. దీంతో కాస్మెటిక్ చికిత్స చేయించుకున్నాడు. అది సక్సెస్ కావడంతో మనోడి ఆనందానికి అవధుల్లేవు. ఆ తర్వాత భార్యతో కలిసి స్పాకు వెళ్లాడు. అక్కడే ఏదో తేడా కొట్టింది.
ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెత్ అంటే ఇదే కాబోలు అంటూ ఉబిరిబో మరణంపై కొంతమంది వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. అతడిని అంత చులకనగా చూడటానికి కారణం.. అతడు ఎంచుకున్న కాస్మిటిక్ చికిత్స. 43 ఏళ్ల ఉబిరిబో తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో బాడీని చూపిస్తూ.. ఫాలోవర్లను మంచిగానే పెంచుకున్నాడు. బాడీ షేపుల కోసం ఇప్పటికే పలు కాస్మిటిక్ సర్జరీలు చేయించుకున్నట్లు టాక్. వాటిలాగానే.. జెనిటల్ ఎనలార్జ్‌మెంట్ చికిత్స కూడా వర్కవుట్ అవుతుందని అనుకున్నాడు. పెద్దగా నొప్పి లేకుండానే.. సర్జరీ పూర్తయిపోయింది.
ఈ సర్జరీలో భాగంగా క్లీనిక్‌లో 40 మిల్లీ లీటర్ల హయాలురోనిక్ యాసిడ్, లిడోకైన్ ఫిల్లర్లను ఇంజెక్షన్ల ద్వారా ‘ఆ’ భాగంలోకి ఎక్కించారు. దాని వల్ల సాధారణం కంటే ఎక్కువ లావుగా, పొడవుగా ఆకర్షణీయంగా ఆ భాగం కనిపిస్తుంది. దీనికి పెద్దగా రెస్ట్ కూడా అవసరం ఉండదు. థాయ్‌లాండ్‌కు వెళ్లే పర్యటకులు చాలామంది ఈ సర్జరీ చేయించుకుంటున్నారు. అయితే, ఉబిరిబో విషయంలో పెద్ద పొరపాటే జరిగింది. దాని వల్ల స్పాలో తీవ్రమైన గుండె నొప్పితో రెండుసార్లు స్పృహ కోల్పోయాడు. సీపీఆర్ (CPR) చేసిన సరే బతకలేదు.
ఈ ఘటన మార్చి నెలలో చోటుచేసుకోగా.. లండన్‌లోని ఇన్వెస్ట్ కోర్టు ఇటీవలే దీనిపై విచారణ చేపట్టింది. పోస్ట్ మార్టం నివేదిక వివరాలను పరిశీలించింది. ‘పెనైల్ ఫిల్లర్’ ప్రక్రియలో భాగమంగా ఉబిరిబో అంగానికి ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన హయాలురోనిక్ యాసిడ్ రక్త నాళాల ద్వారా ఊపిరితీత్తుల్లోకి చేరి.. రక్తం గడ్డకట్టేలా చేసిందని తేలింది. అందువల్లే అతడు మరణించాడని అందులో ఉంది. చూశారుగా.. అత్యాశకు పోతే ఏమైందో. మీరు కూడా ఇలాంటి కాస్మొటిక్ సర్జరీల నుంచి జాగ్రత్తగా ఉండండి. ఉబిరిబోకు 2022లో పెళ్లయ్యింది. లండన్, లాస్ ఏంజిల్స్‌లో మిలియన్ డాలర్ల విలువైన ప్రాపర్టీలు ఉన్నాయి. కానీ, ఒక చిన్న క్రేజీ ఐడియా అతడి ప్రాణలను హరించింది.
Also Read: ఎప్పుడు క్షమాపణ అడగాలి? ఎప్పుడు సంబంధాన్ని తెంచుకోవాలి?.. సంతోషకర జీవితానికి చాణక్యుడి సూచనలు
Disclaimer: This article is published purely for informational and educational purposes based on international news reports. It does not constitute medical advice, diagnosis, or treatment. Readers are strongly advised to consult qualified medical professionals or certified cosmetic experts before undergoing any cosmetic or surgical procedures.